ప్రతి శనివారం పరిశ్రమలకు పవర్ హాలీడే | Holiday in the power industry, every Saturday | Sakshi
Sakshi News home page

ప్రతి శనివారం పరిశ్రమలకు పవర్ హాలీడే

Published Sun, Mar 2 2014 4:36 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM

Holiday in the power industry, every Saturday

శ్రీకాకుళం, న్యూస్‌లైన్: జిల్లాలోని పరిశ్రమలకు ప్రతి శనివారం పవర్‌హాలీడేను ప్రకటించారు. రాష్ట్రం లో విద్యుత్ ఉత్పాదన తగ్గడంతో వారంలో ఒక రోజును విద్యుత్ హాలీడేగా ప్రభుత్వం ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధన ఈ నెల 3 నుంచి అమలులోకి రానుంది. అలాగే, గృహావసరాలకు కూడా కోతలు పెంచాలని ఆదేశించినట్టు తెలిసింది. అధికారులు మాత్రం దీనిని అంగీకరించడం లేదు. ఉత్పాదన తగ్గినప్పుడల్లా కోతలు విధిస్తున్నామే తప్ప అధికారిక కోతలు లేవని చెబుతున్నారు. ఇటీవలే వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి తగ్గిందని ఈ కారణంగానే ప్రస్తుతం కోత విధిస్తున్నట్టు చెబుతున్నారు. ముందుముందు కోతలవాత తప్పదన్న భావన వ్యక్తమవుతోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement