
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడంతోపాటు సాగునీటిపై రైతాంగం ఆశల్ని తీర్చాల్సిన బాధ్యత ప్రతి ఇంజనీరుపై ఉందని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్‌కు ఉన్న అవగాహన దేశంలో మరే సీఎంకు లేదన్నారు. వచ్చే ఏడాది ఎన్నికల దృష్ట్యా సాగునీటి శాఖకు రాబోయే 8 నెలలే కీలకమన్నారు.
రాష్ట్ర నీటిపారుదల శాఖ 2018 క్యాలెండర్‌ను మంత్రి బుధవారం జలసౌధలో ఆవిష్కరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరుగుతున్న పనుల వేగాన్ని మిగతా ప్రాజెక్టుల్లోనూ చేపట్టాలన్నారు. 16 నెలల్లో చేయాల్సిన పనుల్ని 8 నెలల్లోనే పూర్తి చేయాలని కోరారు. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులను నిర్మించే అవకాశం ఇక రాదన్నారు. రైతుల జీవితాల్లో వెలుగు నింపే జలసంకల్పంలో భాగస్వాములైనందుకు ఈ శాఖ ఇంజనీర్లంతా గర్వపడాలన్నారు. సామాజిక బాధ్యతగా ఉద్యోగ విధులు నిర్వర్తించాలని కోరారు.
మరో 312 ఏఈఈలను నియమిస్తాం
నీటిపారుదల శాఖలో ఈ ఏడాది మరో 312 మంది ఏఈఈలను నియమిస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఇరిగేషన్, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయడంతోనే కాళేశ్వరం ప్రాజెక్టులో 8 వేల భూసేకరణ పూర్తయిందన్నారు. సెలవులు, పండుగల్లో కూడా పనిచేయడంతోనే అనుకున్న సమయానికి డిజైన్లు పూర్తయ్యాయన్నారు.
జోషి (ష్) స్ఫూర్తిగా: టైపిస్టు, సెక్షన్ క్లర్క్ చేసే పనుల్ని కూడా ఈ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి అహం లేకుండా చేసుకుపోతున్న తీరును ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ స్పెషల్ సీఎస్ జోషి, ఇరిగేషన్ ఈఎన్సీలు మురళీధరరావు, నాగేందర్ రావు, అనిల్, లిఫ్ట్ పథకాల సలహాదారు పెంటారెడ్డి, పలువురు సీఈ, ఎస్‌ఈలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment