World Sleep Day
-
ఆఫీస్‌కు రావద్దు.. ఇంట్లో హాయిగా నిద్రపోండి..
ఆఫీస్‌కు రాకుండా ఇంట్లో హాయిగా నిద్రపోండి.. అంటూ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది ఓ కంపెనీ. తమ ఉద్యోగుల్లో వెల్నెస్ పద్ధతులను ప్రోత్సహించేందుకు బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ మార్చి 17న అంతర్జాతీయ నిద్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అధికారికంగా సెలవు ప్రకటించింది. ఇదీ చదవండి: అదిరిపోయే ఫీచర్లున్న ఈ స్మార్ట్ఫోన్ల ధర రూ.15,000 లోపే.. వేక్‌ఫిట్ సొల్యూషన్స్ అనే డీ2సీ హోమ్ అండ్ స్లీప్ సొల్యూషన్స్ స్టార్టప్ కంపెనీ లింక్డ్ఇన్లో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. అది తమ ఉద్యోగులందరికీ పంపిన మెయిల్ స్క్రీన్‌షాట్. ‘సర్ప్రైజ్ హాలిడే: అనౌన్సింగ్ ది గిఫ్ట్ ఆఫ్ స్లీప్’ అనేది దాని ట్యాగ్‌లైన్. ఇదీ చదవండి: నానో సోలార్ కార్! రూ.30కే 100 కిలోమీటర్లు.. గత సంవత్సరం కూడా ఈ కంపెనీ తమ ఉద్యోగులకు ‘రైట్ టు నాప్ పాలసీ’ని ప్రకటించింది. దీని ద్వారా ఉద్యోగులందరూ తమ పని వేళల్లో 30 నిమిషాల నిద్రపోవచ్చన్న మాట. శరీరాన్ని రీఛార్జ్ చేసి పనిపై దృష్టి కేంద్రీకరించడంలో మధ్యాహ్న నిద్ర ఉపకరిస్తుందని, తద్వారా ఉత్పాదకత పెరుగుతుందని ఆ కంపెనీ భావిస్తోంది. అంతేకాకుండా ఇతర కంపెనీలు కూడా ఇలాంటి ఆలోచన చేయాలని పిలుపునిచ్చింది. ఇదీ చదవండి: కొత్త పన్ను విధానం ఏప్రిల్ 1 నుంచి... వీరికి ఒక్క రూపాయి కూడా పన్ను లేదు! -
World Sleep Day: నిద్ర పోతే అంతే!
-
నిద్ర లేకపోతే ఎంత డేంజరో తెలుసా? మీకు తెలియని షాకింగ్ విషయాలు
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): జో అచ్యుతానంద జోజో ముకుందా ! లాలి పరమానంద లాలి గోవిందా జోజో జో అచ్యుతానంద జోజో ముకుందా ! లాలి పరమానంద లాలి గోవిందా జోజో అనగానే పిల్లలు నిద్రలో జారుకునేవాళ్లు... ఇప్పడు ఏ జోల పాట పనిచేయడం లేదు. పిల్లల నుంచి పెద్దల వరకు నిద్ర సమస్యతో బాధపడుతున్నారు. పిల్లలు సైతం రాత్రి 11 గంటల వరకూ మేల్కొనే ఉంటున్నారు. స్కూల్లో హోంవర్కులు, టాస్క్‌లతో మేల్కోనే ఉంటున్నారు. ఇక యువత..పెద్దవాళ్లు సైతం నిద్రలేమితో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నారు. అందుకే వరల్డ్ స్లీప్ సొసైటీ హాయిగా పడుకోవాలని.. సకాలంలో నిద్రించాలని కోరుతోంది. చదవండి: Holy 2022: హోలీ మరకలు త్వరగా పోవాలంటే.. నిద్ర..మనిషికి..ఎంతో అవసరం..ప్రస్తుతం ఉరుకులు..పరుగుల మధ్య కనీసం కొద్దిసేపైనా నిద్రపోయే వారు చాలా తక్కువగా ఉంటున్నారు..ఒకప్పుడు రాత్రి 8 గంటలకు పడుకొని ఉదయం 6 గంటలకు మధ్య లేచేవాళ్లు. ఇప్పుడు అంతా ఉల్టా..పల్టా..ఉదయం 3–4 గంటలకు పడుకొంటున్నారు. ఉదయం 10-11 గంటలకు నిద్ర లేస్తున్నారు. మొబైల్, టీవీ చూడడం, వర్క్ చేయడమో..లాంటి ఇతరత్రా పనులు చేస్తూ రాత్రి పూట ఎక్కువ సేపు మెళకువతో ఉంటున్నారు. ఇలా ఉండటం వలన ఆరోగ్య సమస్యలు ఎద్కుకోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. సరిపడే నిద్రం చేయటం వలన కలిగే లాభాలు, నిద్రలేమి కారణంగా కలిగి నష్టాలను ప్రజలకు తెలియజేసేందుకు వరల్డ్ స్లీప్ సొసైటీ ఆధ్వర్యంలో ఏటా ప్రపంచ నిద్ర దినోత్సవాన్ని మార్చినెల మూడో శుక్రవారం నిర్వహిస్తున్నారు. నిద్ర లేని వారిలో... కంటినిండా నిద్ర ఉంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. రోజులో 24 గంటలు..అందులో సుమారు 7 నుంచి 8 గంటల పాట నిద్రకు కేటాయించాలని అంటుంటారు. 8 గంటల నిద్ర సరిగ్గా లేకపోతే..16 గంటల మెలకువ సమయం అంతా డిస్ట్రట్ అవుతుంది. రోజు వారీ పనులపై తీవ్ర ప్రభావం పడుతుంది. కానీ..చాలా మందికి కరెక్టు టైంకు నిద్ర రాదు..మారుతున్న జీవన విధానాలు...అలవాట్లు ప్రభావం చూపెడుతున్నాయి.. శరీర జీవ గడియారం దెబ్బతింటోంది. రాత్రి వేళ వర్క్ చేయటం పొద్దునే పడుకోవడం చేస్తున్నారు. నిద్ర సరిగ్గా లేకపోతే..మనిషి మెదడుపై తీవ్ర ప్రభావం చూపెడుతుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. రక్తప్రసరణ విషయంలో మార్పులు చోటు చేసుకుంటాయంటున్నారు. దీని ఫలితంగా..గుండెపోటు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. అంతేగాకుండా సరిగ్గా నిద్రపోని వారు బరువు పెరగడం ఊబకాయం వంటి సమస్యలు వస్తాయని వెల్లడిస్తున్నారు. నిద్ర లేకపోవడంతో ఒత్తిడి ఎక్కువ కావడం నిరాశలో మునిగిపోతుంటారని తెలిపారు.. అందువలన నిద్రకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నా వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని అంచనా. మంచి నిద్ర వల్లే కలిగే లాభాలు మంచి నిద్ర నిరాశ..ఒత్తిడి నుంచి దూరం చేస్తాయి. రోగ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. గుండెకు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పనిపై దృష్టి పెట్టడానికి దోహద పడుతుంది. అంతేగాకుండా జ్ఞాపకశక్తి మెరుగుపరచడంలో నిద్ర పాత్ర కీలకం. సరైన నిద్ర అనేద మనసుపై మొదడుపై కలిగే ఒత్తిడిని తగ్గించడమే కాకుండా..ఆరోగ్యానికి సహకరిస్తుంది..దీంతో రోజంతా ఉత్సాహంగా ఉంటారు. నిద్ర కోసం షెడ్యూల్ మంచి నిద్ర కోసం ఒక షెడ్యూల్‌ను రూపొందిందించుకోండి. ఫలానా టైంలో నిద్ర పోవాలని నిర్ణయం తీసుకోండి. నిద్ర పోయే ముందు టీవీ, సెల్ఫోన్లకు దూరంగా ఉండండి..బెడ్ రూం సరైన టెంపరేచర్లో ఉండే విధంగా చూసుకోవాలి. నిశ్శబ్దంగా..మనస్సు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. కెఫిన్, అల్కాహాల్ ఇతరత్రా వ్యసనాలకు దూరంగా ఉండాలి..నిద్ర సమస్యలు ఉంటే మాత్రం వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. ఒత్తిడితో నిద్ర సమస్యలు.. నిద్ర సమస్యకు ప్రాధాన కారణం ఒత్తిడి. మనిషి ఒత్తిడికి గురైనప్పుడు నిద్ర సమస్య ఎక్కువవుతోంది. ఈ ఒత్తిడి నుంచి దూరంగా ఉండేందుకు యోగా లాంటివి చేస్తుండాలి. నిద్రలు రెండు రకాలుగా చెప్పవచ్చు ఒకటి రాపిడ్ ఐ మూమెంట్, రెండోది నాన్ రాపిడ్ ఐ మూమెంట్. రాపిడ్ ఐ మూమెంట్ నిద్ర అనేది నిద్రలో మొదటి దశగా చెప్పవచ్చు. నాన్ రాపిడ్ ఐ మూమెంట్ అంటే మంచి నిద్రగా చెప్పవచ్చు. నాన్ రాపిడ్ ఐ మూమెంట్ నిద్ర ఎక్కువ సమయం చేస్తే వారు ఆరోగ్యంగా ఉండవచ్చు. అలాగే సాయంత్రం 4 గంటల తరువాత నిద్ర పోకూడదు. టీ, కాఫీలు వంటి వాటిని సేవించకూడదు. రాత్రి సమయంలో ఆహారం తక్కువగా తీసుకోవాలి. ప్రోటిన్లు ఎక్కువగా ఉండే పాలు, పండ్లు తీసుకుంటే మంచిది. ఒక రాత్రి నిద్ర లేకపోతే మద్యం సేవించిన వ్యక్తితో సమానం. అందుకే రోడ్డు ప్రమాదంలో ఎక్కువగా మద్యం సేవించటం లేదా నిద్ర లేకపోవటం వలనే జరుగుతాయి. మంచి నిద్ర చేసేందుకు రాత్రి సమయంలో వెలుతురు తక్కువగా ఉండే లైట్స్ వేసుకోవడం..మొబైల్స్‌కు దూరంగా ఉండటం..బెడ్ శుభ్రం ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. –డాక్టర్ పి.విజయ్ కుమార్, జనరల్ మెడిసిన్ నిద్రతో ఉత్సాహం.. రోజు 7 నుంచి 8 గంటల సమయం నిద్ర పోవడం వల్ల మిగిలిన సమయంలో ఎంతో ఉత్సాహంగా ఉండొచ్చు. ఎటువంటి చిరాకు, అలసట దరికి చేరవు. నిద్ర లేకపోతే ప్రతి చిన్న విషయానికి కూడా ఎదుటి వారిపై చిరాకు పడడం, ఒత్తిడికి గురవడం జరుగుతుంది. –రమ్య, ఉద్యోగిని సమయానికి నిద్రపోవాలి రాత్రి త్వరగా నిద్రపోవడం వల్ల ఉదయం పని చేసేటప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఒక్క రోజు నిద్ర సరిగ్గా లేకపోతే మరుసటి రోజు పని మొత్తం ఏదో గందరగోళంగా ఉన్నట్టు ఉంటుంది. పనిపై ధ్యాస ఉండాలంటే మంచి నిద్ర ఎంతో అవసరం. రాత్రి సమయంలో అవసరం మేరకు మాత్రమే మొబైల్స్‌ను ఉపయోగించాలి. –సాయి మీర, ఉద్యోగిని -
నేడు వరల్డ్ స్లీప్ డే.. ఈ 10 చిట్కాలు తెలుసుకోండి
ప్రపంచ నిద్ర దినోత్సవం మార్చి 19 నిర్వహిస్తారు. 14 వ వార్షిక ప్రపంచ నిద్ర దినోత్సవం యొక్క నినాదం ’రెగ్యులర్ స్లీప్, హెల్తీ ఫ్యూచర్.’ స్థిరమైన నిద్రవేళలు పెరుగుదల సమయాలు యువ, మధ్య వయస్కులలో మంచి నిద్ర నాణ్యతతో సంబంధం కలిగి ఉంటాయి. అలాగే పెద్దవారిలో కూడా రెగ్యులర్ స్లీపర్లకు మంచి మానసిక స్థితి, సైకోమోటర్ పనితీరు మరియు విద్యావిషయక సాధన ఉంటుంది. జ్ఞాపకశక్తి ఏకీకరణ, నియంత్రణ, హార్మోన్ల నియంత్రణ, హృదయ నియంత్రణ మరియు అనేక ఇతర ముఖ్యమైన విధులు వంటి అనేక శారీరక వ్యవస్థలతో నిద్ర ఉంటుంది అని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. అందువల్ల తగినంత నిద్ర వ్యవధి మరియు నిద్ర నాణ్యత చాలా ముఖ్యమైన ప్రతికూల ఆరోగ్య ఫలితాలతో సంబంధం కలిగి ఉంటుంది. తగినంత నిద్ర లేకపోవడం వల్ల పనితీరులో బలహీనతలకు కారణమవుతుందని తేలింది. పేలవమైన నిద్ర మానసిక ఆరోగ్యంతో ముడిపడి ఉంది. ఒత్తిడితో, నిద్రలేమి వస్తుంది. వాస్తవానికి, ఇటీవలి నివేదిక ప్రకారం, యాంటిడిప్రెసెంట్, యాంటీయాంగ్జైటీ, నిద్రలేమి నిరోధక మందుల వాడకం 2020 ఫిబ్రవరి మరియు డిసెంబర్ మధ్య 21 శాతం పెరిగింది. కోవిడ్19 మహమ్మారి ప్రారంభం దశ నుండి ఎక్కువ కొత్త నిద్ర సవాళ్లను ఎదుర్కొంటున్నారని 70% మంది నివేదించారు, 43% మంది రాత్రి సమయంలో మేల్కొలపడం ఒక సవాలు అని చెప్పారు. మహమ్మారి ప్రతికూల ప్రభావం చూపుతుందని 37% మంది అంటున్నారు. నిద్రలేమి అనేది ఒక రుగ్మత. తగిన అవకాశం, సమయం ఉన్నప్పటికీ, నిద్రపోలేకపోవడం వంటి పదేపదే ఇబ్బంది కలిగి ఉంటుంది. దీర్ఘకాలిక నిద్రలేమి ఊబకాయం, డయాబెటిస్, హృదయ సంబంధ వ్యాధులు, రక్తపోటు, ఆందోళన, నిరాశకు గురయ్యే ప్రమాదాలకు దారితీస్తుంది. తరచుగా నిద్రించడానికి ఇబ్బంది పడుతున్న వ్యక్తులు సాధారణంగా పగటి పనితీరు బలహీనంగా ఉన్నట్లు ఫిర్యాదు చేస్తారు. శ్వాస వ్యాయామాలు, ధ్యానం, సంపూర్ణత ,నిద్ర యొక్క స్వీయ నిర్వహణపై దృష్టి సారించే ఇతర అభ్యాసాలు మన జీవితాలను మరింత సుసంపన్నం చేయడానికి అవకాశాలను అందిస్తాయి. మంచి ఆరోగ్యకరమైన నిద్రకు 10 చిట్కాలు. 1. నిద్రపోవడానికి, నిద్రలేవడానికి ఒక సమయాన్ని కేటాయించండి. 2. మీరు ఎన్ఎపి తీసుకునే అలవాటు ఉంటే, పగటి నిద్ర 45 నిమిషాలకు మించకూడదు. 3. నిద్రవేళకు 4 గంటల ముందు అధికంగా మద్యం తీసుకోవడం మానుకోండి.. ధూమపానం చేయవద్దు. 4. నిద్రవేళకు 6 గంటల ముందు కెఫిన్ మానుకోండి. 5. నిద్రవేళకు 4 గంటల ముందు ఎక్కువగా, కారంగా లేదా చక్కెర కలిగిన ఆహారాన్నితీసుకోవద్దు. నిద్రపోవడానికి ముందు తేలికపాటి చిరుతిండి తీసుకోవడం ఆమోదయోగ్యమైనది. 6. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి, కాని నిద్రపోయే ముందు చేయడం మంచిది కాదు. 7. సౌకర్యవంతమైన పరుపులను వాడండి. 8. నిద్రించడానికి సౌకర్యవంతమైన ఉష్ణోగ్రత అమరికను కనుగొని గదిని సరైన వెంటిలేషన్ గా ఉంచండి. 9. నిద్రపోయే ముందు శబ్ధాలకు దూరంగా ఉండండి. 10. బెడ్ రూంలో సాధ్యమైనంత ఎక్కువ కాంతి ఉంకుండా చూడండి. - డాక్టర్ వివి రమణ ప్రసాద్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ కిమ్స్, సికింద్రాబాద్ -
నిదుర పోరా తమ్ముడా...!
సాక్షి, హైదరాబాద్ : నిద్ర... మనిషి జీవితంలో అత్యంత ప్రాముఖ్యతున్న అంశం. చుట్టూ ఏదో జరిగిపోతోంది. జీవితంలో ఏదో సాధించాలి..అమ్మో.. టైమ్ చాలా తక్కువగా ఉందని భావించే వారూ ఎక్కువ మందే ఉన్నారు. దీని కారణంగానే వారు నిద్రాకాలాన్ని తగ్గించుకుంటున్నట్టు ఓ పరిశోధనలో వెల్లడైంది. అయితే దీనిని దీర్ఘకాలిక ప్రాతిపదికన విశ్లేషిస్తే ఆరోగ్య, శక్తి సామర్థ్యాలపరంగా నష్టం వాటిల్లుతుందని పరిశోధకులు అంటున్నారు. వరల్డ్ స్లీప్ కమిటీ ఏటా మార్చి 16ను ‘వరల్డ్ స్లీప్ డే’గా నిర్వహిస్తోంది. నిద్రను ఒక పండుగలా నిర్వహించేందుకు ఈ రోజు ఉపయోగపడుతుందని, నిద్రతో ముడిపడిన ఆరోగ్యం, మందులు, విద్య లాంటి సామాజిక అంశాలను చర్చించడానికి దోహదపడుతుందని ఆ కమిటీ పేర్కొంది. నిద్రలో నడిచేవారు 15 శాతం ఉంటారని, నిద్రలో వచ్చిన కలలు 50 శాతం మెలకువతోనే మరిచిపోతామని మరో అధ్యయనంలో వెల్లడైంది. అరవై శాతానికి పైగా భారతీయులు నిద్రను ప్రాధాన్యతా అంశంగా పరిగణించడం లేదని, కొంతమంది ఆరోగ్యంగా ఉండేందుకు నిద్ర కంటే కూడా శారీరక వ్యాయామమే ముఖ్యమనే అభిప్రాయంతో ఉన్నట్టు ఓ సర్వేలో తేలింది. మెరుగైన ఆరోగ్యానికి మంచి నిద్ర కూడా అవసరమే అన్న విషయం చాలా మందికి అవగాహన లేదని ఫిలిప్స్ ఇండియా నిర్వహించిన తాజా సర్వే తేల్చింది. భారత్‌తో సహా అమెరికా, బ్రిటన్, జర్మనీ, పోలాండ్, ఫ్రాన్స్, చైనా, ఆస్ట్రేలియా, కొలంబియా, అర్జెంటీనా, మెక్సికో, బ్రెజిల్, జపాన్లలోని 15 వేల మందిపై నిర్వహించిన ఈ సర్వేలో అనేక ఆసక్తికరమైన విషయాలున్నాయి. టెక్నాలజీతో నిద్రాభంగంమన దేశం విషయానికొస్తే,... సుఖమయమైన నిద్ర కోసం 45 శాతం వయోజనులు ధ్యానం (మెడిటేషన్) చేస్తున్నారు. నిద్ర నుంచి దృష్టి మళ్లేందుకు, నిద్రించే సమయం తగ్గిపోయేందుకు టెక్నాలజీ ప్రధాన ప్రతిబంధకంగా మారిందని 32 శాతం అభిప్రాయపడ్డారు. రోజూ సవ్యంగా నిద్రపోయేందుకు ‘ప్రత్యేక బెడ్డింగ్’ఏర్పాట్లు చేసుకున్నట్టు 24 శాతం మంది వెల్లడించారు. పనివేళల కారణంగా సాధారణ నిద్రా సమయం ప్రభావితం అవుతోందని 19 శాతం మంది పేర్కొన్నారు. అందరూ అనుకుంటున్న దాని కంటే అపసవ్యమైన నిద్రే మరింత తీవ్రమైన సమస్య అని ఫిలిప్స్ సంస్థ స్లీప్, రెస్పిరేటరీ హెడ్ హరీశ్ చెబుతున్నారు. దీని ప్రభావం గుండె సంబంధిత వ్యాధులతో పాటు డయాబెటీస్‌పై తీవ్రంగా ఉంటుందన్నారు. గురకతో కూడిన నిద్రను భారతీయులు సంతృప్తికరమైనదిగా భావిస్తుంటారని, అయితే ఇది ఎన్నో తీవ్రమైన సమస్యలకు మూలమని గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. ఎదురయ్యే సమస్యలు సరైన నిద్ర లేకపోతే బరువు పెరగడంతో పాటు కుంగుబాటు వంటి మానసిక సమస్యలకు దారితీస్తుంది. నిద్రలేమితో గుండెజబ్బులు వచ్చే అవకాశాలెక్కువ. నిద్రను బలవంతంగా ఆపుకోవడం వల్ల బ్లడ్షుగర్పై ప్రభావం చూపించడంతో పాటు ఇన్సులిన్ సున్నితత్వాన్ని తగ్గిస్తుంది. తక్కువ నిద్ర భావోద్వేగంపై, సామాజిక కలివిడిపై ప్రభావం చూపుతుంది. సానుకూలాంశాలు. మంచినిద్ర ఆరోగ్యంతో పాటు ఆకలిని పెంచుతుంది. ఉత్పాదకత పెరిగేందుకు, మరింత ఏకాగ్రతను సాధించేందుకు ఉపయోగపడుతుంది. మంచి నిద్రతో క్రీడాకారులు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. రోగనిరోధక శక్తిని పెంపొదిస్తుంది, దీర్ఘకాలిక రోగాలతో ముడిపడిన సమస్యలు తగ్గే అవకాశం. జ్ఞాపకశక్తితో పాటు సృజనాత్మకతను పెంచుకునేందుకు సహకరిస్తుంది. -
లాలీ... లాలీ... లాలీ... లాలీ...
పసిపిల్లలకు ఆకలి తీరితే చాలు, అమ్మ పాడే లాలి పాటలకు వారు తేలికగానే ఆదమరచి నిద్రలోకి జారుకుంటారు. వయసు పెరిగే కొద్దీ సవాలక్ష సమస్యలు మొదలవుతాయి. కొన్ని సమస్యలు కంటికి కునుకు పట్టనివ్వనంతగా పట్టి పీడిస్తాయి. నిద్రా ప్రాధాన్యాన్ని ప్రాచీనులు వేల ఏళ్ల కిందటే గుర్తించారు. ఆధునిక పరిశోధకులు ఏకంగా నిద్రాశాస్త్రాన్నే (సోమ్నాలజీ) అభివృద్ధి చేశారు. విచిత్రమేమిటంటే శాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందినా, ప్రపంచంలో ప్రశాంతమైన నిద్రకు దూరమవుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రాణుల అతిముఖ్యమైన కనీసావసరాల్లో ఒకటైన నిద్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు ‘వరల్డ్ స్లీప్ డే’ సందర్భంగా... నిద్ర సుఖమెరుగదని అంటారు. నిజమే. నిద్ర ముంచుకొచ్చినప్పుడు ఎవరూ హంసతూలికా తల్పాల కోసం వెదుకులాడరు. నవారు మంచమైనా సరే, అదీ లేకుంటే చెట్టు నీడైనా సరే... నడుం వాల్చడానికి కాస్త చోటుంటే చాలు... నిమిషాల్లోనే నిద్రలోకి జారుకుంటారు. కష్టించి పనిచేసిన మనుషులు కడుపు నిండా తిన్న తర్వాత ఆదమరచి నిద్రపోతారు. చీకూ చింతా లేకుండా జీవించే వాళ్లకు అత్యంత సహజంగా నిద్రపడుతుంది. భయాందోళనలు, దిగులు, గుబులు, ఈర్ష్య, పగ, ద్వేషం వంటి ప్రతికూల భావనలేవీ మనసులో లేనివారికి నిద్రాదేవత త్వరగా కరుణిస్తుంది. ప్రతికూల భావనలు మనసును అతలాకుతలం చేస్తున్నప్పుడు హంసతూలికా తల్పాలు, ఏసీ గదులు వంటి సౌకర్యాలు ఎన్ని ఉన్నా, ప్రశాంతమైన నిద్ర గగన కుసుమమే అవుతుంది. ‘కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది’ అని ‘మనసుకవి’ ఏనాడో సెలవిచ్చారు. కునుకు పడితే మనసు కుదుటపడటం ఎంత వాస్తవమో, మనసు కుదురుగా ఉన్నప్పుడే కంటినిండా నిద్ర పడుతుందనేది కూడా అంతే వాస్తవం. కొందరు అదృష్టవంతులు సందడి సందడిగా జరిగే సభా సమావేశాల్లో సైతం కుర్చీలో కూర్చున్న స్థితిలోనే కునుకు తీయగలరు. ఇంకొందరు దురదృష్టవంతులు సకల సౌకర్యాలూ అందుబాటులో ఉన్నా, నిద్ర పట్టక గింజుకుంటారు. నిద్రాపురాణం అష్టాదశ భారతీయ పురాణాల్లో నిద్రాపురాణం అంటూ ఏదీ లేదు గానీ, భారతీయ పురాణాలు కొన్నింటిలో నిద్రాదేవత ప్రస్తావన కనిపిస్తుంది. ప్రాచీన గ్రీకులకు, రోమన్లకు నిద్రా దేవుళ్లున్నారు. గ్రీకుల నిద్రా దేవుడు హిప్నోస్. రోమన్ల నిద్రాదేవుడు సోమ్నస్. మన భారతీయుల నిద్రాదేవతకు విగ్రహాలు, ఆలయాలు ఉన్న దాఖలాలేవీ లేవు గానీ గ్రీకులు, రోమన్ల నిద్రా దేవుళ్లకు విగ్రహాలు కూడా ఉన్నాయి. రోమన్లకు కలల దేవుడు ‘మార్ఫియస్’ ఉంటే, గ్రీకులకు పగటి కలలకు, పీడకలలకు వేర్వేరు దేవుళ్లున్నారు. వారి పగటి కలల దేవుడు ‘ఫాంటసోస్’, పీడకలల దేవుడు ‘ఫోబెటర్’. ఇంగ్లిష్‌లో పగటి కలలకు ‘ఫాంటసీ’ లనే పేరు, మిథ్యాభయాలకు ‘ఫోబియా’లనే పేరు ఈ దేవుళ్ల వల్ల వచ్చినవే. గ్రీకు, రోమన్ పురాణాల ప్రకారం వారికి రాత్రికి, చీకటికి కూడా దేవతలు, దేవుళ్లు ఉన్నారు. నిద్రాలయాలు... తొలినాటి ఆస్పత్రులు వివిధ ప్రాచీన నాగరికతలలో మానవులు నిద్రా ప్రాధాన్యాన్ని గుర్తించారు. ప్రాచీన ఈజిప్షియన్లు దాదాపు నాలుగువేల ఏళ్ల కిందటే నిద్రాలయాలను (స్లీప్ టెంపుల్స్) నిర్మించారు. వీటినే స్వప్నాలయాలు (డ్రీమ్ టెంపుల్స్) అని కూడా అంటారు. వీటిని చరిత్రలో తొలినాటి ఆస్పత్రులుగా చెప్పుకోవచ్చు. నిద్రకు సంబంధించిన రుగ్మతలతో బాధపడేవారికి, వివిధ శారీరక సమస్యల కారణంగా నిద్రలేమితో బాధపడే వారికి ఈ నిద్రాలయాల్లో రకరకాల చికిత్స చేసేవారు. నిద్రలేమితో బాధపడేవారికి ఔషధంగా నల్లమందు ఇచ్చేవారు. ధ్యానం, రకరకాల స్నానాలు, ఉపవాసాలు చేయించేవారు. వీటికి తోడు దేవతలు శాంతిస్తారనే నమ్మకంతో జంతుబలులు చేయించేవారు. పీడకలలు పీడిస్తున్న వారికి రకరకాల విరుగుడు పూజలు చేయించేవారు. ఈజిప్షియన్ల తర్వాత ప్రాచీన గ్రీకులు, రోమన్లు, పశ్చిమాసియా ప్రాంతాల వారు కూడా ఇలాంటి నిద్రాలయాలను నిర్మించారు. కునుకు పట్టనివ్వని ఒత్తిళ్లు ఆధునిక ప్రపంచం ఒకవైపు వివిధ రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధిస్తున్నా, మరోవైపు అంతకు మించిన ఒత్తిళ్లు ఆధునిక మానవులను కుంగదీస్తున్నాయి. మితిమీరిన ఒత్తిళ్లు కంటికి కునుకు పట్టనివ్వకుండా సతమతం చేస్తున్నాయి. ప్రపంచ జనాభాలో దాదాపు 20 శాతం మంది నిద్రలేమితో బాధపడుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వ్యక్తిగత జీవితంలోని ఈతిబాధలు, పనివేళల్లో తరచు మార్పులు, ఉద్యోగ సమస్యలు, మితిమీరిన పనిభారం, భవిష్యత్తుపై భయాందోళనలు వంటి సమస్యలతో చాలామంది ప్రశాంతంగా నిద్రపట్టక సతమతమవుతున్నారు. నిద్రలేమితో బాధపడేవారిలో చాలామంది నిద్రమాత్రలను ఆశ్రయిస్తున్నారు. ఇంకొందరు మద్యం, ఇతర మాదకద్రవ్యాలకు బానిసలుగా మారుతున్నారు. అంతర్జాతీయ సర్వేల ప్రకారం నిద్రలేమితో బాధపడేవారిలో పురుషులతో పోలిస్తే మహిళల సంఖ్య రెట్టింపుగా ఉంటోంది. అయితే, ఉద్యోగాలు చేస్తున్న వారిలో పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా నిద్రలేమి సమస్య దాదాపు ఒకేలా ఉంటోంది. ఉద్యోగ ఒత్తిళ్ల కారణంగా దాదాపు 56 శాతం మంది నిద్రలేమితో సతమతమవుతున్నారు. ఆధునిక కాలంలో చదువుల ఒత్తిడి కారణంగా చిన్నారులు సైతం తగినంత నిద్ర పొందలేకపోతున్నారు. చిన్నారుల్లో దాదాపు 30 శాతం మందికి తగినంత నిద్ర ఉండటం లేదు. ఇక వివిధ ఆరోగ్య సమస్యలు, వాటి నివారణ కోసం వాడే మందుల ప్రభావం వల్ల వృద్ధుల్లో దాదాపు 60 శాతం మంది నిద్రలేమికి గురవుతున్నారు. మానసిక కుంగుబాటుతో బాధపడేవారిలో సుమారు 90 శాతం మంది నిద్రలేమితో సతమతమవుతున్నారు. ఎంత నిద్ర కావాలి? నిద్రలేమితో బాధపడుతున్న వారి గణాంకాలు భయపెట్టేలా ఉంటున్నాయి కదా ఇంతకీ ఎంత నిద్ర కావాలంటారా? వయసును బట్టి నిద్ర పరిమాణం మారుతూ ఉంటుంది. పసిపిల్లలకు ఎక్కువసేపు నిద్ర అవసరమవుతుంది. ఎదిగే కొద్దీ నిద్రపోవాల్సిన సమయం తగ్గుతూ వస్తుంది. నిద్రపోవాల్సిన కనీస సమయం కంటే బాగా తక్కువగా నిద్రపోయినా, అంతకు మించి బాగా ఎక్కువగా నిద్రపోయినా నిద్రకు సంబంధించిన రుగ్మతలతో బాధపడుతున్నట్లే భావించాలి. ఏయే వయసుల్లో ఎంత నిద్ర అవసరం అంటే... వయసు నిద్రా సమయం 0–1 సంవత్సరం 14–17 గంటలు 1 సంవత్సరం 12–14 గంటలు 2 సంవత్సరాలు 11–14 గంటలు 3–5 సంవత్సరాలు 10–13 గంటలు 6–13 సంవత్సరాలు 9–11 గంటలు 14–17 సంవత్సరాలు 8–10 గంటలు 18 సంవత్సరాలు నిండాక 7–9 గంటలు అతినిద్ర... అదో సమస్య రామాయణంలో రావణాసురుడి సోదరుడు కుంభకర్ణుడు, లక్ష్మణుడి భార్య ఊర్మిళ అతినిద్రకు బ్రాండ్ అంబాసిడర్లుగా కనిపిస్తారు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువే పాలకడలిలో శేషశయ్య మీద యుగాల తరబడి యోగనిద్రలో సేదదీరినట్లుగా కూడా పురాణ వర్ణనలు ఉన్నాయి. విదేశీ సాహిత్యంలో కూడా అతినిద్రలో కుంభకర్ణుడిని, ఊర్మిళను తలపించే పాత్రలు కనిపిస్తాయి. అమెరికన్ రచయిత వాషింగ్టన్ ఇర్వింగ్ రాసిన ‘రిప్ వాన్ వింకిల్’ కథలో రిప్ వాన్ వింకిల్ అనే భార్యాబాధితుడు ఇంటిపోరు తట్టుకోలేక అడవి బాట పడతాడు. దట్టమైన అడవిలో ఒక చెట్టు కింద కూలబడి నిద్రలోకి జారుకుంటాడు. అలా ఏకంగా ఇరవయ్యేళ్లు నిద్రలోనే గడిపేస్తాడు. అతడికి మెలకువ వచ్చేసరికి దేశంలోని పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోయి ఉంటాయి. ఇక ఫ్రెంచ్ రచయిత చార్లెస్ పెరాల్ట్ రాసిన జానపద కథలో కనిపించే స్లీపింగ్ బ్యూటీ రామాయణంలో ఊర్మిళను తలపించే పాత్ర. అందులో దుష్టశక్తి శాపానికి గురైన రాకుమారి ఏకంగా వందేళ్లు నిద్రలోనే గడిపేస్తుంది. నిద్రలేమి మాదిరిగానే అతినిద్ర కూడా ఆరోగ్య సమస్యే. అతినిద్రతో బాధపడేవారు పురాణ పాత్రలు, జానపద గాథల్లోని పాత్రల్లా ఏళ్ల తరబడి నిద్రలో గడిపేయకున్నా, రోజులో అధికభాగం నిద్రలోనే గడిపేస్తూ ఉంటారు. రకరకాల శారీరక, మానసిక పరిస్థితుల ఫలితంగా కొందరు అతినిద్రతో ఇబ్బంది పడుతూ ఉంటారు. నిద్ర... కొన్ని నిజానిజాలు... సంపూర్ణమైన ఆరోగ్యం కోసం సమతుల ఆహారం, శారీరక వ్యాయామంతో పాటు తగినంత నిద్ర కూడా అత్యవసరం. తిండి కరువైన వారి కంటే నిద్ర కరువైన వారు త్వరగా మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నిద్రను ఉద్దేశపూర్వకంగా వాయిదా వేసే శక్తి ప్రాణికోటిలో మనుషులకు మాత్రమే ఉంది. పశుపక్ష్యాదులు అలా కాదు. వాటికి ఎప్పుడు ఎక్కడ నిద్ర వచ్చినా వెంటనే నిద్రలోకి జారుకుంటాయి. గాఢనిద్రలోకి జారుకునే ముందు దశను ‘ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ (ఆర్ఈఎమ్) స్లీప్’ అంటారు. ఆ స్థితిలో కళ్లు మూసుకున్నా, కనుగుడ్లు కదులుతూ ఉంటాయి. అలాంటి సమయంలోనే కలలు వస్తాయి. అయితే, దాదాపు 12 శాతం మందికి బ్లాక్ అండ్ వైట్‌లోనే కలలు వస్తాయట.’ మనం కనే కలలన్నీ మనకు గుర్తుంటాయనే గ్యారంటీ లేదు. నిద్ర నుంచి మేలుకున్న ఐదు నిమిషాల్లోనే సగానికి సగం కలలు మన స్మృతిపథం నుంచి చెరిగిపోతాయి. నిద్రలేమితో బాధపడేవారు స్థూలకాయులుగా మారే అవకాశాలు ఎక్కువ. నిద్ర కరువైన వారికి శరీరంలో ఆకలిని నియంత్రించే ‘లెప్టిన్’ హార్మోన్ పరిమాణం తగ్గిపోతుంది. ఫలితంగా ఆకలి పెరిగి అవసరానికి మించి తినేస్తారు. క్రమంగా లావెక్కిపోతారు. సాధారణంగా ఆరోగ్య సమస్యలేవీ లేనివారు నిద్రకు ఉపక్రమించి పడుకున్న తర్వాత 10 నుంచి 15 నిమిషాల్లోగా నిద్రలోకి జారుకుంటారు. నిద్ర పట్టడానికి అంతకు మించిన సమయం పడితే నిద్రకు సంబంధించిన రుగ్మతలతో బాధపడుతున్నట్లే లెక్క. తరచుగా మారే షిఫ్టుల్లో పనిచేసేవారు ఎక్కువగా నిద్రకు సంబంధించిన రుగ్మతలకు గురవుతారు. నిద్రకు విఘాతం కలిగే ఉద్యోగాలు చేసేవారు ఎక్కువగా గుండెజబ్బులు, ఇతర దీర్ఘవ్యాధులకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. జీవితంలో వెంటాడే భయాలు ఉన్నప్పుడు నిద్రలో కొందరికి పీడకలలు వస్తుండటం సహజమే. అయితే, అరుదుగా కొందరు నిద్రపోవాలంటేనే భయపడతారు. ఇదొక మానసిక వ్యాధి. నిద్ర అంటేనే భయపడే ఈ మానసిక వ్యాధిని ‘సోమ్నిఫోబియా’ అంటారు. జాగారంలో రికార్డు శివరాత్రికి జాగారం ఉండటం మనదేశంలో చాలామంది పాటించే ఆచారం. రోజు రోజంతా ఉపవాసం చేసి, నిద్రపోకుండా పూజా పునస్కారాల్లో మునిగి తేలుతారు. విదేశాల్లో అలాంటి ఆచారమేదీ లేకున్నా, 1964లో ఒక పదిహేడేళ్ల అమెరికన్ కుర్రాడు జాగారంలో గిన్నిస్ రికార్డు సాధించాడు. కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతానికి చెందిన రాండీ గార్డెనర్ అనే ఆ కుర్రాడు నిద్ర పోకుండా ఏకంగా 11 రోజుల 24 నిమిషాలు (264.4 గంటలు) గడిపాడు. -
గుర్ ర్ర్ ర్ ర్ర్...
♦ 8-10 శాతం మందిని వేధిస్తున్న గురక సమస్య ♦ గ్రేటర్లో 30 శాతం మందిలో నిద్రలేమి ♦ నేడు వరల్డ్ స్లీప్ డే సాక్షి, సిటీబ్యూరో: ఇంటర్నెట్... ఫేస్బుక్... వాట్సాప్... టెలివిజన్... ఇవన్నీ సిటీజనులకు ఆనందాన్ని ఇవ్వడమే కాదు... కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పరోక్షంగా ఆరోగ్యంపై దాడి చేస్తున్నాయి. రాత్రి తొమ్మిది గంటలకే పడక పైకి చేరాల్సిన నగర వాసులు అర్థరాత్రి దాటిన తర్వాత కూడా మేలుకునేఉంటున్నారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో గ్రేటర్ జనాభాలో 30 శాతం మంది నిద్రలేమి సమస్యతో బాధ పడుతున్నారు. వీరిలో 8-10 శాతం మంది అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నీయాతో బాధ పడుతున్నట్లు ఎయిమ్స్, స్టార్ ఈఎన్టీ వైద్యుల సర్వేలో వెల్లడైంది. ఢిల్లీలో 16-18 శాతం ... బెంగళూరులో 15.5... చెన్నైలో 15... హైదరాబాద్‌లో 8 నుంచి 10 శాతం మంది (గురక, నిద్రలో శ్వాస సరిగా తీసుకోలేకపోవ డం) అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నీయాతో బాధ పడుతున్నట్లు తేలింది. నిద్రకు ఉపక్రమించిన తర్వాత 4 నుంచి 6 సార్లు మాత్రమే మేల్కొనాలి. కానీ చాలా మంది ఇలా నిద్రపోగానే అలా లేచి కూర్చుంటున్నారు. బలవ ంతంగా శ్వాస తీసుకునే ప్రయత్నం చేసినా ఊపిరితిత్తులు, మెదడు, గుండెకు చేరడం లేదు. పరోక్షంగా ఇది గుండె పోటుకు కారణమవుతోంది. రాత్రి రెండు నుంచి తెల్లవారుజామున ఐదు గంటల మధ్యలో వెలుగు చూస్తున్న మరణాల్లో 60 శాతానికి పైగా అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నీయానే కారణమని నిపుణుల అభిప్రాయం. పని ఒత్తిడి... మానసిక ఆం దోళనలతో అర్థరాత్రి దాటినా రెప్ప వాల్చడం లేదు. ఐటీ అనుబంధ రం గాల్లో పని చే స్తున్న వారు విదేశాలకు అనుగుణంగా తమ పనివేళలను మార్చుకుంటున్నారు. వీకెండ్ పార్టీలు కూడా ప్రబావం చూపుతున్నాయి. ఏ వయసు వారు ఎన్ని గంటలు నిద్రపోవాలంటే... రోజుల వయసున్న శిశువులు 18 గంటలు ఏడాది లోపు చిన్నారులు 14-18 గంటలు ఏడాది నుంచి మూడేళ్లలోపు చిన్నారులు 12-15 గంటలు మూడు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులు 11-13 గంటలు ఐదు నుంచి 12 ఏళ్లలోపు పిల్లలు 9-11 గంటలు 12 నుంచి 19 ఏళ్లలోపు వారు 9-10 గంటలు 21 సంవత్సరాలు పైబడిన వారు 7-8 గంటలు 50 ఏళ్లు పైబడిన వారు 5-7 గంటలు యువతలోనే ఎక్కువ ప్రతి పది మందిలో ముగ్గురు నిద్రలేమితో బాధ పడుతున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది 35 ఏళ్ల లోపు వారే. రాత్రి నిద్రపోకపోవడం వల్ల మానసిక, శారీరక ఎదుగుదలకు సంబంధించిన హార్మోన్స్ తగ్గడంతో పాటు సెక్సువల్ హార్మోన్స్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రతి చిన్న విషయానికీ కోపం, చిరాకు పడతారు. అంతేకాదు.. అధిక రక్తపోటు, గుండెపోటు, మధుమేహం బారిన పడే ప్రమాదం ఉంది. -డాక్టర్ శ్రీనివాస్ కిషోర్, ఈఎన్టీ నిపుణుడు, స్టార్ ఆస్పత్రి -
కునుకమ్మా సిటీ చేరవే..
‘ఆకలి రుచెరుగదు.. నిద్ర సుఖమెరగదు’ సామెత పాతదే అయినా.. నిత్య అన్వయమే. నిద్రాదేవి ఆవహిస్తున్న వేళ.. పరుపులు అక్కర్లేదు. కటిక నేలైనా.. రాతి పలకైనా.. హంసతూలికా తల్పమే. ఇంత చోటు దొరికిందంటే చాలు మహారాజులా నిద్రపోయే శ్రమజీవులెంతో మంది. కానీ నగరానికే నిద్రపట్టడం లేదు. సాఫ్ట్వేర్ జాబ్స్, లేట్‌నైట్ షిఫ్ట్స్, హైఫై నైట్ లైఫ్.. సిటీకి కునుకు లేకుండా చేస్తున్నాయి. ‘మునిమాపు వేళాయె కనుపాప నినుకోరే... కునుకమ్మ ఇటు చేరవే’ అంటూ కునుకుపాటలు పాడుతున్న నగరం పాట్లు ‘వరల్డ్ స్లీప్ డే’ సందర్భంగా.. - కట్ట కవిత మంచి జీతం.. మంచి జీవితం నగరవాసికి నిద్రపట్టనివ్వడం లేదు. కాసుల వేటలో పడ్డ సిటీవాసులు నిద్రమాట మరుస్తున్నారు. సాఫ్ట్వేర్ బూమ్, హెఫై లైఫ్ వెరసి సిటీ కునుకును కొండెక్కేలా చేశాయి. ఇప్పుడు నగరం.. ప్రతి రోజూ 24 గంటలూ మేల్కొనే ఉంటోంది. నగరవాసి కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, సెల్‌ఫోన్స్‌కు కళ్లప్పగించి.. గుడ్లగూబలా నిద్ర కాస్తున్నాడు. టెకీలు వృత్తిరీత్యా మెలకువతో ఉంటే.. సిటీ యూత్ సోషల్ మీడియా పుణ్యాన నిద్రకు దూరమవుతోంది. స్లీప్‌లెస్ డిసీజెస్.. జీవగడియారానికి అడ్జెస్ట్ కాని క్లాక్‌ను ఫాలో అవుతూ సూర్యాస్తమయం తర్వాత కృత్రిమ వెలుగులో ఎక్కువ సేపు గడపడం, వేళాపాళా లేకుండా భోజనం చేయడం వంటివి చేస్తున్నారు. ఫలితం సిటీజెన్స్ డయాబెటిస్, ఒబెసిటీ, హైపర్ టెన్షన్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ఇన్సోమ్నియా, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అష్నియా సిండ్రోమ్, సర్కాడియన్ రిథమ్ స్లీప్ డిజార్డర్వంటి నిద్ర సంబంధిత జబ్బులకు గురవుతున్నారు. నిద్రలేమితో ప్రతి నెలా 300 మందికిపైగా నగరంలోని 35 హాస్పిటల్స్‌కి క్యూ కడుతున్నారు. వీరిలో ఎక్కువ శాతం ఐటీ, కార్పొరేట్ సెక్టార్స్‌లో పని చేస్తున్నవారే. రాత్రిపూట కృత్రిమ లైట్స్ వెలుగులో దీర్ఘకాలికంగా పనిచేయడం వల్ల కంటి చూపు సమస్యలు, వెన్నునొప్పి కూడా వస్తాయంటున్నారు డాక్టర్లు. నవ్వు నాలుగు విధాలా మంచిది. మంచి నిద్ర.. నాలుగు వందల విధాలా శ్రేష్టం. రోజుకు 16 గంటలు ఏదో వ్యాపకంతో ఉండే దేహానికి ఓ ఎనిమిది గంటలు మంచి నిద్రనిస్తే.. కుదరకపోతే ఆరు గంటలైనా సరే..! మళ్లీ నూతనోత్తేజం పొందడం ఖాయం. ఎలాంటి వ్యాధులూ మీ దరిదాపులకు కూడా రావు. సో స్లీప్ వెల్! ప్రమాదకరం.. ప్రతి పది మందిలో ముగ్గురు నిద్రలేమితో బాధపడుతున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది 35 ఏళ్ల లోపువారే. నిద్రలేమి వల్ల మానసిక, శారీరక సమస్యలేర్పడతాయి. సెక్సువల్ హార్మోన్స్పైనా ప్రభావం పడుతుంది. రక్తపోటు, గుండెపోటు, మధుమేహం.. వంటి జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంది. రోజుకు వందమంది రోగులు వస్తే వారిలో 20 శాతం మంది నిద్రలేమి బాధితులే. - డాక్టర్ శశికిరణ్, జనరల్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్ -
గుడ్ స్లీప్.. స్వీట్ డ్రీమ్స్
నిద్ర కరువై నలిగిపోతున్న నగరవాసి మానసిక ఒత్తిళ్లతో సతమతం ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం కెరీర్లోనూ వెనకడుగు నేడు వరల్డ్ స్లీప్ డే పొద్దుట్నుంచీ కంప్యూటర్‌కు అతుక్కుపోయిన కళ్లు రాత్రయినా మూతపడనంటున్నాయ్.. రేపటి మీటింగ్లూ, ప్లాన్లతో వేడెక్కిపోయిన మెదడు ఆలోచనల చట్రం నుంచి బయటకు రానంటోంది.. ఏసీలూ, కుషన్ సీట్ల పుణ్యాన అలసట రుచి ఎరుగని శరీరం విశ్రాంతికి సిద్ధమవ్వడం లేదు.. వెరసి... నగరవాసికి కునుకు ప్రియమవుతోంది. ఆరోగ్యంగా జీవించడానికి అవసరమైన 8 గంటల నిద్ర అనేది అందని ద్రాక్షే అవుతోంది. అన్ని సౌకర్యాలు ఉండి కూడా కాసింత నిద్రకు నోచుకోని కోటీశ్వరులు, ఉన్నతోద్యోగులు నగరంలో చాలామంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. నిద్ర కోసం మందే మందు అనుకునే మందుబాబులు, నిద్రమాత్రలు, మత్తు ఇంజెక్షన్లతో నిద్రకు దగ్గర కావాలని ఆరాటపడేవారు కోకొల్లలు. అందుకే బ్యాంక్ బాలెన్సులున్న కుబేరుల కన్నా కంటి నిండా నిద్రపోగలిగిన పేదవాడే అధిక సంపన్నుడని అంటుంటారు. -విశాఖ-కల్చరల్ ‘నిద్ర సుఖమెరుగదు’ అన్నారు పెద్దలు. ‘అసలు సుఖనిద్ర అనేదే మేమెరుగం’ అంటున్నారు ఆధునికులు. రోజువారీ లక్ష్యాల మధ్య సరైన నిద్ర కోసం అల్లాడుతున్న నగరవాసులు... ‘నిదురమ్మా... నువ్వెక్కడమ్మా..!’ అంటూ అన్వేషిస్తున్నారు. నిద్రాభంగానికి గురవుతున్న వారిలో వారు వీరని తేడా లేదు. సాఫ్ట్వేర్ ఉద్యోగుల నుంచి శాస్త్రవేత్తల దాకా, డిజైనర్ల నుంచి డిస్ట్రిబ్యూటర్ల వరకు ప్రతి ఒక్కరిదీ ఇదే పరిస్థితి. దీనికి కారణాలను నిపుణులు ఇలా విశ్లేషిస్తున్నారు... ప్రతి రంగంలోనూ పోటీ తీవ్రమవుతుండడం, విజయాలు సాధించాలనే తపన, తరచుగా లక్ష్యాలను పెంచుకుంటూ పోవడం... ఇలాంటి కారణాల వల్ల మెదడు సామర్థ్యానికి మించి పనిచేయాల్సి రావడం... వ్యక్తిని మానసికంగా తీవ్రమైన అశాంతికి గురిచేస్తున్నాయి. పొద్దస్తమానం అలజడికి అలవాటుపడిన మనసు మంచం ఎక్కగానే ఒక్కసారిగా మత్తులోకి జారిపోవడం కష్టం. మరోవైపు సమయానికి నిద్ర రాకపోతే రేపు లేవడం ఆలస్యమవుతుందని, పనులు సరిగా చేయలేమేమోననే ఆందోళన మరింతగా కునుకును దూరం చేస్తోంది. అలాగే శరీరానికి అవసరమైన కనీస శ్రమ లేకపోవడం, చెమట పట్టే పనులు చేయకపోవడం వల్ల రక్తప్రసరణ సమస్యలు ఏర్పడడం, విశ్రాంతి పొందాలనేంత పరిస్థితిని శరీరానికి కల్పించకపోవడం, టీవీలు, కంప్యూటర్లకు గంటల తరబడి కళ్లను అప్పగించడం... ఇవన్నీ మంచి నిద్రను దూరం చేసే కారణాలే. రోడ్డు ప్రమాదాల్లో కీలక పాత్ర 380 రోడ్డు ప్రమాదాలను కేస్‌గా తీసుకుని ఇటీవల ఎయిమ్స్ ఓ స్టడీని నిర్వహించింది. వీటికి కారణమైన కమర్షియల్ డ్రైవర్స్‌కు నిద్ర వేళలు సరిగా లేవని గుర్తించారు. వీరిలో 60 శాతం మంది అంతకు ముందురోజు రాత్రి సరిగా నిద్రపోలేదని తేలింది. ఆరోగ్య నిద్రకు ఇవిగో మార్గాలు సాధారణంగా ప్రతి మనిషికి ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం. ఇది నిరంతరాయంగా ఈ నిద్ర నిరంతరాయంగా ఉండాలి. పగలు కాస్సేపు రాత్రి కాస్సేపు పడుకుని ఆరుగంటలు పడుకున్నాం కదా అని భావించకూడదు. కొందరు అంతరాయంగా నిద్రపోతుంటారు. తరచూ లేస్తుంటారు. కొందరు ఆలస్యంగా పడుకుని ఆలస్యంగా లేస్తుంటారు. కొందరు వేకువజామున మరీ తొందరగా లేస్తుంటారు. ఏమైనప్పటికీ నిద్రను నిర్దిష్టసమయంలో బయోలాజికల్ క్లాక్లా అలవాటు చేసుకోవాలి. నిద్ర లేమి వల్ల మానసిక సమతుల్యత దెబ్బతింటుంది. నిత్యజీవనంపై దీనిప్రభావం కనిపిస్తుంది. మానసిక శారీకర రుగ్మతలకు హేతవు అవుతుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మేలు నిద్ర పట్టకుండా చేసే కాఫీ..టీలు పరిహరించాలి మసాలాతో కూడిన ఆహారం రాత్రి పూట భుజించ కూడదు. తేలికపాటి ఆహారం ఉత్తమం పడుకునే ముందు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి నిద్ర సమయంలో మెదడుకు పెద్దగా పనిచెప్పకూడదు. టీవీలు చూడటం లాంటివి మంచివి కాదు. సాయంత్రం కాస్సేపు నడిస్తే ప్రశాంతంగా నిద్రపడుతుంది. పడక గది కూడా మన అభిరుచికి అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. నిద్రమాత్రలకు దూరంగా ఉంటే మంచిది. -డాక్టర్ ఎన్.ఎన్.రాజు మానసిక వైద్య నిపుణుడు సర్వేలు ఏం చెబుతున్నాయి... తాజాగా ఏసీ నీల్సన్-ఫిలిప్స్ సంస్థలు విశాఖపట్నం, హైదరాబాద్‌తోసహా 25 నగరాలలో సర్వే నిర్వహించాయి. 35 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కుల్లో నిర్వహించిన దీని ఫలితాల ప్రకారం... నగరాల్లో 93 శాతం మంది 8 గంటల నిద్రకు నోచుకోవడం లేదు. విచిత్రమేమిటంటే వీరిలో 2 శాతం మంది మాత్రమే తమ నిద్రలేమి గురించి వైద్యులతో ప్రస్తావిస్తున్నారు. దీనివల్ల 15 శాతం మంది ఏకాగ్రత లోపానికి గురవుతుంటే... 62 శాతం మంది అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా... అనే (నిద్ర కరవైతే వచ్చే అనారోగ్యం) సమస్య బారిన పడతున్నారు. నిద్ర సరిగా లేక తమ పని పాడవుతోందని వీరిలో 58 శాతం మంది అంటున్నారు. ఇక 11 శాతం మంది పనిచేసే సమయంలో నిద్ర కమ్మేస్తోందని అంటున్నారు. నిద్రపోయే సమయంలో 1 నుంచి 3 సార్లు మెలకువ వస్తోందని 72 శాతం మంది చెప్పడం ద్వారా తమది కలత నిద్ర అని చెప్పకనే చెప్పారు. నిద్ర కోసం టూర్‌కు వెళుతున్నా.. బీచ్ రోడ్డులోని మా కేఫ్ ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకూ ఉంటుంది. ఆ తర్వాత ఆ రోజు అకౌంట్స్, రేపటి ప్రిపరేషన్ వగైరా పనులన్నీ పూర్తి చేసుకుని మద్దలపాలెంలోని మా ఇంటికి చేరటప్పటికి ఒంటిగంట అయిపోతుంది. ఆ తర్వాత మంచం ఎక్కి నిద్రకు ఉపక్రమించేటప్పటికి మరో అరగంట, నిద్రలోకి వెళ్లేటప్పటికి మరో అరగంట... మొత్తం మీద సగ టున రోజూ అర్ధరాత్రి దాటి 2 గంటలైతే గానీ నిద్రలోకి వెళ్లం. తిరిగి పొద్దున్నే 7 గంటలకు లేవకపోతే ఈ ట్రాఫిక్‌లో అనుకున్న సమయానికి రెస్టారెంట్‌కు చేరుకోలేం. మొత్తం మీద రోజూ 5 గంటలు నిద్రపోతే బాగా నిద్రపోయినట్టే. ఆదివారాలు కూడా సెలవుండదు కాబట్టి వారమంతా ఇదే పరిస్థితి. అందుకే ఒళ్లెరగని నిద్ర కోసం నెలకో, రెణ్నెల్లకో బ్రేక్ తీసుకుని ఏదో ఒక ప్రయాణం పెట్టుకుంటున్నా. - కె.సురేష్ కుమార్, కేఫ్ యజమాని నిద్ర‘యోగ’ం యోగాతో ప్రశాంతంగా నిద్రపోవచ్చు. రోజూ ఉదయం నిర్దేశిత సమయంలో సూర్యనమస్కారాలు చేయాల్సి ఉంటుంది. ఇది క్రమం తప్పకుండా చేయాలి. దీనివల్ల నరాలన్నీ చేతనమవుతాయి. ఫలితంగా శరీర వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. ఇది నిద్రకు ఎంతో ఉపకరిస్తుంది. అలాగే భ్రమరీ ప్రాణాయామం కూడా చేయాలి. ఈ శ్వాసప్రక్రియ చాలా ప్రభావవంతమైంది. ఇది కూడా సుఖ నిద్రకు సహకరిస్తుంది. ఇక ధ్యానం వల్ల ఒనగూరే ప్రయోజనం చాలా ఎక్కువ. యోగాలో ప్రతి ప్రక్రియా శరీరాన్ని క్రమపద్ధతిలో ఉంచేదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇన్సోమ్నియాతో బాధపడేవారికి యోగా ప్రక్రియ ఇతోధికంగా ఉపయోగపడుతుంది. ఆధునిక వ్యవస్థలో నిద్రలేమితో వచ్చేవే సగం రోగాలు. దీనికి యోగాసనాలు మంచి చిట్కా -పెనుమర్తి ప్రశాంతి, యోగా కౌన్సిలర్, విశాఖపట్నం మంచి నిద్రతో ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు అందానికి, ఆరోగ్యానికి, నిద్రకు ప్రత్యక్ష సంబంధం ఉంది. తగినంత నిద్ర లేకపోతే దాని ప్రభావం శరీరారోగ్యంపై పడుతుంది. నిద్రలో అనేక శరీర కణాలు రిపేరు జరుగుతాయి. కొత్త కణాలు తయారవుతాయి. కొత్త కణాలు కొత్త అందాన్నిస్తాయి. మెమరీ పవర్: నిద్ర సమయంలో మెదడు విశ్రాంతి పొందడం వల్ల మెమరీ పవర్ పెరుగుతుంది. ఏదైనా ఒక మంచి పని చేయాలనుకున్నా, నేర్చుకోవాలనుకొన్నా మంచిగా నిద్రపోయి లేవడం వల్ల కొత్త ఐడియాలతో చురుకుగా పని చేయగలగుతాం. సృజనాత్మకత: మంచి నిద్ర పొందడం వల్ల మెదడు పునఃవ్యవస్థీకరణ, వాటిని పునరుద్ధరించుకునేందుకు అలాగే మరింత సృజనాత్మకత కారణం కావచ్చు. కళాకారులకు మాత్రమే కాదు పనిచేసే ప్రతి ఒక్కరికీ సృజనాత్మకత పెరుగుతుంది. కొత్త కొత్త ఐడియాలను పొంది వారిలో దాగున్న క్రియేటివటీ బయటకు తీస్తారు.నిద్ర లేనివారిలో కొన్ని హార్మోన్లు రక్తంలో కలసి, ఆకలిని పెంచుతాయి. సరైన నిద్రలేనప్పుడు ఆకలి పెరగడం వల్ల బరువు తగ్గే చాన్సే ఉండదు. నిద్ర చాలా అవసరం. డిప్రెషన్: సరైన నిద్ర లేకపోవడం వల్ల మన ఓవరాల్ హెల్త్‌కు అవరోధం కలుగుతుంది. నిద్ర లేమితో వెనుకబడి నిరాశ నిస్పృహలకు లోనవుతారు. మంచి నిద్రను పొందడం వల్ల వ్యక్తి మూడ్ మారుతుంది. ఆందోళన తగ్గుతుంది. భావోద్వేగాలను తగ్గించుకుంటారు. మధుమేహం: నిద్రలేమి టైప్2 డయాబెటిస్‌కు దారితీస్తుంది. రక్తంలోని ఇన్సులిన్ స్థాయి తగ్గి హార్మోన్లపై ప్రభావం చూపుతుంది. హెయిర్ ఫాల్: నిద్రలేమితో వివిధ ఆలోచనలు మదిలో మెదిలి మెద డు మీద ఒత్తిడి కలిగి హార్మోన్ల లోపంతో జుత్తు రాలిపోతుంది. హృద్రోగం : సరైన నిద్రలేకపోవడం వల్ల హృదయ వ్యవస్థ మందగిస్తుంది. రక్తనాళాలు, ధమనుల రక్తం సరిగా ప్రసవరణ జరగక గుండె సంబంధిత వ్యాధులు రావడానికి కారణమవుతాయి. కృత్రిమ సాధనాలు వద్దు: నిద్రకు కృత్రిమమైన సాధనాలు ఉపయోగిస్తే మరికొన్ని కొత్త సమస్యలు తోడవుతాయి.