సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ల లో సింగిల్ లైసెన్స్ విధానం ప్రవేశపెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఫైలుపై మంగళవారం సంతకం చేశారు. ప్రస్తుతం ఒక వ్యవ సాయ మార్కెట్లో లైసెన్స్ ఉన్న వ్యాపారులు మరో మార్కెట్లో కొనుగోలు చేయడానికి అవకాశం లేదు. దీంతో ఒక్కో మార్కెట్‌లో కొందరు వ్యాపారులే లైసెన్స్‌డ్ ట్రేడర్లుగా ఉంటున్నారు. దీంతో రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు.
అయితే ఒక మార్కెట్లో లైసెన్స్ ఉన్న వ్యాపారి రాష్ట్రంలోని ఇతర మార్కెట్లలోనూ కొనుగోలు చేసే అవకాశముంటే పోటీ పెరిగి రైతులకు మేలు జరుగుతుందని సీఎంకు మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు వివరించారు. స్పందించిన సీఎం.. సింగిల్ లైసెన్స్ విధానం అమలు చేయాలని ఆదేశించారు. తాజా విధానంతో ఒక మార్కెట్లో లైసెన్స్ ఉన్న వ్యాపారులు, ట్రేడర్లు.. ఇతర మార్కెట్లలోనూ వ్యాపారం నిర్వహించుకునే వెసులుబాటు కలుగుతుంది.
ఇద్దరు ఎమ్మెల్యేలకు ఇళ్లు..
సొంత ఇళ్లు లేని మాజీ ఎమ్మెల్యేలు డి.రామచంద్రా రెడ్డి, సి.భాగన్నలకు స్థలం కేటాయించి ఇళ్లు కట్టివ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. రామచంద్రారెడ్డికి సిద్దిపేటలో, భాగన్నకు జహీరా బాద్‌లో స్థలం ఇవ్వాలని పేర్కొన్నారు.
మార్కెట్లలో సింగిల్ లైసెన్స్ విధానం
Published Wed, Jun 21 2017 1:19 AM | Last Updated on Tue, Sep 5 2017 2:04 PM
Advertisement
Advertisement