తన వృత్తిపరమైన తన జీవితానికి భార్య ట్వింకిల్ ఖన్నా వల్లనే వెలుగొచ్చిందని బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ గర్వంగా చెప్పాడు. 46 ఏళ్ల ఈ నటుడు ఎ.ఆర్.మురుగదాస్ యాక్షన్ థ్రిల్లర్ ‘హాలిడే’ సినిమాలో కనిపించనున్నాడు. తన నిర్ణయాలకు నిరంతరం మద్దతు పలికిందన్నాడు. ‘ఆమె అదృష్టం నాకు ఎల్లప్పుడూ కలిసి వచ్చింది. తన ప్రతి నిర్ణయానికీ మద్దతు పలికింది. ఎప్పుడూ నాకు తోడూనీడగా ఉంది. నాకు వచ్చిన అవకాశాలకు సంబంధించిన స్క్రిప్టులను కూడా చదివేది కాదు’ అని ఆదివారం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనోభావాలను పంచుకున్నాడు. ‘ఆమె వ్యక్తిగత జీవితం ఆమెకు ఉంది. దానితోనే క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. చక్కని కుటుంబం కలిగి ఉందనే ఆనందం ఆమె కళ్లలో కనిపిస్తుంటుంది. అందువల్ల సంతోషంగా ఉంటుంది.
కాగా రాజేశ్‌ఖన్నా, డింపుల్ కపాడియా కుమార్తె అయిన ట్వింకిల్‌ను 2001లో అక్షయ్ వివాహమాడాడు. ‘జబ్ ప్యార్ కిసీసే హోతా హై’ తర్వాత సినిమాలకు వీడ్కోలు పలికిన ట్వింకిల్...డిజైనింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అదే సమయంలో మాధురీదీక్షిత్, శ్రీదేవి, కాజోల్, ఐశ్వర్యారాయ్ వంటి తారలు బాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు ఎంతగానో ఆసక్తి చూపుతున్నప్పటికీ ట్వింకిల్ పట్టించుకోలేదు. ట్వింకిల్ మళ్లీ బాలీవుడ్‌లోకి అడుగు పెట్టే అవకాశముందా అని మీడియా ప్రశ్నించగా అదేమీ లేదన్నాడు. అటువంటి ఆలోచనలేమీ ఆమెకు లేవన్నాడు. మళ్లీ సినిమాల్లోకి రావాల్సిందిగా తాను కూడా ట్వింకిల్‌ను అడిగానని, ఆనందంగా కాలం గడపగలిగితే అదే చాలంటూ జవాబిచ్చిందన్నాడు. ప్రతిరోజూ సినిమా షూటింగ్ ముగిసిన వెంటనే ఇంటికి వెళ్లి కుటంబసభ్యులతో ఆనందంగా కాలం గడపడం తనకు ఎంతో ఇష్టమన్నాడు.
ఆమే నా అదృష్ట దేవత
Published Sun, May 25 2014 10:14 PM | Last Updated on Sat, Sep 2 2017 7:50 AM
Advertisement
Advertisement