ఎడారిగా మారిన హైదరాబాద్!
హైదరాబాద్: సమగ్ర సర్వే కోసం తెలంగాణ ప్రాంత ప్రజలు తమ తమ గ్రామాలకు వెళ్లడంతో హైదరాబాద్ మహానగరం ఎడారిగా మారింది. ప్రజలందరూ సమగ్ర సర్వేలో పాల్గొనడంతో హైదరాబాద్ నగరంలో అప్రకటిత కర్ఫ్యూ తలపిస్తోంది. సమగ్ర సర్వే కోసం ఇంటివద్దనే ఉండాలని తెలంగాణ ప్రభుత్వం సూచించడంతో ప్రజలు ఇంటి వద్దనే ఉన్నారు. దాంతో రోడ్లపై ఆటో రిక్షాలు, బస్సులు, కార్లు కనిపించడం లేదు. ప్రభుత్వ ఆదేశాలతో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, దుకాణాలు, పెట్రోల్ బంక్ లు, హోటళ్లు, సినిమా హాళ్లు, ఇతర వ్యాపార కేంద్రాలు పూర్తిగా మూసివేశారు. సమగ్ర సర్వే కోసం అత్యవసర సేవల్ని కొనసాగిస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఐటీ కంపెనీ, ఐటీ ఆధారిత సంస్థలు మాత్రం సెలవు దినంగా పాటించబోమని..తమ ఉద్యోగులను షిఫ్టుల వారిగా ఉపయోగించుకుంటామని తెలిపారు. సర్వేలో పాల్గొంటే ఎలాంటి అభ్యంతరాలు ఉండవని తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ అన్నారు. సమగ్ర సర్వేకు పూర్తి స్థాయిలో స్పందన రావడంతో రోడ్లన్ని ఖాళీగా బోసి పోయి ఉన్నాయి. హైదరాబాద్ మహానగరంలో పూర్తిగా కర్పూ పెట్టిన వాతావరణం కనిపిస్తోంది.