
నిమజ్జనం సందర్భంగా నేడు సెలవు
గణేశ్ నిమజ్జనం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం గురువారంను సాధారణ సెలవు దినంగా ప్రకటించింది. గణేశ్ విగ్రహాల శోభాయాత్ర, నిమజ్జనాన్ని పురస్కరించుకొని హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు, రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం గురువారం సెలవు ప్రకటించింది. దీనికి బదులుగా నవంబర్ 12వ తేదీన రెండో శనివారం పని చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఉత్తర్వు జారీ చేశారు.