సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో వర్షాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) శాంతికుమారి శనివారం(ఆగస్టు31) సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు, వరదలపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. వర్షాలు ఎక్కువగా కురిసే జిల్లాల అధికారులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ప్రతీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్కూళ్లకు సెలవులు ఇచ్చే విషయంలో ఆయా జిల్లాల్లో పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలని కోరారు. డ్యాములు, చెరువులు, కుంటల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్ద వరద తీవ్రతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కోరారు. జిల్లాల్లో వర్షం పరిస్థితిని ఎప్పటికప్పుడు సచివాలయానికి అప్డేట్ చేయాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment