'ఆర్ఆర్ఆర్'తో ఆస్కార్ కొట్టి, గ్లోబల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి.. ప్రస్తుతం జాలీ మూడ్ లో ఉన్నాడు. కుటుంబంతో కలిసి ఫ్యామిలీ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు బయటకు రావడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. ఈ హాలీడే బ్రేక్ లో రాజమౌళి చాలా హ్యాపీగా కనిపిస్తున్నాడు. అయితే ఈ ట్రిప్ కి ఓ కారణముందని అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: ఒక్కో పాట కోసం రూ.3 కోట్లు.. ఆ సింగర్ ఎవరో తెలుసా?)
రాజమౌళి పేరు ఇప్పుడు దేశంలో ఓ బ్రాండ్ అయిపోయింది. ఎందుకంటే 'బాహుబలి'తో టాలీవుడ్ పవర్ ఏంటో చూపించిన జక్కన్న.. గతేడాది విడుదలైన 'ఆర్ఆర్ఆర్'తో ఏకంగా ఆస్కార్ కొట్టాడు. 'నాటు నాటు' పాటకు ఈ పురస్కారం రావడంతో రాజమౌళి పేరు హాలీవుడ్ లోనూ మార్మోగిపోయింది. ఇలా దాదాపు ఏడాదిపాటు తీరిక లేకుండా చాలా బిజీబిజీగా గడిపాడు. త్వరలో మహేశ్ తో చేయబోయే సినిమాని ప్రారంభించబోతున్నాడు.
ఈ రెండింటికి మధ్య కాస్త విరామం దొరకడంతో రాజమౌళి.. మొత్తం కుటుంబంతో కలిసి తమిళనాడులోని తూత్తుకుడికి వెళ్లిపోయాడు. రిసార్ట్స్ లో జక్కన్న మొక్కలు నాటుతున్న ఫొటోలని రిసార్ట్ నిర్వహకులు ఇన్ స్టా స్టోరీలో షేర్ చేయడంతో అవి వైరల్ అయిపోయాయి. వీటితో పాటు మరికొన్ని ఫొటోలు బయటకొచ్చాయి. ఇకపోతే మహేశ్-రాజమౌళి మూవీ ఆగస్టులో లాంచ్ కానుందని అంటున్నారు. షూటింగ్ వచ్చే ఏడాది నుంచి ప్రారంభమవుతుందని చెబుతున్నారు. వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
(ఇదీ చదవండి: ఈ నటిని గుర్తుపట్టారా? అప్పుడు ఐటమ్ సాంగ్స్ ఇప్పుడేమో ఆశ్రమంలో!)
Comments
Please login to add a commentAdd a comment