వ్యవసాయ మార్కెట్లలో పడిపోతున్న ధాన్యం కొనుగోళ్లు
సర్కారుకు మార్కెటింగ్‌శాఖ నివేదిక
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుతో మార్కెట్లోకి వస్తున్న ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు పెద్ద ఎత్తున పడిపోతున్నాయని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి విన్నవిస్తూ సమగ్ర నివేదికను శనివారం అందజేసింది. ధాన్యంతో మార్కెట్లకు వచ్చే రైతులకు చిల్లర సమస్య ఎదురవుతోందని అధికారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. రైతు ధాన్యాన్ని విక్రరుుంచిన తర్వాత రవాణా ఖర్చు, లోడింగ్, అన్‌లోడింగ్, హమాలీల కూలీ తదితర చెల్లింపులకు చిల్లర ఉండట్లేదని పేర్కొన్నారు. ధాన్యం కొనే వ్యాపారులు కూడా చిన్న నోట్లు లేకపోవడంతో సరుకు కొనేందుకు ఆసక్తి కనబరచట్లేదని నివేదికలో వివరించారు. ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా జరుగుతున్న పత్తి, వరి, మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించిన మొత్తాలను రైతుల ఖాతాల్లో ఆన్‌లైన్, ఆర్‌టీజీఎస్ విధానంలో చెల్లిస్తున్నారు. అరుుతే ఖాతాల్లో జమ అరుున మొత్తాన్ని తీసుకోవడంలో ఉన్న పరిమితుల కారణంగా రైతులకు కష్టాలు తప్పట్లేదని అధికారులు పేర్కొన్నారు.
పది రోజులుగా పెద్ద నోట్లు చెల్లకపోవడం, చిన్న నోట్లు ఇవ్వని పరిస్థితుల వల్ల వారి జీవితాలు అతలాకుతలం అయ్యాయని పేర్కొన్నారు. రైతులకు, హమాలీలకు సరిగా చెల్లించలేని పరిస్థితి తలెత్తడంతో కేసముద్రం, మహబూబాబాద్ మార్కెట్లను మూసేశారని వెల్లడించారు. అరుుతే సూర్యాపేట, తిరుమలగిరి వంటి చోట్ల చెక్‌లు, ఆర్‌టీజీఎస్ ద్వారా రైతులకు చెల్లింపులు చేస్తున్నారని వివరించారు. రబీలో రైతులకు అవసరమైన రోజువారీ ఖర్చుల కోసం కొంతమేర చిన్న కాగితాల సొమ్ము అవసరమని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే మార్కెట్లలో కమీషన్ ఏజెంట్లకు కూడా రోజువారీ కూలీలకు, హమాలీలకు, రైతులకు చెల్లించేందుకు నగదు అవసరమని పేర్కొన్నారు. చెక్కుల రూపంలో చెల్లింపులు జరుపుతున్నా బ్యాంకుల్లో వాటిని మార్చుకోవడం.. అవసరమైనంత తీసుకోవడం రైతులకు కష్టంగా మారిందన్నారు. దీనివల్ల రబీలో అవసరమైన ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల కొనుగోలుకు రైతులకు ఇబ్బందిగా మారిందన్నారు. ప్రైవేటు వ్యాపారులు కూడా రైతులకు అప్పుల రూపంలో ఇచ్చే సొమ్ము కూడా నిలిచిపోరుుందన్నారు. మార్కెట్లో కొనుగోళ్లు నిలిచిపోకుండా ఐకేపీ సహా ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కొనుగోళ్లు జరుపుతున్నామని వివరించారు.