నేటి నుంచి మూడు రోజులు మార్కెట్ బంద్
Published Sun, Oct 9 2016 10:37 PM | Last Updated on Mon, Sep 4 2017 4:48 PM
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు మూడు రోజులు సెలవు ప్రకటించారు. విజయదశమి పర్వదినం పురష్కరించుకుని సోమవారం నుంచి బుధవారం వరకు మార్కెట్ బంద్ చేస్తున్నట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి నారాయణమూర్తి తెలిపారు. ఈ మూడు రోజులు రైతులు మార్కెట్‌కు ఉల్లితో సహా ఎటువంటి వ్యవసాయ ఉత్పత్తులను తీసుకురావద్దని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. గురువారం నుంచి మార్కెట్ యథావిధిగా పనిచేస్తుందని తెలిపారు.
Advertisement
Advertisement