శుక్రవారం కాకర్లవాయి సభలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణను కోటి ఎకరాల మాగాణం చేయాలన్న సీఎం కేసీఆర్ మహోన్నత లక్ష్యానికి పాలేరు నియోజకవర్గం ఊపిరిలూది 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు తెచ్చుకున్న తొలి నియోజకవర్గంగా గుర్తింపు పొందిందని, కృష్ణ, గోదావరి నదుల అనుసంధానానికి సైతం ఖమ్మం జిల్లాలోనే అంకురార్పణ జరిగిందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు వద్ద భక్తరామదాసు రెండోదశ ఎత్తిపోతల పథకం ద్వారా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి నీటిని విడుదల చేశారు. కాకరవాయిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
భక్తరామదాసు ఎత్తిపోతల పథకం బృహత్తరమైందని, ఈ ప్రాజెక్టుకు కాళేశ్వరం ద్వారా తొలి దశలోనే నీరందించనున్నామని, సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఇప్పటి వరకు కృష్ణా జలాలతో నిండిన చెరువులకు.. గోదావరి జలాలు సైతం వస్తాయని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు కావాలని పార్టీలు ఆందోళన చేయడం సహజమని, కాంగ్రెస్ పార్టీ మాత్రం సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తూ.. గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లాలంటూ రైతులను రెచ్చగొడుతోందని ఆరోపించారు. ప్రాజెక్టుల పనులు సాగుకుం డా న్యాయ స్థానాలను ఆశ్రయించి రైతాంగం నోటి కాడి ముద్ద లాక్కునే ప్రయత్నం చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. సీతారా మ ప్రాజెక్టునకు ఈ నెలలోనే కేంద్ర ప్రభు త్వం నుంచి అటవీ అనుమతులు తీసుకొస్తామని, వచ్చేనెల వన్యప్రాణుల అనుమతులు, ఆపై పర్యావరణ అనుమతులు తీసుకు వస్తామని హరీశ్‌రావు వివరించా రు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయం అంటే తెలియని సన్నాసులు ప్రభుత్వంపై పస లేని విమర్శలు చేస్తూ ప్రజల్లో పలచన అవుతున్నారని విమర్శించారు. సభలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, శాసనమండలి విప్ పల్లా రాజేశ్వరరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, మదన్‌లాల్, కోరం కనకయ్య పాల్గొన్నారు.
కాళేశ్వరం నీళ్లతో రైతుల కాళ్లు కడుగుతాం
చెన్నారావుపేట(నర్సంపేట): కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను వర్షాకాలంలోపు పూర్తి చేసి ఆ నీటితో రైతుల కాళ్లు కడుగుతామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావు పేట మండలం ఉప్పరపల్లిలో సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి చే పట్టిన ‘పల్లె ప్రగతి’లో శుక్రవారం పా ల్గొన్నా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.
నెల రోజుల్లో కొత్త పంచాయతీలు
సాక్షి, మహబూబాబాద్: సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 500కు పైగా జనాభా గల గ్రామాలు, గిరిజన తండాలు వచ్చే నెల రోజుల్లో గ్రామ పంచాయతీలుగా మారబోతున్నాయని మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కురవిలో శుక్రవారం మంత్రులు తుమ్మ ల నాగేశ్వరరావు, ఇంద్రకరణ్‌రెడ్డితో కలసి పలు అభివృద్ధి పనులకు హరీశ్ శంకుస్థాపనలు చేశారు. అనంతరం జరిగిన బహిరంగసభలో మంత్రి హరీశ్‌రావు ప్రసంగించారు. త్వరలో ఏర్పడే కొత్త పంచాయతీలను కలుపుకొని కొద్ది రోజుల్లోనే పంచాయతీ ఎన్నికలను కూడా నిర్వహించేందు కు ప్రభుత్వం సిద్ధమవుతోందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment