సాక్షి, జోగిపేట (ఆందోల్): ఓ వృద్ధురాలు కరోనా వ్యాక్సిన్ కోసం వచ్చిది. ఆమెకు వ్యాక్సిన్ వేసిన వైద్య సిబ్బంది.. ఫొటోలకు ఫోజు ఇస్తూ మరోసారి వ్యాక్సిన్ వేసేశారు.. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఈ ఘటన జరిగింది. అందరికీ వ్యాక్సినేషన్‌లో భాగంగా ఆదివారం జోగిపేట రిక్షాకాలనీలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. వైద్య సిబ్బంది ఈ కాలనీకి చెందిన సాబేరా బేగం (63)కు ముందే వ్యాక్సి న్ ఇచ్చారు.
చదవండి: ఉడుతకి వైద్యం చేశారని.. అప్పటినుంచి అక్కడే ఉండిపోయింది
కాసేపటికే మున్సిపల్ సిబ్బంది అక్కడికి చేరుకొని వ్యాక్సినేషన్ ఫొటో కావాలని అడిగారు. వ్యాక్సిన్ కోసం వచ్చిన వారందరినీ వరుసగా నిలబెట్టారు. అయితే సదరు వైద్య సిబ్బంది సాబేరా బేగం చేతికి సిరంజి పెట్టి ఫొటోకు పోజు ఇచ్చారు. అలాగే రెండో సారి వ్యాక్సిన్ వేశారు. తనకు మళ్లీ ఇంజక్షన్ చేశారేమిటంటూ సాబేరా బేగం ఆందోళన చెందడంతో.. జోగిపేట ఆస్పత్రికి తరలించి అబ్జర్వేషన్‌లో పెట్టారు. ఘటనపై కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
చదవండి: ఏమైందో ఏమో.. బయటకెళ్లిన ఇద్దరు యువతులు తిరిగి రాలేదు..
Comments
Please login to add a commentAdd a comment