మోదీ సర్కార్ మాటలు ఘనంగా ఉంటాయని.. చేతల్లో మాత్రం శూన్యమని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. కేంద్రం గ్రామీణ ప్రాంత ప్రజలు, రైతుల పట్ల చిన్నచూపు ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లాలోని నల్లవాగు కాల్వల ఆధునికీకరణ పనులను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గుజరాత్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా దారికిరాలేదని చురకలు అంటించారు. ఉన్నత వర్గాలకు మేలు చేసేందుకే జీడీపీ ఉపయోగపడుతుందని విమర్శించారు. డ్రిప్ ఇరిగేషన్, ఇతర వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ విధించడమేమిటని మంత్రి ప్రశ్నించారు.
మాటలు ఘనం.. చేతలు శూన్యం
Published Sat, Feb 3 2018 11:45 AM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement