కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు ప్రత్యేక సిబ్బంది | AP Govt Decides To Appoint Special Staff To Deal With Covid 19 | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు ప్రత్యేక సిబ్బంది

Published Fri, Aug 28 2020 8:24 AM | Last Updated on Fri, Aug 28 2020 9:01 AM

AP Govt Decides To Appoint Special Staff To Deal With Covid 19 - Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు వీలుగా ఒక పక్క ఆసుపత్రుల్లో బెడ్ల సదుపాయాలను పెంచుతూ మరో పక్క అవసరమైన డాక్టర్లు, నర్సులు, స్పెషలిస్టులు, పారిశుధ్య, తదితర సిబ్బందిని తాత్కాలిక ప్రాతిపదికన ప్రత్యేకంగా నియమించేందుకు  ప్రభుత్వం చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా కోవిడ్‌ చికిత్సలతో పాటు సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా 30,887 మంది నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందులో ఇప్పటికే 16,720 మంది నియామకం పూర్తి చేశారు. మిగతా సిబ్బంది నియామకానికి
చర్యలు తీసుకుంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement