వచ్చే ఏడాది 23 సాధారణ సెలవులు | 23 general holidays next year | Sakshi
Sakshi News home page

వచ్చే ఏడాది 23 సాధారణ సెలవులు

Published Sat, Dec 7 2024 4:40 AM | Last Updated on Sat, Dec 7 2024 4:40 AM

23 general holidays next year

ఆదివారంతో కలిసిపోయిన నాలుగు సెలవులు

గరిష్టంగా ఐదు వాడుకునే విధంగా 21 ఆప్షనల్‌ హాలిడేలు 

2025 సాధారణ, ఆప్షనల్‌ హాలిడే జాబితా విడుదల చేసిన ప్రభుత్వం 

సాక్షి, అమరావతి: 2025 క్యాలెండర్‌ సంవత్సరానికి సంబంధించి సాధారణ సెలవులు, ఆప్షనల్‌ హాలిడేల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. దీనిప్రకారం 2025కు సంబంధించి మొత్తం 23 సెలవు దినాలు ప్రకటించింది. ఇందులో నాలుగు సెలవులు రిపబ్లిక్‌ డే, ఉగాది, శ్రీరామనవమి, మొహర్రం పండుగలు ఆదివారంలో కలిసిపోవడంతో నికరంగా 19 సెలవులు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులకు లభించనున్నాయి. 

అదే విధంగా అక్టోబర్‌ 2 గాం«దీజయంతి, విజయదశమి రెండూ కలిసిపోయాయి. పై అధికారికి ముందస్తు సమాచారంతో గరిష్టంగా ఐదు సెలవుదినాలను వినియోగించుకునే విధంగా 21 ఆప్షనల్‌ హాలిడేస్‌ను ప్రకటించింది. ఇందులో రెండు ఈద్‌–ఈ– గదర్, మహలాయ అమావాస్యలు ఆదివారంతో కలిసిపోయాయి. మొత్తం 12 నెలల్లో 10 నెలల్లో సెలవులు ఉండగా మే, నవంబర్‌ నెలల్లో ఎటువంటి సెలవులు లేవు. 

జనవరి, ఏప్రిల్, ఆగస్టు నెలల్లో అత్యధికంగా నాలుగేసి రోజులు సెలవులు వచ్చాయి. బ్యాంకులు వంటి ఇతర వ్యాపార సంస్థలకు నెగోషబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ యాక్ట్‌ ద్వారా 20 సాధారణ సెలవులను ప్రకటించింది. నెలవంక దర్శనాన్ని బట్టి నిర్ణయించే రంజాన్, బక్రీద్, మొహర్రం, ఈద్‌ మిలాద్‌ ఉన్‌ నబీతో పాటు ఇతర హిందూ పర్వదినాల్లో ఏమైనా మార్పులు ఉంటే వాటిని ప్రచార మాధ్యమాల ద్వారా ముందుగానే తెలియచేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement