సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయులకు శిక్షణ తరగతుల నిర్వహణకుగాను ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం(టీటీసీ) త్వరలో అందుబాటులోకి రానుంది. సిద్దిపేట జిల్లా కేంద్రంలో రూ.2.5 కోట్లతో నిర్మించిన టీటీసీ భవనాన్ని శుక్రవారం నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాలను స్కూళ్లలోనో ఇతర ప్రైవేటు స్థలాల్లో నిర్వహిస్తుంటారు. దీంతో శిక్షణ తరగతులకు ప్రతిసారీ కొత్త భవనాన్ని వెతకాల్సి ఉండేది. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లా కేంద్రంలో టీటీసీ భవనాన్ని ఏర్పా టు చేస్తే బాగుంటుందని ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి మొదట్నుంచి కోరుతున్నారు. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లాలో సీడీపీ నిధుల నుంచి రూ.2.5 కోట్లు కేటాయించి రాష్ట్రంలోనే తొలిసారిగా భవన నిర్మాణానికి కృషి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment