
సాక్షి, సిద్దిపేట: రైతు ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. దళారుల చేతిలో మోసపోకుండా.. పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర కల్పించేందుకు మార్కెట్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. సోమవారం సిద్దిపేటలో రూ.8.5 కోట్ల వ్యయంతో నిర్మించిన మోడల్ రైతు బజారును మహిళా రైతు లచ్చవ్వతో జ్యోతి ప్రజ్వలనం చేయించారు.
అలాగే.. సిద్దిపేట పోలీసు కమాండ్ కంట్రోల్ రూం భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రైతులకు సౌకర్యవంతంగా ఉండేలా అన్ని జిల్లాల్లో ఇలాంటి మోడల్ రైతు బజార్లు ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. సిద్దిపేటలో నిర్మించిన మూడంతస్తుల భవనంలో 330 మంది రైతులు తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు వీలుగా స్టాల్స్ ఏర్పాటు, ఇతర సౌకర్యాలు కల్పించామని చెప్పారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను బలోపేతం చేశామని మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment