shcools
-
నేడు విద్యా సంస్థలకు సెలవు
సాక్షి, అమరావతి: తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని విద్యా సంస్థలకు బుధవారం కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తుపాను తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో అన్ని విద్యా సంస్థలను మూసివేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్, ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్‌గౌర్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం కూడా కాకినాడ నుంచి నెల్లూరు వరకు ఉన్న జిల్లాల్లో విద్యా సంస్థలు తెరవరాదని ఆదేశించారు. -
మ్యాగజైన్ స్టోరీ 13 August 2021
-
స్కూళ్ల ప్రారంభంపై ఐసీఎంఆర్ కీలక సూచనలు
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా విలయం,లాక్డౌన్ ఆంక్షలతో స్కూలు విద్య బాగా దెబ్బతింది. తాజాగా స్కూళ్ల ప్రారంభంపై ఐసీఎంఆర్ సెక్రటరీ డాక్టర్ బలరామ్ భార్గవ కీలక సూచనలు చేశారు. ముందు ప్రాథమిక పాఠశాలలను తెరిస్తే మంచిదని సూచించారు. ఎందుకంటే ఇన్ఫెక్షన్ను తట్టుకునే సామర్థ్యం చిన్నారులకు ఎక్కువగా ఉంటుందన్నారు. అలాగే టీచర్లందరికి వ్యాక్సినేషన్ పూర్తయితే స్కూళ్లు తెరవొచ్చని ఆయన పేర్కొన్నారు. సెకండరీ పాఠశాలలకంటే ముందు ప్రాధమిక పాఠశాలలను పునఃప్రారంభిస్తే మంచిదనే సంకేతాలను ప్రభుత్వం మంగళవారం అందించింది. అయితే దీనికంటే ముందు పాఠశాలల బస్సు డ్రైవర్లు, ఉపాధ్యాయులు, పాఠశాలలోని ఇతర సిబ్బందికి టీకాలు వేయడం అవసరమని ఐసీఎంఆర్ డీజీ భార్గవ అన్నారు. కాగా దేశంలో 2-18 ఏళ్ల లోపు వారికి కరోనా టీకా అందించే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భారత్ బయోటెక్ కోవాక్సిన్ టీకా రెండు,మూడు దశల ట్రయల్స్ డేటా త్వరలోనే వెల్లడికానుందని, దీంతో సెప్టెంబర్ నాటికి టీకా లభించనుందనే అంచనాలను ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా ఇటీవల చెప్పారు. డ్రగ్ రెగ్యులేటర్ ఆమోదంతో పిల్లలకు ఈ టీకా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. -
మనబడి నాడు నేడుతో పాఠశాలను అభివృద్ధిచేస్తాం
-
ఈసారి గుణ‘పాఠం’
కడప ఎడ్యుకేషన్: ఈసారి స్కూళ్లు తెరిచే సమయానికి పాఠ్య పుస్తకాలు చేతికందేలా ఉన్నాయి. గతం నుంచి నేర్చుకున్న పాఠాలతో అధికారులు తొందరగా మేలుకొన్నారు. ఒక అడుగు ముందుకేశారు. వేసవి సెలవులు ముగిసేలోపే పాఠ్యపుస్తకాలను తెప్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే మొదటి విడత పుస్తకాలను జిల్లాకు చేరాయని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ ఏడాది పాఠ్యపుస్తకాల కొరత లేకుండా జూన్ నాటికి స్కూల్స్ పాయింట్లకు చేర్చేందుకు విద్యాశాఖ ముందస్తు కసరత్తు చేస్తోంది. గత మూడు, నాలుగేళ్ల నుంచి విద్యాసంవత్సరం ప్రారంభమై నెలలు గడిచినా అరకొరగానే పాఠ్యపుస్తకాలు అందేవి. ఈ విద్యా సంవత్సరంలో మాత్రం ఇలాంటి ఇబ్బందులేవీ తలెత్తకూడదని విద్యాశాఖ కరసత్తు మొదలు పెట్టి సకాలంలో చేర్చేందుకు శ్రీకారం చుట్టింది. వేసవి సెలవులు ముగిసే నాటికే ప్రింటర్ల నుంచి జిల్లా కేంద్రానికి ..అక్కడి నుంచి మండల వనరుల కేంద్రానికి పాఠ్య పుస్తకాలను చేర్చనుంది. తర్వాత పాఠశాలలువెంటనే విద్యార్థులకు అందజేసే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు తెలిసింది. 2017– 18 యూడైస్ ప్రకారం.... జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 2542, ప్రాథమికోన్నత పాఠశాలలు 272, ఉన్నత పాఠశాలలు 391 ఉన్నాయి. వీటిలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 91,750 మంది కాగా, ప్రాథమికోన్నత పాఠశాలలు – విద్యార్థులు 18,013 మంది ఉంటున్నారని అంచనా. అలాగే ఉన్నత పాఠశాలల్లో 92,769 మంది చదువుతున్నారు. గతేడాది ఈ సమయానికి ముద్రణ పక్రియనే మొదలు కాలేదు. ఆలస్యంగా పుస్తకాలు రావడంతో పాఠ పుస్తకాలతోనే చదువులు కొనసాగించాల్సి వచ్చింది. దీంతో విద్యాశాఖ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. 2019–20 విద్యా సంవత్సరానికి మొదటి విడతలో భాగంగా ఈనెల 18 నుంచి పాఠ్య పుస్తకాలు జిల్లా కేంద్రంలోని గోడౌన్‌కు చేరుకుంటున్నాయి. ఇందులో 2వ తరగతికి ఇంగ్లీస్ రీడర్‌కు సంబంధించి 15.065 పుస్తకాలు, 8వ తరగతి ఫిజికల్ సైన్సు (ఇంగ్లీష్ మీడియం) 9641 పుస్తకాలు వచ్చాయి. 9వ తరగతి( తెలుగు మీడియం) సోషల్ పుస్తకాలు 7678 వచ్చాయి. రెండు మూడు రోజులలో తక్కిన పుస్తకాలు రానున్నాయి. మే చివరికల్లా అన్ని పుస్తకాలు జిల్లాకు రానున్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపారు. 50 శాతం మేర రాగానే పంపిణీ ప్రారంభం: పాఠ్యపుస్తకాలకు సంబంధించి మన జిల్లాకు రావాల్సిన పాఠ్యపుస్తకాల్లో సగం పుస్తకాలు జిల్లాకు రాగానే పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఈ ఏడాది సకాలంలోనే పాఠ్యపుస్తకాలను అందించేందుకు కృషి చేస్తాం. – పి. శైలజ, జిల్లా విద్యాశాకాధికారి -
రేపటి నుంచి వేసవి సెలవులు
అనంతపురం ఎడ్యుకేషన్ : అన్ని యాజమాన్యాల కింద పని చేస్తున్న పాఠశాలలకు ప్రభుత్వం ఈ నెల 23 నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవులు ప్రకటించినట్లు డీఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. ఇదిలాఉండగా ఎప్పుడూ లేనివిధంగా ఈసారి దాదాపు నెల రోజుల ముందే సిలబస్ పూర్తికాకపోయినా అన్ని తరగతులకు వార్షిక పరీక్షలు నిర్వహించి మమ అనిపించారు. ఆ తర్వాత మార్చి 28 నుంచి రెమిడియల్ టీచింగ్ నిర్వహించాలని ప్రభుత్వం ప్రకటించింది. అయితే అమలులో చేతులెత్తేసింది. చాలా స్కూళ్లలో కనీసం 50 శాతం మంది కూడా పిల్లలు రావడం లేదు.