
సిద్దిపేటజోన్: ఏడేళ్ల చిన్నారి అక్షయకు ఒక్క వాట్సాప్ సందేశం పునర్జన్మను ప్రసాదించింది. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారి వ్యధను సోషల్ మీడియాలో వాట్సాప్ మెసేజ్ రూపంలో చూసి చలించిపోయిన మంత్రి హరీశ్‌రావు ఆదుకొని ప్రాణాలు నిలబెట్టారు. ఉమ్మడి మెదక్ జిల్లా తూప్రాన్‌కు చెందిన చంద్రం కుమార్తె అక్షయ కొన్ని నెలల క్రితం గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. పేదరికంలో ఉన్న చంద్రం.. తన కుమార్తె వైద్యం కోసం ప్రభుత్వ పరంగా సాయం అందించాలని వాట్సాప్‌లో మంత్రిని కోరారు. దీంతో చలించిన హరీశ్.. చంద్రంను తన నివాస గృహానికి పిలిపించుకుని మాట్లాడారు.
పాపకు అవసరమైన చికిత్సకు ఎంత ఖర్చయినా తాను భరిస్తానని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.4 లక్షలను మంజూరు చేయించారు. దీంతో చిన్నారికి కేర్ ఆస్పత్రిలో ఊపిరితిత్తులను బాగు చేయడంతోపాటు గుండె రక్త నాళానికి స్టంట్ వేశారు. ఆదివారం అక్షయ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయింది. అక్షయ తండ్రి చంద్రం కుటుంబ సభ్యులతో కలసి మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రి హరీశ్‌రావును కలసి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment