కర్నూలు(కోస్గి): కర్నూలు జిల్లా కోస్గి మండలకేంద్రానికి చెందిన కాయన్న(52) అనే వ్యక్తి సోమవారం అతిసారాతో మరణించాడు. ఆదివారం ఉదయం వాంతులు, విరేచనాలు కావడంతో కోస్గి ఏరియా ఆసుపత్రిలో చేరాడు. కాయన్న పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబసభ్యులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ సోమవారం ఆయన మరణించాడు.