Attack on Doctors: వైద్య సిబ్బందిపై స్థానికుల రాళ్ల దాడి | CoronaVirus Latest Updates in Telugu - Sakshi
Sakshi News home page

కరోనా పరీక్షలు: వైద్య సిబ్బందిపై స్థానికుల రాళ్ల దాడి

Published Thu, Apr 2 2020 9:34 AM | Last Updated on Thu, Apr 2 2020 1:43 PM

Corona: Locals Pelt Stones At HealthCare Workers In Indore - Sakshi

భారత్‌లో కరోనా వైరస్‌ కట్టడికి ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టినప్పటికీ.. రోజురోజుకీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. భారత్‌లో ఇప్పటి వరకు 1980 మంది కరోనా బారినా పడగా.. 59 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 144 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దేశంలో కోవిడ్‌-19 వ్యాప్తి చెదుతున్న నేపథ్యంలో ప్రజలకు పరీక్షలు నిర్వహించడానికి వెళ్లిన వైద్య సిబ్బందిపై స్థానికులు రాళ్లు రువ్విన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. కోవిడ్‌-19 పాజిటివ్‌ రోగితో పరిచయం ఏర్పడిందని ఓ వృద్దురాలు చెప్పడంతో ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించడానికి వైద్య సిబ్బంది ఇండోర్‌ నగరానికి వెళ్లారు. ఈక్రమంలో తత్పట్టి బఖల్ ప్రాంతానికి చెందిన స్థానికులు వైద్య సిబ్బందిపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు మహిళ వైద్యులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.  (కరోనా :అపోహలూ... వాస్తవాలు)

కాగా ఇండోర్‌ నగరంలో కొత్తగా 19 కరోనా కేసులు నమోదవ్వడంతోపాటు.. బుధవారం 65 ఏళ్ల వృద్దుడికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ జాడియా పేర్కొన్నారు. అలాగే నగరంలో దాదాపు 600 మందిని క్వారంటైన్‌కి తరలించామని ఆయన తెలిపారు. దీంతో ఇప్పటి వరకు ఇండోర్‌లో నమోదైన కేసుల సంఖ్య 75కు చేరింది. మరోవైపు రాష్టంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 98కి చేరింది. ఇండోర్‌లో పెరుగుతున్న కరోనావైరస్ కేసులను దృష్టిలో పెట్టుకొని, కలెక్టర్ మనీష్ సింగ్ జిల్లాలోని అన్ని ఆసుపత్రులను రెడ్‌, ఎల్లో, గ్రీన్‌గా మూడు విభాగాలుగా విభజించారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 9 లక్షలు దాటాయి. (గాంధీలో వైద్యులపై దాడి)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement