ముందుగా నిర్ణయించిన తేదీ ప్రకారమే ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) సందర్భంగా స్టాక్ మార్కెట్లు బుధవారం సెలవు పాటిస్తున్నాయి. అయితే నెలవంక కనిపించకపోవడంతో.. రంజాన్ ను గురువారం (జూలై 7)న జరుపుకోవాలని ఢిల్లీలోని ఫతేపురి మసీదు ఇమామ్, ముఫ్తీ మహ్మద్ ముకరం అహ్మద్ ప్రకటించారు. ఆలస్యంగా ఈ విషయాన్ని ప్రకటించడంతో మార్కెట్లు బుధవారమే సెలవు పాటిస్తున్నాయి. ఫతేపురి మసీదు మత పెద్దల నిర్ణయం ప్రకారం రాజధానిలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు గురువారం సెలవు పాటించనున్నట్లు కేంద్రం ప్రకటించింది.
అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలంగా ఉండటంతో మార్కెట్ల ఆరు రోజుల ర్యాలీకి మంగళవారం బ్రేక్ పడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 111.89 పాయింట్లు క్షీణించి 27,166.87 పాయింట్ల వద్ద క్లోజ్‌కాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 34.75 పాయింట్ల నష్టంతో 8,335.95 పాయింట్ల వద్ద ముగిసింది.