న్యూఢిల్లీ : కోవిడ్ రోగులకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు పూర్తి వేతనాలు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేయాలని బుధవారం కేంద్రాన్ని ఆదేశించింది. అలాగే వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు అవసరమైన క్వారంటైన్ వసతులు కల్పించేందుకు రాష్ట్రాలకు సూచనలు జారీ చేయాలని సూంచింది. కాగా వైద్యులకు ప్రత్యేక క్వారంటైన్ సదుపాయాలు, సమయానికి సరైన వేతనాలు అందించాలని ఓ వైద్యుడు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. (‘జులై 10 నుంచి థియేటర్లు ఓపెన్?’)
దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం కరోనా వైరస్ పేషెంట్లకు వైద్యం అందింస్తున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలను కనీసం వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచాలని ఆదేశించింది. దీనికి సంబంధించి గురువారంలోగా ఆదేశాలు జారీ చేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సూచించింది. కోర్టు ఆదేశాలను రాష్ట్రాలు ఉల్లంఘిస్తే విపత్తు నిర్వహణ చట్టం, ఐపీసీ సెక్షన్ 188 కింద నేరంగా పరిగణించబడుతుందని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. కోర్టు ఆదేశాల అమలుకు కేంద్రానికి నెల రోజుల సమయమిచ్చింది. ఆ తరువాత దీనిపై విచారణ జరగనుంది. (సరిహద్దు ఘర్షణ; సోనియా గాంధీ స్పందన)
Comments
Please login to add a commentAdd a comment