Health care workers
-
కోవిడ్‌తో వచ్చే మానసిక సమస్యలకు వైద్యం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: కోవిడ్ సోకి తగ్గిన అనంతరం పలువురికి శారీరక సమస్యలే కాకుండా రకరకాల మానసిక సమస్యలు వస్తున్నాయి. మానసికంగా బాధపడుతున్న వారికి యునిసెఫ్, ఎయిమ్స్ (మంగళగిరి) సంస్థలు ప్రత్యేక చికిత్స అందిస్తున్నాయి. అన్ని రకాల మానసిక సమస్యలకు సేవలు అందించడానికి హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేశాయి. హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కోవిడ్ విధుల్లో వీరు ఆందోళనతో ఉంటున్నారు. తమకు ఎక్కడ కరోనా వైరస్ సోకుతుందోనని భయపడుతున్నారు. ఇలాంటి వారి మానసిక సమస్యలకు కౌన్సెలింగ్ నిర్వహించి, మందులు ఇవ్వడానికి ఈ రెండు సంస్థలు కృషి చేస్తున్నాయి. మానసిక సమస్యల్లో ఎక్కువగా నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఇకపై ఏమీ చేయలేమేమో అన్న ఆలోచనలో ఉంటున్నారు. నిద్ర లేమి, కుటుంబ సభ్యులు కరోనా బారిన పడతారేమోనన్న ఆందోళన వారిని వేధిస్తోంది. ఈ నంబర్లకు ఫోన్ చేస్తే చాలు ఎయిమ్స్‌లో 9494774372, 9494774082 నంబర్లకు ఫోన్ చేస్తే చాలు.. ఒత్తిడి నుంచి బయటపడేందుకు అక్కడి వైద్యులు కౌన్సెలింగ్ ఇవ్వడమే కాకుండా మందులనూ సూచిస్తారు. హెల్త్‌కేర్ వర్కర్లు వివరాలు ఇవ్వాలని ఎయిమ్స్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. తీవ్ర ఒత్తిడిలో ఉన్న వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని యునిసెఫ్ ప్రతినిధి ఒకరు ‘సాక్షి’తో అన్నారు. హెల్త్‌కేర్ వర్కర్లతో పాటు పోలీసులు, మున్సిపల్ సిబ్బందికి ఉపయోగకరమన్నారు. ప్రస్తుతానికి మంగళగిరి ఎయిమ్స్‌లో మాత్రమే కేంద్రం ఉందని, భవిష్యత్‌లో మరిన్ని చోట్ల కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, ఇప్పటి వరకూ 2 వేల మంది హెల్త్‌కేర్ వర్కర్లకు స్క్రీనింగ్ చేశామని, మరో 400 మందికి చికిత్స చేశామని తెలిపారు. -
జోగిపేట: ఫొటోకు పోజు కోసం.. వృద్ధురాలికి ఒకేసారి రెండు డోసులు
సాక్షి, జోగిపేట (ఆందోల్): ఓ వృద్ధురాలు కరోనా వ్యాక్సిన్ కోసం వచ్చిది. ఆమెకు వ్యాక్సిన్ వేసిన వైద్య సిబ్బంది.. ఫొటోలకు ఫోజు ఇస్తూ మరోసారి వ్యాక్సిన్ వేసేశారు.. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఈ ఘటన జరిగింది. అందరికీ వ్యాక్సినేషన్లో భాగంగా ఆదివారం జోగిపేట రిక్షాకాలనీలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. వైద్య సిబ్బంది ఈ కాలనీకి చెందిన సాబేరా బేగం (63)కు ముందే వ్యాక్సి న్ ఇచ్చారు. చదవండి: ఉడుతకి వైద్యం చేశారని.. అప్పటినుంచి అక్కడే ఉండిపోయింది కాసేపటికే మున్సిపల్ సిబ్బంది అక్కడికి చేరుకొని వ్యాక్సినేషన్ ఫొటో కావాలని అడిగారు. వ్యాక్సిన్ కోసం వచ్చిన వారందరినీ వరుసగా నిలబెట్టారు. అయితే సదరు వైద్య సిబ్బంది సాబేరా బేగం చేతికి సిరంజి పెట్టి ఫొటోకు పోజు ఇచ్చారు. అలాగే రెండో సారి వ్యాక్సిన్ వేశారు. తనకు మళ్లీ ఇంజక్షన్ చేశారేమిటంటూ సాబేరా బేగం ఆందోళన చెందడంతో.. జోగిపేట ఆస్పత్రికి తరలించి అబ్జర్వేషన్లో పెట్టారు. ఘటనపై కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. చదవండి: ఏమైందో ఏమో.. బయటకెళ్లిన ఇద్దరు యువతులు తిరిగి రాలేదు.. -
వ్యాక్సిన్: ఆస్పత్రి సెక్యూరిటీ గార్డు మృతి
భువనేశ్వర్: కరోనా వ్యాక్సిన్ వచ్చిందని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో కోవిడ్ టీకా వేసుకున్నవారు మరణిస్తుండటంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఒడిశాలో కరోనా టీకా వేసుకున్న ఆస్పత్రి సెక్యూరిటీ గార్డ్ ప్రాణాలు విడిచాడు. నౌపద జిల్లాలోని దియాన్‌ముందకు చెందిన 27 ఏళ్ల వ్యక్తి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. జనవరి 23న అతడు కోవిడ్ టీకా తీసుకున్నాడు. ఎప్పటిలాగే విధుల్లోకి వచ్చిన అతడు సోమవారం అనారోగ్యం పాలు కావడంతో అదే ఆస్పత్రిలో చేరాడు. పరిస్థితి విషమించడంతో అతడిని వీఐఎమ్ఎస్ఏఆర్ ఆస్పత్రికి తరలించగా మంగళవారం తుదిశ్వాస విడిచాడు. (చదవండి: వరంగల్: టీకా తీసుకున్న హెల్త్‌కేర్ వర్కర్ మృతి) అయితే అతడు వ్యాక్సిన్ వల్ల చనిపోలేదని నౌపద జిల్లా ప్రధాన వైద్యాధికారి కాళీప్రసాద్ బెహెరా పేర్కొన్నారు. బాధితుడు అనీమియా, థ్రాంబోసైటోపేనియా వంటి వ్యాధులతో సతమతమవుతున్నాడని, ఈ క్రమంలో అతడి ప్లేట్లెట్స్ తగ్గిపోయి, అనారోగ్యంతో మరణించాడని తెలిపారు. (చదవండి: వ్యాక్సిన్ రేస్‌లో టాప్‌టెన్‌లో భారత్) -
ఏ టీకా అనేది మన ఇష్టం కాదు
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్‌కు కేంద్ర ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. టీకా సరఫరా కోసం ఉద్దేశించిన కో–విన్ యాప్‌లో ఇప్పటికే కోటి మందికిపైగా తమ పేర్లు నమోదు చేసుకున్నారు. మరో మూడు రోజుల్లోనే వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌కు ప్రభుత్వం అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలిదశలో ఈ నెల 16వ తేదీ నుంచి ఈ వ్యాక్సిన్లను దాదాపు 3 కోట్ల మంది హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ఉచితంగా అందజేయనున్నారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్‌లో నిర్దిష్టంగా ఏదైనా ఒకటి ఎంచుకునే అవకాశం లబ్ధిదారులకు లేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. రెండు టీకాల్లో ఎవరికి ఏ టీకా వేయాలన్నది ప్రభుత్వమే నిర్ధారిస్తుందని వెల్లడించింది. అంటే ఇష్టమైన టీకా తీసుకునే వెసులుబాటు లేనట్లే. వచ్చే ఎనిమిది నెలల్లో దేశంలో 30 కోట్ల మందికి కరోనా టీకా ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 16.5 లక్షల కోవాగ్జిన్ డోసులు ఉచితం కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను భారత్‌లో పుణేలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) ఉత్పత్తి చేస్తోంది. తొలిదశలో ఈ సంస్థ నుంచి 1.1 కోట్ల టీకా డోసులు, భారత్ బయోటెక్ నుంచి 55 లక్షల డోసుల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మొదటి 10 కోట్ల డోసుల్లో ఒక్కో డోసును రూ.200 చొప్పున ధరకు ప్రభుత్వానికి విక్రయించనున్నట్లు సీరం సంస్థ సీఈవో అదార్ పూనావాలా చెప్పారు. పన్నులతో కలుపుకుంటే ఒక్కో డోసు ధర రూ.220కు చేరుతుందన్నారు. ఇక కోవాగ్జిన్ ధర పన్నులు లేకుండా ఒక్కో డోసు రూ.295. పన్నులు కూడా కలిపితే రూ.309.5 అవుతుంది. 55 లక్షల డోసుల కొనుగోలుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకోగా, ఇందులో 16.5 లక్షల డోసులను ఉచితంగా సరఫరా చేస్తామని భారత్ బయోటెక్ హామీ ఇచ్చింది. ఈ లెక్కన చూస్తే కోవాగ్జిన్ ఒక్కో డోసు రూ.206కే ప్రభుత్వం కొన్నట్లు అవుతుందని అధికారులు చెప్పారు. వ్యాక్సినేషన్ నేపథ్యంలో కరోనా టీకాల చేరవేత ఊపందుకుంది. విమానాల్లో తొలుత ప్రధాన నగరాలకు, అక్కడి నుంచి ద్వితీయశ్రేణి నగరాలు, పట్టణాలకు జాగ్రత్తగా, వేగంగా చేరవేస్తున్నారు. కరోనా టీకా రెండో డోసు తీసుకున్న 14 రోజుల తర్వాత దాని ప్రభావం కనిపించడం మొదలవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ బుధవారం చెప్పారు. -
16 నుంచి వ్యాక్సినేషన్
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కోవిడ్–19 వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్‌లో ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుంది. 3 కోట్ల మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు తొలి డోసు అందజేయనున్నారు. త్వరలో రాబోయే లోహ్రీ, మకర సంక్రాంతి, పొంగల్, మాఘబిహూ తదితర పండుగలను దృష్టిలో పెట్టుకొని 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించాలని నిర్ణయించినట్లు కేంద్రం వెల్లడించింది. న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్–19 వ్యాక్సినేషన్ కార్యక్రమం ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 3 కోట్ల మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు తొలి డోసు అందజేయనున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తాజా పరిస్థితి, వ్యాక్సిన్ సన్నద్ధతపై ప్రధాని ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. త్వరలో రాబోయే లోహ్రీ, మకర సంక్రాంతి, పొంగల్, మాఘబిహూ తదితర పండుగలను దృష్టిలో పెట్టుకొని ఈ నెల 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్ల తర్వాత 50 ఏళ్ల వయసు పైబడిన వారికి, 50 ఏళ్లలోపు వయసుండి రకరకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా వీరంతా కలిపి 27 కోట్ల మంది ఉంటారని అంచనా. రెండు టీకాలకు అనుమతి అక్స్‌ఫర్ట్ వర్సిటీ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ వారి కోవాగ్జిన్‌కు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు వ్యాక్సిన్లు సురక్షితమేనని, కరోనాకు వ్యతిరేకంగా మనిషి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతున్నట్లు తేలిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్ సరఫరాకు ప్రభుత్వం కో–విన్ అనే డిజిటల్ వేదికను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు 79 లక్షల మంది లబ్ధిదారులు ఇందులో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొనే 61 వేల మంది ప్రోగ్రామ్ మేనేజర్లు, 2 లక్షల మంది వ్యాక్సినేటర్లు, మరో 3.7 లక్షల మంది సిబ్బందికి రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయిల్లో ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది. వ్యాక్సినేషన్ సన్నద్ధత కోసం ఇప్పటికే మూడు దఫాలుగా డ్రైన్ రన్ నిర్వహించింది. కీలకమైన ముందడుగు: ప్రధాని మోదీ కరోనా మహమ్మారిపై పోరాటం విషయంలో ఈ నెల 16వ తేదీన భారత్ కీలకమైన ముందడుగు వేయబోతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తాజాగా ట్వీట్ చేశారు. ఆ రోజు నుంచే దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ మొదలవుతుందని చెప్పారు. వ్యాక్సిన్ పంపిణీలో వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, సఫాయి కర్మచారీలు, ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ప్రాధాన్యం లభిస్తుందని వెల్లడించారు. -
వ్యాక్సిన్ సైరన్.. ఎవరెవరికి ఎప్పుడంటే..
సాక్షి, హైదరాబాద్: సిటీలో కరోనా వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధం చేస్తున్నారు. తొలి విడతలో దాదాపు లక్షా 20 వేల మంది హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ వేస్తారు. ఈ మేరకు ఈ ప్రక్రియను సమర్థంగా నిర్వహించేందుకు వైద్య ఆరోగ్యశాఖ సన్నాహాలు చేపట్టింది. వ్యాక్సిన్ తీసుకునే లబ్ధిదారులను గుర్తించి వారి వివరాలను కోవిన్ పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 1602 వ్యాక్సిన్ కేంద్రాల్లో 1.20 లక్షల మంది లబ్ధిదారులకు వ్యాక్సిన్ వేస్తారు. ఎంపిక చేసిన లబ్ధిదారులు ఏ రోజు? ఏ సమయంలో? ఏ కేంద్రానికి చేరుకోవాలి వంటి సమాచారం ముందస్తుగా వారి ఫోన్ నెంబర్‌కు మెస్సేజ్ వస్తుంది. ఆ మేరకు వారు తగిన గర్తింపు కార్డు తీసుకొని ఆయా కేంద్రాలకు చేరుకోవాలి. సెంటర్లోని రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద తమ ఫోన్‌కు వచ్చిన ఓటీపీ(వన్ టైం పాస్వర్డ్)ను ఇస్తే వారు అన్ని వివరాలను ధృవీకరించుకుని ఆ తర్వాతే వ్యాక్సిన్ ఇస్తారు. ఈ ప్రక్రియ మొత్తం ఐదు నుంచి పది నిమిషాల్లో పూర్తవుతుంది. ఇలా ఒక్కో సెంటర్లో వంద మందికి వ్యాక్సిన్ వేయనున్నారు. చదవండి: ‘క్లినికల్’ తరహాలో కోవాగ్జిన్ టీకా వ్యాక్సిన్ కేంద్రాల ఎంపిక ఇలా ⇔ నిబంధనల ప్రకారం వ్యాక్సినేషన్ సెంటర్లో మూడు గదులతో పాటు ఎంట్రెన్స్, ఎగ్జిట్లు వేర్వేరుగా ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. ⇔ ఇలా ఇప్పటి వరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను వ్యాక్సిన్ సెంటర్లుగా ఎంపిక చేశారు. ⇔ ఈ సౌలభ్యం లేని చోట అదనంగా కమ్యూనిటీ హాళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, స్కూళ్లు, కాలేజీలను వాక్సినేషన్ కేంద్రాలుగా ఎంపిక చేయనున్నారు. ⇔ ఒక్కో సెంటర్లో ఐదుగురు సభ్యులతో కూడిన సిబ్బంది వ్యాక్సినేషన్లో పాల్గొంటారు. ⇔ ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో పని చేస్తున్న సుమారు ఎనిమిది వేల మందికి వ్యాక్సినేషన్‌పై శిక్షణ ఇచ్చారు. వ్యాక్సిన్ స్టోరేజీ ఇలా.. ⇔ కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం ఈ నెల రెండో వారంలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. దీంతో వైద్య ఆరోగ్యశాఖ ఆ మేరకు ఏర్పాట్లు చేస్తుంది. ⇔ ఆక్స్ఫర్డ్ ఆక్సెనికా సహాయంతో సీరం ఇనిస్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్‌తో పాటు భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన కోవాగ్జిన్‌లకు ఇప్పటికే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఏ) అనుమతి ఇచ్చింది. ⇔ తొలిదశ వ్యాక్సినేషన్లో భాగంగా పుణేలోని సీరం ఇనిస్టిట్యూట్‌లో తయారవుతున్న కోవిషీల్డ్‌ను వాడనున్నారు. ⇔ ప్రత్యేక ఇన్సులేటెడ్ కార్గో విమానాల్లో శంషాబాద్ విమానాశ్రమానికి చేరుకుని అటు నుంచి కోఠిలోని స్టేట్ వ్యాక్సిన్ సెంటర్‌కు చేరుకుంటుంది. అక్కడ కోటిన్నర వ్యాక్సిన్ల నిల్వ సామర్థ్యం గల నాలుగు వాక్ ఇన్ కూలర్లు సిద్ధం చేశారు. ⇔ కోఠి నుంచి జీహెచ్ఎంసీ స్టోర్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి ఎంపిక చేసిన చుట్టల్‌బస్తీ, బేగంబజార్, హరాజ్‌పెంట, శ్రీరామ్‌నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లోని సెంటర్లకు తరలిస్తారు. సాధారణ వ్యాక్సిన్ తరహాలోనే కోవిడ్ వ్యాక్సిన్‌కు కూడా 2 నుంచి 8 సెల్సియస్ డిగ్రీల వద్ద నిల్వ చేస్తారు. అక్కడి నుంచి వ్యాక్సినేషన్ రోజు ప్రత్యేక వాహనాల్లో, ప్రత్యేక స్టోరేజ్ బాక్సుల్లో సెంటర్లకు తరలిస్తారు. జిల్లాల వారికి ఏర్పాట్లు ఇలా: హైదరాబాద్ జిల్లాలో లబ్దిదారులు 78236 ప్రభుత్వ హెల్త్‌కేర్ వర్కర్లు 19016 ప్రైవేటు హెల్త్‌కేర్ వర్కర్లు 59220 వ్యాక్సినేషన్ సెంటర్లు 1202 వ్యాక్సినేషన్లో పాల్గొనే సిబ్బంది 6010 రంగారెడ్డి జిల్లాలో 26078 ప్రభుత్వ హెల్త్‌కేర్ వర్కర్లు 6079 ప్రైవేటు హెల్త్‌కేర్ వర్కర్లు 19999 వ్యాక్సిన్ సెంటర్లు 260 వ్యాక్సినేషన్లో పాల్గొనే సిబ్బంది 1300 మేడ్చల్ జిల్లాలో లబ్ధిదారులు 14702 వ్యాక్సిన్ సెంటర్లు 141 ఎవరెవరికి ఎప్పుడంటే? తొలివిడత: ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేస్తున్న హెల్త్ కేర్ వర్కర్స్ రెండో విడత: పోలీసు, జైళ్లశాఖ, జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు, ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్స్ మూడో విడత: సీనియర్ సిటిజన్స్, హృద్రోగ, కిడ్నీ, కేన్సర్, మధుమేహం ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు.. నాలుగో విడత: అన్ని వర్గాలకు చెందిన సాధారణ ప్రజలకు అవకాశం కల్పిస్తారు. ఏ స్టేజ్‌లో ఎవరు? ఏం చేస్తారంటే..? స్టేజ్–1: సెంటర్ ప్రధానగేటులో పోలీసు కానిస్టేబుల్/హోంగార్డు/ సెక్యూరిటీ స్టాఫ్ ఉంటారు. వీరు కేంద్రానికి చేరుకున్న లబ్ధిదారుల గుర్తింపు కార్డు, శరీర ఉష్ణోగ్రతను పరిశీలించి, లోనికి అనుమతిస్తారు. స్టేజ్–2: సెంటర్ ప్రధాన ప్రవేశ ద్వారంలో రిజిస్ట్రేషన్ కోసం కంప్యూటర్ ఆపరేటర్ ఉంటారు. వీరు కోవిన్ పోర్టల్‌లో లబ్ధిదారుని పేరు ఉందో? లేదో చెక్ చేసి, ఫోన్‌కు ఓటీపీ వచ్చిందో లేదో చూసి రెండో గదిలోకి పంపిస్తారు. స్టేజ్–3: ప్రభుత్వ ఉపాధ్యాయుడు /ఆశా వర్కర్ ఉంటారు. వీరు వచ్చిన వారిని గదిలో ఓ క్రమ పద్ధతిలో కూర్చోబెడతారు. శానిటైజ్ చేసుకున్నారా? మాస్క్ ధరించారా? సామాజిక దూరం పాటిస్తున్నారా? లేదా వంటి అంశాలను పర్యవేక్షిస్తారు. స్టేజ్–4: పీపీఈ కిట్లు ధరించిన స్టాఫ్‌నర్సు/డ్యూటీ మెడికల్ ఆఫీసర్ ఉంటారు. వీరు వచ్చిన వారికి వ్యాక్సిన్ ఇస్తారు. స్టేజ్–5: డ్యూటీమెడికల్ ఆఫీసర్/అబ్జర్వర్ ఉంటారు. వీరు టీకా వేయించుకున్న వారిని గదిలో 30 నిమిషాల పాటు ఉంచి, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ఏదైనా అనుకోని సమస్యలు తలెత్తితే వెంటనే ప్రత్యేక అంబులెన్స్‌లో గాంధీ, టిమ్స్ వంటి కోవిడ్ సెంటర్లకు పంపి, అక్కడే వారికి వైద్య సేవలు అందించనున్నారు. -
కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు ప్రత్యేక సిబ్బంది
సాక్షి, అమరావతి: కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు వీలుగా ఒక పక్క ఆసుపత్రుల్లో బెడ్ల సదుపాయాలను పెంచుతూ మరో పక్క అవసరమైన డాక్టర్లు, నర్సులు, స్పెషలిస్టులు, పారిశుధ్య, తదితర సిబ్బందిని తాత్కాలిక ప్రాతిపదికన ప్రత్యేకంగా నియమించేందుకు ప్రభుత్వం చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా కోవిడ్ చికిత్సలతో పాటు సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా 30,887 మంది నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందులో ఇప్పటికే 16,720 మంది నియామకం పూర్తి చేశారు. మిగతా సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటున్నారు. -
వైద్యులకు పూర్తి వేతనాలు చెల్లించాలి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : కోవిడ్ రోగులకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు పూర్తి వేతనాలు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేయాలని బుధవారం కేంద్రాన్ని ఆదేశించింది. అలాగే వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు అవసరమైన క్వారంటైన్ వసతులు కల్పించేందుకు రాష్ట్రాలకు సూచనలు జారీ చేయాలని సూంచింది. కాగా వైద్యులకు ప్రత్యేక క్వారంటైన్ సదుపాయాలు, సమయానికి సరైన వేతనాలు అందించాలని ఓ వైద్యుడు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. (‘జులై 10 నుంచి థియేటర్లు ఓపెన్?’) దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం కరోనా వైరస్ పేషెంట్లకు వైద్యం అందింస్తున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలను కనీసం వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉంచాలని ఆదేశించింది. దీనికి సంబంధించి గురువారంలోగా ఆదేశాలు జారీ చేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సూచించింది. కోర్టు ఆదేశాలను రాష్ట్రాలు ఉల్లంఘిస్తే విపత్తు నిర్వహణ చట్టం, ఐపీసీ సెక్షన్ 188 కింద నేరంగా పరిగణించబడుతుందని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. కోర్టు ఆదేశాల అమలుకు కేంద్రానికి నెల రోజుల సమయమిచ్చింది. ఆ తరువాత దీనిపై విచారణ జరగనుంది. (సరిహద్దు ఘర్షణ; సోనియా గాంధీ స్పందన) -
వైద్య సిబ్బంది భద్రత కోసం...
వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించడానికి వీలుకల్పించే ఆర్డినెన్స్‌పై గురువారం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సంతకం చేశారు. దాడికి పాల్పడినవారికి గరిష్టంగా ఏడేళ్ల వరకూ శిక్ష, భారీ జరిమానా విధించడంతోపాటు ధ్వంసం చేసిన ఆస్తికి రెట్టింపు వసూలు చేయడానికి ఆర్డినెన్స్ వీలు కల్పిస్తోంది. 1897నాటి మహమ్మారి వ్యాధుల చట్టానికి సవరణలు తీసుకొస్తూ రూపొందించిన ఈ ఆర్డినెన్స్‌కు బుధవారమే కేంద్ర మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వైద్యులపైనా, ఆ రంగంలో పనిచేసే ఇతర సిబ్బందిపైనా దాడులు జరగడం కొత్త కాకపోయినా, కరోనా మహ మ్మారి తీవ్రత పెరిగాక దేశమంతటా ఆ దాడులు అధికమయ్యాయి. ఒకపక్క పదుల సంఖ్యలో మొదలైన కరోనా కేసులు క్రమేపీ వందల్లోకి పెరిగి, చూస్తుండగానే వేల సంఖ్యలోకి చేరుకున్నాయి. మరోపక్క ఉన్న ఆసుపత్రులు చాలక ప్రభుత్వాలు పెద్దయెత్తున అదనపు ఏర్పాట్లు చేయాల్సివస్తోంది. ఇవిగాక ఆ రోగులతో సన్నిహితంగా మెలిగారని నిర్ధారించినవారి కోసం పర్యవేక్షణ కేంద్రాలు నెలకొల్పారు. అలాగే కరోనా రోగులుగా అనుమానం వచ్చినవారిని పరీక్షించి, తరలించేందుకు వివిధ ప్రాంతాలకు వైద్య బృందాలు వెళ్లాల్సివస్తోంది. ఇందుకోసం లక్షలాదిమంది సిబ్బంది రాత్రింబగళ్లు శ్రమిస్తున్నారు. వారికి తగిన ఉపకరణాలు లేకున్నా సేవలందించడంలో వెనకాడటంలేదు. ఆ క్రమంలో వారిలో కొందరు వ్యాధిబారిన పడి మరణించారు. అయినా తమవారిని కాపాడలేకపోయారనో, ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేవనో వైద్యులపై, ఇతర సిబ్బందిపై దుండగులు దాడులు చేస్తున్నారు. పరీక్షించడానికొచ్చిన వైద్యుల్ని కర్రలతో, రాళ్లతో వెంటబడి తరిమిన ఉదంతాలు పలుచోట్ల జరిగాయి. కరోనా వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలం దిస్తున్నారన్న కారణంతో ఇల్లు ఖాళీ చేయమని యజమానులు వత్తిడి తెస్తున్నారు. ఇరుగుపొరుగున వుంటున్నవారు సైతం వారిని దూరం పెడుతున్నారు. చెన్నై నగరంలో ఇటీవల జరిగిన ఉదంతం వీటన్నిటినీ తలదన్నింది. ఆ నగరానికి చెందిన న్యూరో సర్జన్ డాక్టర్ సైమన్ హెర్క్యులస్ ఒక రోగి ద్వారా కరోనా బారిన పడి కన్నుమూస్తే, ఆయన భౌతికకాయాన్ని ఖననం చేసేందుకు వెళ్లిన బంధువులపై, సహోద్యోగులపై జనం దాడికి దిగారు. అలా ఖననం చేస్తే కరోనా వ్యాపిస్తుందన్న మూఢ విశ్వాసంతో స్మశానంలోనే దాడి చేశారు. మిగిలినవారిని పంపి, సైమన్ మృత దేహాన్ని అక్కడినుంచి వెనక్కి తీసుకొద్దామని ఆగిన వైద్యుడిపైనా, అంబులెన్స్ డ్రైవర్లపైనా కూడా దాడులు చేసి గాయపరిచారు. చివరకు రాత్రి 11 గంటలకు జనం కన్నుగప్పి ఒకరిద్దరి సాయంతో మృతదేహాన్ని ఖననం చేశారు. కరోనా సేవల్లో తలమునకలై పనిచేస్తున్న వైద్య సిబ్బందికి, ఇతరులకు కరతాళ ధ్వనులతో జేజేలు పలుకుదామని ప్రధాని నరేంద్ర మోదీ గత నెల పిలుపునిచ్చినరోజున కోట్లాదిమంది తమ తమ ఇళ్ల వద్ద దాన్ని పాటించారు. కానీ వారిలో చాలామందికి ఆ పిలుపు వెనకున్న ఉద్దేశమేమిటో, ఈ క్లిష్ట సమయంలో తమ కర్తవ్యమేమిటో తెలియలేదు. వైద్య వృత్తిని ఎంచుకుని, పనిచేయడానికి సిద్ధపడినప్పుడే అందులోని సాధకబాధకాలేమిటో అందరూ గ్రహిస్తారు. వారు నిత్యం రోగులతో వ్యవహరించవలసి వుంటుంది గనుక ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఇతరులకన్నా వారికి బాగా ఎక్కువ. ఆ విషయంలో వారు మానసికంగా సిద్ధపడే వుంటారు. అనుక్షణం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ మూర్ఖత్వం మూర్తీభవించిన వారినుంచి ఆత్మరక్షణ చేసుకోవడం ఎలా? ఈ మాదిరి దాడులను నియంత్రించడానికి మన దేశంలో ఇంతక్రితం కూడా చట్టాలున్నాయి. 19 రాష్ట్రాలు ఎక్కడికక్కడ ఇలాంటి చట్టాలు తీసుకొచ్చాయి. కానీ ఆచరణలో అవి అంతగా వినియోగపడలేదు. సీపీసీ లేదా సీఆర్పీసీలో తగిన నిబంధనలు పొందుపరచకపోతే ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలో తెలియని అయోమయంలో కిందిస్థాయి పోలీసులుంటారు. పైగా దాదాపు అన్ని రాష్ట్రాల చట్టాలూ పనిచేసే స్థలంలో జరిగే దాడులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నాయి. వారి ఇళ్లవద్దనో, మరోచోటనో జరిగే దాడులు ఆ చట్టాల పరిధిలోకి రావు. కనుకనే కేంద్ర స్థాయిలో పకడ్బందీ చట్టాన్ని తీసుకురావాలని ఎన్నో ఏళ్లుగా వైద్యులు, వైద్య రంగ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు నిరసన ప్రదర్శనలు జరగడం, విధులకు గైర్హాజరవడం మామూలే. ఆ తర్వాత ప్రభుత్వాలు వారిని బుజ్జగించి యధావిధిగా పనిచేయాలని కోరడం కూడా రివాజే. కొన్ని సందర్భాల్లో దాడులు చేసినవారిని అరెస్టు చేస్తున్నారు. కానీ ఆ తర్వాత మరో ఘటన జరిగేవరకూ అంతా సవ్యంగా వున్నట్టే కనిపిస్తుంది. నిజానికి భౌతిక దాడులు జరిగినప్పుడే ఆ ఉదంతాలు వార్తల్లోకెక్కుతాయి. కానీ బెదిరించడం, దూషించడం, ఫర్నీ చర్ను, వైద్య ఉపకరణాలను ధ్వంసం చేయడం వంటివి చాలా తరచుగా జరుగుతుంటాయి. 75 శాతంమంది వైద్యులు విధుల్లో వున్నప్పుడు ఏదో రకమైన హింసను చవిచూస్తున్నారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) రెండేళ్లక్రితం వెల్లడించింది. ప్రాణాలు కాపాడాల్సిన వృత్తిలో వుంటున్నారు గనుక వైద్యులకూ, ఇతర సిబ్బందికీ నిత్యం కత్తి మీద సాము. రోగి ఎంతటి ప్రమాదంలో వున్నాడో అర్థం చేసుకోలేని బంధువులు ఏం జరిగినా చికిత్సపరంగా లోపం చోటుచేసుకుని వుంటుందన్న అభిప్రాయం ఏర్పర్చుకుంటారు. ఆ భావో ద్వేగంలో దేనికైనా సిద్ధపడతారు. ఈ మాదిరి దాడులు ఇటీవలకాలంలో బాగా పెరిగిపోయాయి. చివరకు స్మశానాలకు కూడా ఇవి విస్తరించాయని చెన్నై ఉదంతం చెబుతోంది. వర్తమాన సంక్షోభంలో ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బంది సరిహద్దుల్లో శత్రువుతో పోరాడే సైన్యంతో సమానం. వారికి ఎలాంటి హాని జరగకుండా చూడటం, వారు నిర్భయంగా పనిచేసే వాతావరణం కల్పించడం అత్యవసరం. తాజా ఆర్డినెన్స్ అందుకు దోహదపడుతుంది. -
ఆరోగ్య సిబ్బంది మరణిస్తే రూ.50 లక్షలు!
-
కరోనా: ఒడిశా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం!
భువనేశ్వర్ : కరోనా కట్టడికి పటిష్ట చర్యలు చేపడుతున్న నవీన్ పట్నాయక్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ పోరులో ముందుండే వైద్య సిబ్బంది, వారి సహాయ సిబ్బంది మరణిస్తే ఆయా కుటుంబాలకు రూ.50 లక్షలు ఆర్థిక సాయం అందివ్వనున్నట్టు మంగళవారం సీఎం ప్రకటించారు. ఆరోగ్య సిబ్బంది కుంటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలనే కేంద్రం మార్గదర్శకాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈమేరకు ఆయన ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. (చదవండి: మాస్క్ ధరించకుంటే రూ. 200 జరిమానా) అదేవిధంగా ప్రాణాలు పణంగా పెట్టి సేవలందిస్తున్న వైద్య సిబ్బందిని అమరలవీరులుగా గౌరవిస్తామని చెప్పారు. అమరుల త్యాగాలను గుర్తించి.. వారి కుటుంబ సభ్యులకు అవార్డులు అందించే కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రజలంతా ఆరోగ్యసిబ్బంది సేవలపట్ల కృతజ్ఞత కలిగి ఉండాలని, వారి పట్ల అనుచితం వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 74 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. 24 మంది కోలుకున్నారు. ఒక్కరు మరణించారు. (చదవండి: కరోనాపై అంతుచిక్కని అంశాలు) -
కరోనా : షారుక్ సాయం.. అభినందించిన మంత్రి
ముంబై : బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు పోరాటం చేస్తున్న మహారాష్ట్రలోని ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ వర్కర్లకు తన వంతు సహాయంగా 25వేల పీపీఈ (పర్సనల్ ప్రొటక్షన్ ఎక్విప్మెంట్) కిట్లను అందించాడు. ఇదే విషయమై మహారాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి రాజేష్ తోపే స్పందిస్తూ షారుక్‌కు ట్విటర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ' థాంక్యూ షారుక్.. మీ వంతుగా 25వేల పీపీఈ కిట్లను అందించినందుకు ధన్యవాదాలు. కరోనా మహమ్మారిపై పోరాడుతున్న మెడికల్ సిబ్బందికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయంటూ' ట్విటర్లో పేర్కొన్నాడు. (తల్లి నుంచి నవజాత శిశువుకు వచ్చే ప్రమాదం) దీనిపై షారుక్ స్పందిస్తూ.. ' నేనిచ్చిన కిట్లను హెల్త్ వర్కర్లకు వినియోగిస్తునందుకు మీకు ధన్యవాదాలు. అయినా దేశమంతా ఒకే కుటుంబంగా ఉంటూ కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి ఆపత్కాల సమయంలో నా వంతుగా సహాయం చేశా. కరోనాను తరిమికొట్టేందుకు శాయశక్తులా కృషి చేస్తున్న వైద్య రంగం, వారి కుటుంబసభ్యులు ఆరోగ్యంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అంటూ రీట్వీట్ చేశాడు. Thank you sir for all your help to source the kits. We are all together in this endeavour to protect ourselves and humanity. Glad to be of service. May your family & team be safe and healthy. https://t.co/DPAc7ROh7i — Shah Rukh Khan (@iamsrk) April 13, 2020 అంతకుముందు షారుక్ భార్య గౌరీఖాన్ తమ నాలుగంతస్తుల ఆఫీస్ బిల్డింగ్‌ను క్వారంటైన్ సెంటర్‌గా మార్చుకునే అవకాశం ఇస్తున్నట్లు బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కు లేఖను అందజేశారు. క్వారంటైన్ సెంటర్లో మహిళలకు, చిన్నపిల్లలతో పాటు, మిగతావాళ్లకు కూడా అవసరమైన అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. దీనిపై బృహత్ ముంబై కార్పొరేషన్ ట్విటర్లో స్పందిస్తూ.. ' మీ ఆఫీసుని క్వారంటైన్ సెంటర్‌గా నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆపత్కాల సమయంలో మీరు చేస్తున్న పనికి మాకు సంతోషంగా ఉందంటూ' తెలిపారు. ఇక భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు మరింత పెరిగిపోతుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 10వేల కేసులు నమోదవ్వగా, మృతుల సంఖ్య 300 దాటేసింది. (మే 3 వరకు లాక్డౌన్ : మోదీ) -
కరోనా : వారికి ఉబెర్ ఉచిత సేవలు
సాక్షి, ముంబై: కరోనా వైరస్ ను అడ్డుకునే క్రమంలో విశేష సేవలందిస్తున్న వైద్య సిబ్బంది కోసం క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ రంగంలోకి దిగింది. పలు మెట్రో నగరాల్లో వారికి ఉచిత సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు జాతీయ ఆరోగ్య సంస్థ ( నేషనల్ హెల్త్ అథారిటీ) తో ఒక భాగస్వామ్యానికి వచ్చినట్టు వెల్లడించింది. మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరునకు నాయకత్వం వహిస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు భారీ ఊరట కల్పించింది. ఆరోగ్య సిబ్బంది, కార్యకర్తలకు సురక్షితమైన, నమ్మదగిన, సమర్థవంతమైన రవాణాను సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉబెర్ తెలిపింది. కరోనా పోరాటంలో ముందు నిలిచిన ఆరోగ్య కార్యకర్తలకు సాయం అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవో ఇందు భూషణ్ తెలిపారు. ఇటీవలే ప్రారంభించిన ఉబెర్ మెడిక్ సేవ ద్వారా ఢిల్లీ నోయిడా, ఘజియాబాద్, కాన్పూర్, లక్నో, ప్రయాగ్‌రాజ్, పట్నా నగరాల్లో వారికి ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని అందివ్వనుంది. ఇందుకు ప్రత్యేకంగా తయారు చేసిన150 కార్లను అందుబాటులో వుంచింది. అలాగే ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా, భద్రత, పరిశుభ్రతకు సంబంధించి అత్యున్నత ప్రమాణాలను అమలు చేస్తామని తెలిపింది. ప్రతీ రైడ్ తరువాత శానిటైజేషన్ కార్యక్రమాన్ని చేపడతామని తెలిపింది. డ్రైవర్లు భద్రతా విధానాలలో ప్రత్యేకంగా శిక్షణతోపాటు మాస్క్ లు శానిటైజర్లు సహా ఇతర వ్యక్తిగత రక్షణ పరికరాలను అందిస్తామని తెలిపింది. ఈ సందర్భంగా అపూర్వ సేవలందిస్తున్న వైద్య సిబ్బదికి ఉబెర్ ఇండియా సౌత్ అధ్యక్షుడు ప్రదీప్ పరమేశ్వరన్ ధన్యవాదాలు తెలిపారు. -
వైద్య సిబ్బందిపై రాళ్లతో దాడి
-
వైద్య సిబ్బందిపై స్థానికుల రాళ్ల దాడి
భారత్‌లో కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టినప్పటికీ.. రోజురోజుకీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. భారత్‌లో ఇప్పటి వరకు 1980 మంది కరోనా బారినా పడగా.. 59 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 144 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దేశంలో కోవిడ్-19 వ్యాప్తి చెదుతున్న నేపథ్యంలో ప్రజలకు పరీక్షలు నిర్వహించడానికి వెళ్లిన వైద్య సిబ్బందిపై స్థానికులు రాళ్లు రువ్విన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. కోవిడ్-19 పాజిటివ్ రోగితో పరిచయం ఏర్పడిందని ఓ వృద్దురాలు చెప్పడంతో ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించడానికి వైద్య సిబ్బంది ఇండోర్ నగరానికి వెళ్లారు. ఈక్రమంలో తత్పట్టి బఖల్ ప్రాంతానికి చెందిన స్థానికులు వైద్య సిబ్బందిపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు మహిళ వైద్యులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. (కరోనా :అపోహలూ... వాస్తవాలు) కాగా ఇండోర్ నగరంలో కొత్తగా 19 కరోనా కేసులు నమోదవ్వడంతోపాటు.. బుధవారం 65 ఏళ్ల వృద్దుడికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ జాడియా పేర్కొన్నారు. అలాగే నగరంలో దాదాపు 600 మందిని క్వారంటైన్‌కి తరలించామని ఆయన తెలిపారు. దీంతో ఇప్పటి వరకు ఇండోర్‌లో నమోదైన కేసుల సంఖ్య 75కు చేరింది. మరోవైపు రాష్టంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 98కి చేరింది. ఇండోర్‌లో పెరుగుతున్న కరోనావైరస్ కేసులను దృష్టిలో పెట్టుకొని, కలెక్టర్ మనీష్ సింగ్ జిల్లాలోని అన్ని ఆసుపత్రులను రెడ్, ఎల్లో, గ్రీన్‌గా మూడు విభాగాలుగా విభజించారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 9 లక్షలు దాటాయి. (గాంధీలో వైద్యులపై దాడి) -
వ్యాయామంతో వ్యాధులకు చెక్
లండన్ : క్యాన్సర్, మధుమేహం, డిమెన్షియా, కుంగుబాటు వంటి జబ్బుల బారిన పడిన వారిని వ్యాయామం చేసేలా వైద్యులు, హెల్త్‌కేర్ సిబ్బంది ప్రోత్సహించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దైనందిన జీవితంలో మరింత చురుకుగా ఉండటం ద్వారా ఆయా వ్యాధుల తీవ్రత నుంచి ఉపశమనం పొందవచ్చని పేర్కొంటున్నారు. వైద్యులు తమ రోగుల శారీరక చురుకుదనం గురించి ఆరా తీయాలని, వ్యాయామం ద్వారా చేకూరే శారీరక, మానసిక ప్రయోజనాలను వివరించాలని సూచించారు. డాక్టర్ లేదా నర్సు చెబితే నలుగురు రోగుల్లో ఒక్క రోగైనా శారీరకంగా చురుకుగా ఉండేందుకు చొరవ చూపుతారని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వైద్యుల్లో మూడొంతుల మంది రోగుల శారీరక చురుకుదనం గురించి మాట్లాడటం లేదని తాజా అథ్యయనం వెల్లడించింది. వ్యాయామం ద్వారా స్ధూలకాయం ముప్పును తగ్గించడం ద్వారా జీవనశైలి వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని ప్రజారోగ్య నిపుణులు చెబుతున్నారు. చురుకైన జీవనశైలిని పాటించడం ద్వారా టైప్ 2 మధుమేహ ముప్పును తగ్గించుకోవండం ద్వారా అధిక రక్తపోటు ముప్పు నుంచి బయటపడవచ్చని నిపుణులు పేర్కొన్నారు. నిత్యం వ్యాయామం చేయడం ద్వారా గుండె జబ్బుల ముప్పును 40 శాతం మేర తగ్గించవచ్చని, స్ర్టోక్, కుంగుబాటు ముప్పును కూడా 30 శాతం మేర తగ్గించవచ్చని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్, స్పోర్ట్ ఇంగ్లండ్ స్పష్టం చేశాయి. -
సగం ఖాళీలే!
