
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లకు నేడు (సోమవారం) సెలవు. ఈద్ పర్వదినం సందర్భంగా ఈక్విటీ మార్కెట్లు నేడు పనిచేయవు. కాగా వరుసగా మూడవ రోజుకూడా నష్టపోయిన సూచీలు శుక్రవారం అతను నిఫ్టీ 9039 వద్ద సెన్సెక్స్ 30,672 వద్ద ముగిసాయి. డాలరు మారకంలో రూపాయి 75.92 వద్ద స్థిరపడింది.
ఒకవైపు అమెరికా-చైనా ట్రేడర్ వార్, మరోవైపు ఇన్వెస్టర్లను నిరాశపర్చిన ఉద్దీపన ప్యాకేజీ... దీనికి తోడు ఆర్‌బీఐ కీలకరేట్ల తగ్గింపు అంచనాలను అందుకోలేకపోవడం దేశీయ మార్కెట్లను నిరాశపర్చాయి. దీంతో వారం మొత్తం మీద సెన్సెక్స్ 425 పాయింట్లు, నిఫ్టీ 98 పాయింట్లు నష్టపోయాయి.