అమెరికాలో ఐటీ సర్వ్ అలయెన్స్ నార్త్ ఈస్ట్ చాప్టర్ వార్షిక ఫ్యామిలీ హాలిడే పార్టీ నిర్వహించింది. నార్త్ ఈస్ట్ చాప్టర్ అధ్యక్షుడు కళ్యాణ్ విజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఈవెంట్‌లో 400 మందికి పైగా కంపెనీ సీఈవో(CEO)లు పాల్గొన్నారు. కుటుంబంతో కలిసి హాజరైన పలువురు ప్రవాసులు ఈ పార్టీలో పాల్గొని సందడి చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సింగర్స్ తమ గాత్రంతో మైమరిపించారు.
ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా ఎంతో ఘనంగా హాలీడే పార్టీని నిర్వహించారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల కమ్యూనికేషన్ మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ఈ పార్టీలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతిఒక్కరికి కళ్యాణ్ విజయ్ ధన్యవాదాలు తెలిపారు.
కాగా ఐటీ సర్వ్ అలయెన్స్ అనేది ఐటీ రంగానికి చెందిన 1400 కంపెనీలతో ఏర్పడిన ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అమెరికాలోని 22 రాష్ట్రాలలో ఉన్న 19 చాప్టర్లలో ఈ సంస్థ ఐటీ సేవలను అందిస్తోంది. ఈ సంస్థలో ఉన్న ఐటీ కంపెనీల మొత్తం ఆదాయం 10 బిలియన్ డాలర్లు. లక్ష మంది ఐటీ నిపుణులు ఈ సంస్థల్లో పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment