చిత్తూరు: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు రేపు(మంగళవారం) సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా డీఈవో సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన విలేకరులకు తెలిపారు.