ఆఫీస్‌కు రాకుండా ఇంట్లో హాయిగా నిద్రపోండి.. అంటూ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది ఓ కంపెనీ. తమ ఉద్యోగుల్లో వెల్నెస్ పద్ధతులను ప్రోత్సహించేందుకు బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ మార్చి 17న అంతర్జాతీయ నిద్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అధికారికంగా సెలవు ప్రకటించింది.
ఇదీ చదవండి: అదిరిపోయే ఫీచర్లున్న ఈ స్మార్ట్‌ఫోన్ల ధర రూ.15,000 లోపే..
వేక్‌ఫిట్ సొల్యూషన్స్ అనే డీ2సీ హోమ్ అండ్ స్లీప్ సొల్యూషన్స్ స్టార్టప్ కంపెనీ లింక్డ్‌ఇన్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. అది తమ ఉద్యోగులందరికీ పంపిన మెయిల్ స్క్రీన్‌షాట్. ‘సర్‌ప్రైజ్ హాలిడే: అనౌన్సింగ్ ది గిఫ్ట్ ఆఫ్ స్లీప్’ అనేది దాని ట్యాగ్‌లైన్.
ఇదీ చదవండి: నానో సోలార్ కార్! రూ.30కే 100 కిలోమీటర్లు..
గత సంవత్సరం కూడా ఈ కంపెనీ తమ ఉద్యోగులకు ‘రైట్ టు నాప్ పాలసీ’ని ప్రకటించింది. దీని ద్వారా ఉద్యోగులందరూ తమ పని వేళల్లో 30 నిమిషాల నిద్రపోవచ్చన్న మాట. శరీరాన్ని రీఛార్జ్ చేసి పనిపై దృష్టి కేంద్రీకరించడంలో మధ్యాహ్న నిద్ర ఉపకరిస్తుందని, తద్వారా ఉత్పాదకత పెరుగుతుందని ఆ కంపెనీ భావిస్తోంది. అంతేకాకుండా ఇతర కంపెనీలు కూడా ఇలాంటి ఆలోచన చేయాలని పిలుపునిచ్చింది.
ఇదీ చదవండి: కొత్త పన్ను విధానం ఏప్రిల్ 1 నుంచి... వీరికి ఒక్క రూపాయి కూడా పన్ను లేదు!
Comments
Please login to add a commentAdd a comment