సాక్షి, హైదరాబాద్: మార్కెటింగ్ శాఖ ద్వారా పొద్దుతిరుగుడు గింజలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. సచివాలయంలో సోమవారం మార్కెటింగ్, నూనె గింజల ఉత్పత్తిదారుల సమాఖ్య అధికారులతో పొద్దుతిరుగుడు గింజల కొనుగోలుపై ఆయన సమీక్ష నిర్వహించారు. క్వింటాలుకు రూ.3,750ల మద్దతు ధరతో కొనుగోలు చేయనున్నట్లు ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. సాధారణంగా నాఫెడ్ ద్వారా ఈ కొనుగోళ్లు జరుగుతాయని, ఇందుకు నాఫెడ్ ముందుకు రాకపోవడంతో రైతులకు నష్టం జరగకూడదనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన మంత్రి వివరించారు.
మొదటిదశలో సిద్దిపేట, గజ్వే ల్, నిజామాబాద్, జడ్చర్ల పట్టణాల్లో కొనుగోలు కేంద్రాలు తెరవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అన్నిమార్కెట్ యార్డులను ఆధునీకరించి ఆన్‌లైన్ వ్యవస్థలోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. మార్కెటింగ్‌శాఖలో సిబ్బం ది కొరతను తీర్చేందుకు ప్రతిపాదనలను పం పాలని కోరారు. 30 మార్కెట్ల విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. రెవె న్యూ డివిజన్‌లో రైతు బజార్లను ఏర్పాటు చేయాలని, ఉన్న వాటిని ఆధునీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
మార్కెటింగ్ శాఖ ద్వారా పొద్దుతిరుగుడు కొనుగోళ్లు
Published Tue, Mar 31 2015 1:58 AM | Last Updated on Sat, Sep 2 2017 11:36 PM
Advertisement