
చిన్న స్టంట్లు కూడా ప్రమాదకరమే:అక్షయ్ కుమార్
త్వరలో విడుదల కానున్న హాలిడే సినిమా షూటింగ్‌లో భాగంగా బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ ఓ భవంతిపై నుంచి కిందికి దూకాడు.
న్యూఢిల్లీ: త్వరలో విడుదల కానున్న హాలిడే సినిమా షూటింగ్‌లో భాగంగా బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ ఓ భవంతిపై నుంచి కిందికి దూకాడు. అంతేకాకుండా ఓ భీకరమైన పోరాటం కూడా చేశాడు. ఈ సందర్భంగా అక్షయ్ మీడియాతో మాట్లాడుతూ తన మనోభావాలను పంచుకున్నాడు. ‘సైనికుడెప్పుడూ సెలవు తీసుకోడు. అయితే చిన్నదైనా, పెద్దదైనా సినిమా షూటింగ్‌లో భాగంగా స్టంట్ చేసే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అది ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. రిస్కీ సీన్లు చేసే సమయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. చివరికి చిన్న జంప్‌లు చేసేటపుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. పెద్ద స్టంట్లు మాత్రమే ప్రమాదమనుకోకూడదు. ఒక్కోసారి చిన్న స్టంట్‌కూడా ప్రాణాలపైకి రావొచ్చు’ అని అన్నాడు.
హాలిడే సినిమాలో భారీ స్టంట్‌లు చేస్తున్నారా అని మీడియా ప్రశ్నించగా పై విధంగా స్పందించాడు. ఎ.ఆర్.మురగదాస్ సారథ్యంలో రూపొందుతున్న హాలిడే సినిమా కోసం నిర్మాతలు బ్రిటన్‌నుంచి ప్రముఖ స్టంట్‌మెన్ గ్రెగ్ పొవెల్‌ను ఇండియాకు రప్పించారు. హారీ పొట్టర్, జేమ్స్ బాండ్ తదితర సినిమాలకు గ్రెగ్ పొవెల్ స్టంట్‌మెన్‌గా పనిచేశాడు.