Diarrhoeal
-
జిల్లాలో అదుపులోనే అతిసార
అన్ని ఆసుపత్రుల్లో అందుబాటులో మందులు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి జిల్లా వైద్యశాఖ అధికారి అమర్‌సింగ్ నాయక్ జోగిపేట: జిల్లాలో అతిసార అదుపులోనే ఉందని జిల్లా వైద్యశాఖ అధికారి అమర్ సింగ్ నాయక్ తెలిపారు. జోగిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అతిసారతో చికిత్సపొందుతున్న రోగులను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వి లేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం వంద మంది అతిసారతో ఆసుపత్రుల్లో చికిత్స లు పొందుతున్నారన్నారు నలుగురి పరిస్థితి బాగా లేకపోవడంతో జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి రోగాలు రావన్నారు. భో జనం చేసేటప్పుడు, మల, మూత్ర విసర్జనలకు వెళ్లినప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కోవాలన్నారు. నీటి కాలుష్యం వ ల్లనే అతిసార వ్యాధికి గురవుతున్నారన్నారు. 15 రోజులకొకసారి గ్రామాల్లో తాగునీటి ట్యా ంకులను శుభ్రం చేయాలని, క్లోరినేషన్ చేయాలని తెలిపారు. నీటిని ప్రతిరోజు వేడి చేసుకొని చల్లారిన తర్వాత సేవించడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటాడన్నారు. డాక్టర్లు నృపేన్ చక్రవర్తి, భవానీ, స్వప్న ఆయన వెంట ఉన్నారు. -
విజృంభిస్తున్న అతిసార
తాండూరు: రంగారెడ్డి జిల్లా తాండూరులో అతిసార విజృంభించింది. దీంతో రోజురోజుకూ అతిసార బాధితులు పెరిగిపోతున్నారు. రెండు రోజుల వ్యవధిలో 200 మంది అతిసారతో ఆస్పత్రిలో చేరారు. వారిలో నలుగురు మృత్యవాత పడ్డారు. బుధవారం 80 మంది అతిసారతో జిల్లా ఆస్పత్రిలో చేరినట్టు ఇన్చార్జి సూపరింటెండ్ భాగ్యశేఖర్ తెలిపారు. బాధతుల్లో 60 మంది చిన్నారులు ఉన్నట్టు ఆయన తెలిపారు. -
అతిసార తో వ్యక్తి మృతి
కర్నూలు(కోస్గి): కర్నూలు జిల్లా కోస్గి మండలకేంద్రానికి చెందిన కాయన్న(52) అనే వ్యక్తి సోమవారం అతిసారాతో మరణించాడు. ఆదివారం ఉదయం వాంతులు, విరేచనాలు కావడంతో కోస్గి ఏరియా ఆసుపత్రిలో చేరాడు. కాయన్న పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబసభ్యులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ సోమవారం ఆయన మరణించాడు. -
కోస్గిలో ప్రబలిన అతిసార: ఇద్దరు మృతి
కర్నూలు : కర్నూలు జిల్లా కోస్గి మండలంలో అతిసార పంజా విసిరింది. నాలుగు రోజుల వ్యవధిలోనే 100 మందిపైగా ఈ వ్యాధి బారినపడ్డారు. పరిస్థితి విషమించి గ్రామానికి చెందిన రాగమ్మ(75) అనే మహిళ మంగళవారం మృతిచెందగా, సుగమ్మ(60) అనే మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది. తాగు నీరు సరఫరా చేసే పైపుల్లోకి డ్రైనేజీ నీరు చేరడం, విషమించిన పారిశుద్ధ్య పరిస్థితులే వ్యాధి పెచ్చుమీరటానికి కారణమని భావిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారు కోస్గి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. (కోస్గి) -
ఎల్కల్‌లో అతిసార 50 మందికి అస్వస్థత
దౌల్తాబాద్, న్యూస్‌లైన్: అతిసార ప్రబలడంతో 50 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన దౌల్తాబాద్ మండలం ఎల్కల్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. ఎల్కల్‌లో తాగునీరు కలుషితం కావడంతో పాటు పారిశుద్ధ్యం లోపించడంతో మూడు రోజులుగా ప్రజలు వాంతులు, విరేచనాలతో గ్రామస్తులు బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం పరిస్థితి తీవ్రం కావడంతో 50 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో స్పందించిన గ్రామస్తులు అస్వస్థతకు గురైన వారిని వెంటనే గజ్వేల్, హైదరాబాద్ ఆస్పత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. మరోవైపు కొంతమందికి స్థానిక పంచాయతీ కార్యాలయంలోనే ఏఎన్ఎంలు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న గజ్వేల్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సునీల్‌రాజా గ్రామాన్ని సందర్శించారు. అంతకు ముందు తొగుట సీఐ వెంకటేశ్వర్లు కూడా ఎల్కల్ వెళ్లి వివరాలు సేకరించారు. అవసరమైన సాయం అందించాలని బేగంపేట పోలీసులను ఆదేశించారు. ఈ విషయమై జిల్లా వైద్యాధికారిని డాక్టర్ పద్మను ‘న్యూస్‌లైన్’ ఫోన్లో సంప్రదించగా తనకు ఎల్కల్‌లో అతిసార ప్రబలిన సంగతే తెలియదని చెప్పారు. అయినా వెంటనే అధికారులను అప్రమత్తం చేస్తానన్నారు. -
అతిసారకు చిన్నారి బలి
ఇంద్రవెల్లి, న్యూస్‌లైన్ : ఆడుతూ పాడుతూ గడిపిన చిన్నారి గంటల వ్యవధిలోనే మృత్యు ఒడికి చేరింది. అతిసార రూపంలో మృత్యువు కబళించింది. గ్రామంలో పీరీలు, దోలా ఉత్సవాలు తిలకించి నిద్రలోకి జారుకున్న బాలిక ఆ తర్వాత శాశ్వత నిద్రలోకి చేరింది. ఈ సంఘటన మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో శుక్రవారం విషాదం మిగిల్చింది. తల్లిదండ్రులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని కేస్లాపూర్ గ్రామానికి చెందిన మడావి మధుకార్, లలిత దంపతులకు ఇద్దరు కూతుళ్లు వైష్ణవి, శ్రావణి ఉన్నారు. చిన్న కూతురు శ్రావణి(4) గురువారం అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి వచ్చింది. మధ్యాహ్నం అక్కడే భోజనం చేసింది. గ్రామంలో పీరీలు, దోలా ఉత్సవాలు ఉండడంతో రాత్రి పది గంటలకు వరకు గ్రామస్తులు చేసిన నృత్యాలు చూస్తూ గడిపింది. ఆ తర్వాత నిద్రపోయింది. రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు అయ్యాయి. తల్లిదండ్రులు ఆటోలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. -
ఆరు గ్రామాల్లో ప్రబలిన అతిసార
మోమిన్‌పేట, న్యూస్‌లైన్: మండల పరిధిలో ఆరు గ్రామాల్లో అతిసార వ్యాధి విజృంభిస్తోంది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 27మంది అతిసార వ్యాధితో చికిత్స పొందినట్లు వైద్యాధికారి సాయిబాబ తెలిపారు. మోమిన్‌పేటలో 10 మంది, రాంనాథ్‌గుడుపల్లిలో 14 మంది, గోవిందాపూర్‌లో 8మంది, వెల్చాల్లో నలుగురు, చంద్రాయన్పల్లి ఇద్దరు, మొరంగపల్లిలో ఇద్దరు, ఇజ్రాచిట్టంపల్లిలో ఇద్దరు అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. రాంనాథ్గుడుపల్లి, గోవిందాపూర్ గ్రామాల్లో వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కలుషిత తాగు నీటితోనే అతిసార వ్యాధి ప్రబలుతున్నట్లు ఆయన చెప్పారు. కాచి వడబోసిన నీటినే తాగాలని ప్రజలకు సూచించారు. పైప్లైన్ల లీకేజీలు అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీశాఖను కోరారు. వ్యాధిగ్రస్తులు పెరిగితే.... రాంనాథ్గుడుపల్లి, గోవిందాపూర్లలో కలుషిత నీరు లేకుండా చూడాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులను తహసీల్దార్ రవీందర్ ఆదేశించారు. పైప్‌లైన్ లీకేజీలకు మరమ్మతులు చేసిన తర్వాత కూడా వ్యాధి ప్రబలితే గ్రామాల్లో కల్లు విక్రయాలను నిలిపివేస్తామని చెప్పారు. ఈ విషయమై ఎక్సైజ్ అధికారులకు కూడా సమాచారం ఇచ్చినట్లు తహసీల్దార్ చెప్పారు. ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన భరోసానిచ్చారు.