40 మంది డాక్టర్లకు.. ఉన్నది 19 మంది సింగరేణి ఆస్పత్రిలో అరకొర వైద్య సేవలు సాధారణ రోగులనూ గోదావరిఖనికి రిఫర్ భూపాలపల్లిలో కార్మికుల అవస్థలు సంక్షేమాన్ని విస్మరిస్తున్న యాజమాన్యం హన్మకొండ : చీకటి సూర్యులుగా పేరొందిన బొగ్గుగని కార్మికుల సంక్షేమంపై సింగరేణి కాలరీస్ సంస్థ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది. ప్రాణాలకు తెగించి పుడమి తల్లి కడుపులో నల్ల బంగారాన్ని వెలికి తీస్తున్న కార్మికుల ఆరోగ్య పరిరక్షణపై పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తోంది. ఫలితంగా సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎనిమిదేళ్లుగాఅంతంతమాత్రమే.. 1988లో భూపాలపల్లిలో బొగ్గు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. 2006లో సింగరేణి సంస్థ ఇక్కడ 75 పడకల సామర్థ్యంతో వైద్యశాలను ప్రారంభించింది. ఈ ఆస్పత్రిలో ఆర్థో, న్యూరో, జనరల్ సర్జరీ, గైనకాలజీ, జనరల్ ఫిజీషియన్, అనస్థీషియా, డెర్మటాలజీ, చిల్డ్రన్స్, రేడియాలజీ, కార్డియాలజీ, యూరాలజీ, న్యూరాలజీ, దంత, కంటి సంబంధిత విభాగాల్లో సేవలు అందిస్తామని సంస్థ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఇందుకోసం ఆస్పత్రికి 40 వైద్యుల పోస్టులు మంజూరు చేశారు. కానీ 21 మంది మాత్రమే ప్రస్తుతం సేవలందిస్తున్నారు. స్త్రీ సంబంధిత వ్యాధుల(గైనకాలజీ) విభాగంలో వారానికోసారి ఔట్ పేషెంట్ విభాగం నిర్వహిస్తున్నారు. కీలకమైన జనరల్ ఫిజీషియన్ పోస్టులు ఆస్పత్రి ప్రారంభం నుంచి ఖాళీగానే ఉన్నారుు. ఆర్థో విభాగం రెండేళ్లు పని చేసినా... గడిచిన ఎనిమిదేళ్లుగా సేవలు అందడం లేదు. ఫలితంగా కంటి చూపు, కాలి నొప్పి వంటి సాధారణ ఆరోగ్య సమస్యలకు కూడా ఇక్కడ సేవలు అందడం లేదు. ఇక వెంటిలేటర్, అంబులెన్సులు సైతం సరిపడా లేవు. రిఫర్లే రిఫర్లు.. సింగరేణిలో పెద్ద సంఖ్యలో కార్మికులు పని చేస్తున్న ఏరియాల్లో భూపాలపల్లి ఒకటి. ఇక్కడ సుమారు 6700 మంది కార్మికులు పని చేస్తున్నారు. స్థానిక ఏరియా ఆస్పత్రికి రోజుకు సగటున 400 మంది రోగులు అవుట్ పేషెంట్లుగా, ఇన్‌పేషెంట్‌గా రోజుకు సగటున 30 మంది వస్తున్నారు. ఇలాంటి ఆస్పత్రిలో ఎనిమిదేళ్లుగా పూర్తి స్థాయిలో వైద్యులను భర్తీ చేయకపోవడంతో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. చిన్న సమస్యలకు కూడా సింగరేణి రీజనల్ ఆస్పత్రి అయినగోదావరిఖని, ప్రధా న ఆస్పత్రి ఉన్న కొత్తగూడెం రిఫర్ చేస్తున్నారు. లేదంటే హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి పంపుతున్నారు. ప్రస్తుత ఆస్పత్రి లెక్కల ప్రకారమే నెలకు 40 మందిని రెఫర్ చేస్తున్నారు. కార్మికులపై ఆర్థిక భారం.. పూర్తి స్థాయిలో వైద్యులు లేకపోవడంతో రోగులను ఇతర ఆస్పత్రులకు రిఫర్ చేయడం వల్ల కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. భూపాలపల్లి నుంచి గోదావరిఖని, కొత్తగూడెం, హైదరాబాద్ ఆస్పత్రులకు రోగులను తీసుకెళ్లడం, చికిత్స పూర్తయ్యేంత వరకు అక్కడే ఉండాల్సి రావడంతో కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. దీంతో వారు అంత దూరం వెళ్లలేక లోకల్‌గా ఉండే ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తుండడంతో ఆర్థిక భారం పడుతోంది. సింగరేణి కార్మికులు రోజుకు కిలోమీటర్ల కొద్ది బొగ్గుగనుల్లో నడవాల్సి వస్తుం ది. దీంతో ఆర్థో సమస్యలు, కాలుష్యం కారణంగా కంటి, శ్వాసకోస సంబంధిత వ్యాధులూ ఎక్కువే. ఇక్కడి ఆహార అలవాట్ల కారణంగా హృదయ సంబంధిత రోగాల బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. కార్మికుల సంక్షేమం కోసం కోట్లు ఖర్చు పెడుతున్నట్లు ప్రకటించే సింగరేణి సంస్థ భూపాలపల్లి ఆస్పత్రిలో వైద్యుల కొరతపై దృష్టి పెట్టడం లేదు. ఏళ్ల తరబడి పూర్తి స్థాయిలో సేవలు అందక, ఆస్పత్రి అలకాంర ప్రాయంగా మారినా పట్టించుకోవడం లేదు.