వికారాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులకు కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అడ్డం పడుతోందని నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు అన్నారు. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను సోమవారం ప్రారంభించారు. అంతకు ముందు పులుమామిడిలోని ఎమ్మెల్సీ యాదవరెడ్డి ఇంట్లో విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకుడు హర్షవర్ధన్ ప్రాజెక్టు పనులు జరగకుండా కోర్టుకు వెళ్లిన మాట వాస్తవమో కాదో ఆ పార్టీ నేతలే చెప్పాలన్నారు.
హర్షవర్ధన్ కాంగ్రెస్ నాయకుడా కాదా అనే విషయాన్ని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి సబితారెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. ఓ పక్క కోర్టులకు వెళ్లి స్టేలు తీసుకువస్తూ.. మరో పక్క నిరాహార దీక్షలతో నాటకాలాడుతున్నారని తెలిపారు. 2007లో ప్రాణహిత ప్రాజెక్టును ప్రారంభిం చిన కాంగ్రెస్ 2014 వరకు రూ.22 కోట్ల పనులు మాత్రమే చేసి.. సర్వేలు, మొబిలైజేషన్ల పేరుతో రూ.161 కోట్ల బిల్లులు తీసుకున్నారని ఆరోపించారు. ఈ అవినీతి బయట పడుతుందనే భయంతోనే కాంగ్రెస్ నేతలు గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసులు వేశారని అన్నారు.
అన్ని గోదాములను అందుబాటులోకి తెండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మాణం పూర్తయిన గోదాములతోపాటు మిగిలిన గోదాముల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. సోమవారం మార్కెటింగ్ శాఖ పని తీరుపై ఆయన సమీక్షించారు. రాష్ట్రంలో గోదాముల సామర్థ్యం, వాటవినియోగంపై అధికారులను ప్రశ్నించారు. రాష్ట్రంలో 364 గోదాములుంటే 310 గోదాముల నిర్మాణం పూర్తయిందని, అందులో 233 గోదాముల్ని వినియోగంలోకి తెచ్చామని అధికారులు పేర్కొన్నారు.
‘పాలమూరు’కు కాంగ్రెస్సే అడ్డు: హరీశ్
Published Tue, May 29 2018 1:55 AM | Last Updated on Fri, Mar 22 2019 2:57 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment