మార్కెటింగ్‌శాఖలో లక్ష్యం మేరకు వసూలు కాని సెస్
{పతికూల పరిస్థితుల్లోనూ రూ.70కోట్లు వసూలు
జిల్లాలో మార్కెటింగ్‌శాఖకు సెస్ మొండి బకాయిలు గుదిబండగా మారుతున్నాయి. రూ.కోట్లలో పెరుకుపోతున్నాయి. ఏ ఆర్థిక సంవత్సరంలోనూ లక్ష్యం మేరకు వసూలు కాలేదు. వీటిలో ఎక్కువ పౌరసరఫరాలశాఖకు చెందినవే. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆశాఖ ఈఏడాది రూ.70కోట్ల మేర వసూలు చేసింది. లక్ష్యానికి చేరుకోలేకపోయినప్పటికీ ఆశించిన స్థాయిలోనే పన్నుల వసూలు చేయగలిగింది.
విశాఖపట్నం: విశాఖలోని ప్రాంతీయ మార్కెటింగ్ శాఖ పరిధిలో శ్రీకాకుళం, విజ యనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో 51 మార్కెట్‌యార్డులుండగా, వాటి పరిధిలో 80 చెక్‌పోస్టులు న్నాయి. ఈ చెక్‌పోస్టుల ద్వారా వ్యవసాయఉత్పత్తులపై ఒక శాతం, మత్స్యశాఖ ఉత్పత్తులపై 0.5 శాతం సెస్ రూపంలో వసూలు చేస్తుంటారు. 2013-14లో నిర్దేశించిన రూ.83 కోట్ల కు రూ.67కోట్లు వసూలు చేయగలిగారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఈ నాలుగు జిల్లాల పరిధిలో 92.93కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. గతేడాది ఎలాగైనా లక్ష్యానికి చేరుకోవాలని మార్కెటింగ్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ హుద్‌హుద్‌తో లక్షలాది ఎకరాల్లో పంటల న్నీ దెబ్బతిన్నాయి. చేపలు, రొయ్యల చెరువులు నామరూపాల్లేకుండా పోయాయి. అయినప్పటికీ ఊహించని స్థాయిలోనే పన్నుల వసూలు జరిగాయి. గతేడాది వసూళ్లనైనా ఈ ఏడాది సాధించగలమో లేదోనని ఆందోళన పడ్డారు. కానీ గతేడాది వసూళ్లకు మించి ఈ ఏడాది వసూళ్లు సాధించ గలిగారు. ఈ ఏడాది రూ.92.93కోట్ల లక్ష్యం నిర్దేశించగా ఇప్పటి వరకు 69.75కోట్ల మేర వసూలు చేయగలిగారు. మరో 20రోజుల గడువు ఉన్నందున ఈ మొత్తం రూ.75కోట్లకు వరకు చేరుతుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు వసూలైన పన్నుల్లో ధాన్యం ద్వారానే అత్యధికంగా రూ.50కోట్లు, బియ్యం ద్వారా మరో రూ.10 కోట్లు వసూలయ్యాయి. మిగిలిన రూ.10 కోట్లు ఇతర వ్యవసాయ, మత్స్యశాఖ ఉత్పత్తుల మార్కెటింగ్ ద్వారా ఆర్జించ గలిగారు.
‘తూర్పు’లోనే అత్యధిక వసూలు
జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళం జిల్లాకు రూ.22కోట్ల పన్నుల వసూళ్లు లక్ష్యం కాగా, రూ.11.12 కోట్ల వసూలు చేశారు. విజయనగరం జిల్లాలో రూ.10.75 కోట్లకు రూ.7.90కోట్లు, విశాఖపట్నం జిల్లాలో రూ.10.53కోట్ల లక్ష్యానికి రూ.10.04కోట్లమేర వసూలు చేయగా, తూర్పు గోదావరిలో రూ.49కోట్ల లక్ష్యం కాగా ఇప్పటి వరకు రూ.40.69కోట్ల మేర సెస్‌ల రూపంలో వసూలు చేశారు.
మొండిబకాయిలు సివిల్ సప్లయిస్‌వే: పేరుకుపోయిన మొండిబకాయిలు ఎక్కువ పౌరసరఫరాలశాఖవే. గత ఏడేనిమిదేళ్ల నుంచి రూ.25కోట్లమేరబకాయిలు పేరుకుపోయాయి.
వీటిలో రైసు మిల్లర్లు, వ్యాపారస్తుల నుంచి రూ.12కోట్ల వరకు వసూలు కావాల్సిఉండగా..సివిల్ సప్లయిస్ నుంచే ఏకంగా రూ.12కోట్ల వరకు వసూలు కావాల్సిఉంది. గతరెండేళ్లుగా ధాన్యం కొనుగోళ్లు సివిల్ సప్లయిస్ చేపట్టింది. సుమారు 8లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని గడిచిన ఏడాదిలో కొనుగోలు చేసింది. ఈ ధాన్యానికి ఒకశాతం సెస్‌రూపంలో రూ.15కోట్లు చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.3కోట్లు మాత్రమే చెల్లించింది. మరో రూ.12కోట్ల మేర ఈ శాఖ చెల్లించాల్సి ఉంది.
మొండి బకాయిలు
Published Thu, Mar 12 2015 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 10:40 PM
Advertisement