
సాక్షి, హైదరాబాద్: నగరంలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచే వాతావరణం పలు మార్పులతో ఉండటంతో రాత్రి సమయంలో భారీగా వర్షం పడింది. గణతంత్ర దినోత్సవం, సెలవుదినం కావడంతో ప్రజలకు పెద్దగా ఇబ్బందేమీ కలగలేదు. నగరంలో పలు ప్రాంతాల్లో సాయంత్ర నుంచే వర్షం మొదలైంది. దీంతో ప్రజలు అప్రమత్తమై రాత్రి వేళ బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వర్షంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మధ్యాహ్నం నుంచే నగరం మేఘావృతమై ఉండి వాతావరణం మారటంలో భారీ వర్షం సంభవించింది.
Comments
Please login to add a commentAdd a comment