మాట్లాడుతున్న అమర్‌సింగ్ నాయక్
- అన్ని ఆసుపత్రుల్లో అందుబాటులో మందులు
- పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి
- జిల్లా వైద్యశాఖ అధికారి అమర్‌సింగ్ నాయక్
జోగిపేట: జిల్లాలో అతిసార అదుపులోనే ఉందని జిల్లా వైద్యశాఖ అధికారి అమర్ సింగ్ నాయక్ తెలిపారు. జోగిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అతిసారతో చికిత్సపొందుతున్న రోగులను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వి లేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం వంద మంది అతిసారతో ఆసుపత్రుల్లో చికిత్స లు పొందుతున్నారన్నారు నలుగురి పరిస్థితి బాగా లేకపోవడంతో జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి రోగాలు రావన్నారు. భో జనం చేసేటప్పుడు, మల, మూత్ర విసర్జనలకు వెళ్లినప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కోవాలన్నారు. నీటి కాలుష్యం వ ల్లనే అతిసార వ్యాధికి గురవుతున్నారన్నారు. 15 రోజులకొకసారి గ్రామాల్లో తాగునీటి ట్యా ంకులను శుభ్రం చేయాలని, క్లోరినేషన్ చేయాలని తెలిపారు. నీటిని ప్రతిరోజు వేడి చేసుకొని చల్లారిన తర్వాత సేవించడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటాడన్నారు. డాక్టర్లు నృపేన్ చక్రవర్తి, భవానీ, స్వప్న ఆయన వెంట ఉన్నారు.