
సాక్షి, అమరావతి: తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని విద్యా సంస్థలకు బుధవారం కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తుపాను తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో అన్ని విద్యా సంస్థలను మూసివేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్, ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్‌గౌర్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
బుధవారం కూడా కాకినాడ నుంచి నెల్లూరు వరకు ఉన్న జిల్లాల్లో విద్యా సంస్థలు తెరవరాదని ఆదేశించారు.