Optional Holidays
-
వచ్చే ఏడాది 23 సాధారణ సెలవులు
సాక్షి, అమరావతి: 2025 క్యాలెండర్ సంవత్సరానికి సంబంధించి సాధారణ సెలవులు, ఆప్షనల్ హాలిడేల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. దీనిప్రకారం 2025కు సంబంధించి మొత్తం 23 సెలవు దినాలు ప్రకటించింది. ఇందులో నాలుగు సెలవులు రిపబ్లిక్ డే, ఉగాది, శ్రీరామనవమి, మొహర్రం పండుగలు ఆదివారంలో కలిసిపోవడంతో నికరంగా 19 సెలవులు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులకు లభించనున్నాయి. అదే విధంగా అక్టోబర్ 2 గాం«దీజయంతి, విజయదశమి రెండూ కలిసిపోయాయి. పై అధికారికి ముందస్తు సమాచారంతో గరిష్టంగా ఐదు సెలవుదినాలను వినియోగించుకునే విధంగా 21 ఆప్షనల్ హాలిడేస్‌ను ప్రకటించింది. ఇందులో రెండు ఈద్–ఈ– గదర్, మహలాయ అమావాస్యలు ఆదివారంతో కలిసిపోయాయి. మొత్తం 12 నెలల్లో 10 నెలల్లో సెలవులు ఉండగా మే, నవంబర్ నెలల్లో ఎటువంటి సెలవులు లేవు. జనవరి, ఏప్రిల్, ఆగస్టు నెలల్లో అత్యధికంగా నాలుగేసి రోజులు సెలవులు వచ్చాయి. బ్యాంకులు వంటి ఇతర వ్యాపార సంస్థలకు నెగోషబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ద్వారా 20 సాధారణ సెలవులను ప్రకటించింది. నెలవంక దర్శనాన్ని బట్టి నిర్ణయించే రంజాన్, బక్రీద్, మొహర్రం, ఈద్ మిలాద్ ఉన్ నబీతో పాటు ఇతర హిందూ పర్వదినాల్లో ఏమైనా మార్పులు ఉంటే వాటిని ప్రచార మాధ్యమాల ద్వారా ముందుగానే తెలియచేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
2024లో 27 సాధారణ సెలవులు
సాక్షి, హైదరాబాద్: వచ్చే సంవత్సరంలో 27 సాధారణ సెలవులు, 25 ఐచ్ఛిక సెలవులు ఉండనున్నాయి. ఈ మేరకు సాధారణ, ఐచ్చిక సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఈ సాధారణ సెలవులు, ఐచ్చిక సెలవులను పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అన్ని ఆదివారాలు, అన్ని రెండో శనివారాల్లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మూసి ఉంచాలని ఆదేశించారు. 2024 జనవరి 1న సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఫిబ్రవరి నెలలోని రెండో శనివారం (ఫిబ్రవరి 10) రోజును పనిదినంగా పాటించాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 25 ఐచ్ఛిక సెలవుల్లో గరిష్టంగా 5 సెలవులను మాత్రమే వినియోగించాలని కోరారు. తమ ఇష్టాలకు అనుగుణంగా మతాలతో సంబంధం లేకుండా ఏదైనా పండుగకి సంబంధించిన ఐచ్చిక సెలవును ఉద్యోగులు వాడుకోవచ్చని తెలిపారు. అయితే దీనికోసం పైఅధికారికి ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణ సెలవులు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని ప్రభుత్వరంగ సంస్థలు, పారిశ్రామిక సంస్థలకు వర్తించవని స్పష్టం చేశారు. సంబంధిత సంస్థలే సెలవులపై ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తాయన్నారు. నెలవంక ఆధారంగా రంజాన్, బక్రీద్, మొహర్రం, మిలాద్ ఉన్ నబీ పర్వదినాల సెలవులను తర్వాత మారుస్తామని తెలిపారు. -
‘విద్యార్థులకూ ఆప్షనల్ సెలవులు’
హైదరాబాద్: పాఠశాలల్లో ఆప్షనల్ హాలిడేస్‌ను ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులకూ వర్తింపజేయాలని పీఆర్టీయూ–టీఎస్ అధ్యక్షుడు సరోత్తంరెడ్డి, యూటీఎఫ్ అధ్యక్షుడు నర్సిరెడ్డి వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. పండుగల సందర్భంగా కొన్ని సార్లు విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తున్న నేపథ్యంలో ఐదు ఆప్షనల్ హాలిడేస్‌ను పాఠశాల మొత్తానికి సెలవులుగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే 6, 7 తరగతులకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్లు భౌతిక శాస్త్రాన్ని బోధించాలా? గణితాన్ని స్కూల్ అసిస్టెంట్ లేదా టీచర్లు బోధించాలా? అన్న విషయంలో స్పష్టత ఇవ్వాలని పేర్కొన్నారు. -
వచ్చే ఏడాది-2017 సెలవులివే!
తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఏడాది 2017కు సంబంధించిన సాధారణ సెలవులు, ఐచ్ఛిక సెలవులను మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన విభాగం నేడు ఉత్తర్వులను జారీచేసింది. అన్ని అధికారిక విభాగాలు ఈ సెలవు దినాలను పాటించాలని ప్రభుత్వం పేర్కొంది. సాధారణ సెలవులు తేదీ వారం బోగి 13.01.2017 శుక్రవారం గణతంత్ర దినోత్సవం 26.01.2017 గురువారం మహాశివరాత్రి 24.02.2017 శుక్రవారం ఉగాది 29.03.2017 బుధవారం శ్రీరామనవమి/బాబు జగ్జీవన్ రామ్ జయంతి 05.04.2017 బుధవారం గుడ్ ఫ్రైడే/డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి 14.04.2017 శుక్రవారం రంజాన్(ఈద్ ఉల్ ఫిత్ర్) 26.06.2017 సోమవారం రంజాన్ తరువాతి రోజు 27.06.2017 మంగళవారం బోనాలు 10.07.2017 సోమవారం శ్రీకృష్ణాష్టమి 14.08.2017 సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం 15.08.2017 మంగళవారం వినాయక చవితి 25.08.2017 శుక్రవారం బక్రీద్(ఈద్ ఉల్ అజా) 02.09.2017 శనివారం బతుకమ్మ ప్రారంభం 20.09.2017 బుధవారం దుర్గాష్టమి 30.09.2017 శనివారం మహాత్మాగాంధీ జయంతి 02.10.2017 సోమవారం దీపావళి 18.10.2017 బుధవారం కార్తీక పౌర్ణమి/గురునానక్ జయంతి 04.11.2017 శనివారం ఈద్ మిలాద్ ఉన్ నబి 01.12.2017 శుక్రవారం క్రిస్మస్ 25.12.2017 సోమవారం బాక్సింగ్ డే 26.12.2017 మంగళవారం రెండో శనివారం, ఆదివారం వచ్చిన సాధారణ సెలవులు సంక్రాంతి/పొంగల్ 14.01.2017 రెండో శనివారం హోళి 12.03.2017 ఆదివారం షహదత్ ఇమామ్ హుస్సేన్(ఏ.ఎస్) 10వ మొహర్రం 01.10.2017 ఆదివారం ఐచ్ఛిక సెలవులు తేదీ వారం యాజ్ దాహుమ్ షరీఫ్ 10.01.2017 మంగళవారం శ్రీ పంచమి 01.02.2017 బుధవారం హజ్రత్ అలీ జయంతి 11.04.2017 మంగళవారం షబ్-ఎ-మీరజ్ 25.04.2017 మంగళవారం బసవ జయంతి 28.04.2017 శుక్రవారం బుద్ధ పూర్ణిమ 10.05.2017 బుధవారం షబ్-ఎ-బారాత్ 12.05.2017 శుక్రవారం షహదత్ హజ్రత్ అలీ 16.06.2017 శుక్రవారం జుమా-అతుల్-వాడ/షబ్-ఎ-కదర్ 23.06.2017 శుక్రవారం వరలక్ష్మి వ్రతం 04.08.2017 శుక్రవారం శ్రావణ పౌర్ణమి/రాఖి పౌర్ణమి 07.08.2017 సోమవారం పార్సీ నూతనసంవత్సరాది 17.08.2017 గురువారం మహర్ణవమి 29.09.2017 శుక్రవారం నరక చతుర్థి 17.10.2017 మంగళవారం అర్బయీన్ 10.11.2017 శుక్రవారం రెండో శనివారం, ఆదివారం రోజుల్లోని ఐచ్ఛిక సెలవులు నూతన సంవత్సరాది 01.01.2017 ఆదివారం కనుమ 15.01.2017 ఆదివారం హజ్రత్ సయ్యద్ మహమ్మద్ జువన్పురి జయంతి 11.02.2017 రెండో శనివారం మహావీర్ జయంతి -09.04.2017 - ఆదివారం రథయాత్ర - 25.06.2017 - ఆదివారం ఈద్ - ఇ -గదీర్ - 10.09.2017 - ఆదివారం క్రిస్మస్ ఈవ్ - 24.12.2017 - ఆదివారం