కురుస్తున్న తరగతి గది గోడలు.. తడవకుండా గొడుగులు పట్టి పాఠాలు వింటున్న విద్యార్థులు..
ఇదీ మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుశ్నపల్లి జిల్లా పరిషత్
ఉన్నత పాఠశాలలో చదువులు ‘నీరు’గారుతున్న తీరు.
ఈ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 55 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఐదు తరగతులకు మూడే గదులు ఉన్నాయి. మూడింటిలో రెండు గదుల పైకప్పు పగుళ్లు తేలి వర్షానికి కురుస్తున్నాయి. మరో రెండు తరగతుల విద్యార్థులను వరండాలోనూ, డైనింగ్ హాల్‌లోనూ కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తూ నెట్టుకొస్తున్నారు. ఇటీవల భారీ వర్షాలు కురుస్తుండడంతో పన్నెండేళ్ల క్రితం నిర్మించిన తరగతి గదుల స్లాబ్ పైకప్పు పగుళ్లు తేలి కురుస్తోంది. గోడలకు పగుళ్లు ఏర్పడి.. తరగతి గదుల్లోకి నీరు చేరుతోంది. గదిలోకి చేరుతోన్న నీటితో పుస్తకాలు..
పై స్లాబ్ నుంచి కురుస్తున్న నీటితో తామూ తడవకుండా గొడుగులు పట్టుకొని పాఠాలు వింటున్నామని 8వ తరగతి విద్యార్థులు చెబుతున్నారు. ‘మన ఊరు–మన బడి’ కార్యక్రమంలో భాగంగా మరమ్మతులు చేసినా, గదులు కురుస్తూనే ఉన్నాయని, వర్షాలకు రూ.6 లక్షల విలువైన డిజిటల్ టీవీ తడిసి పాడైపోయిందని ఉపాధ్యాయులు తెలిపారు. దీనిపై ఎంఈఓ మహేశ్వర్‌రెడ్డిని సంప్రదించగా..ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మరమ్మతులకు ప్రతిపాదనలు పంపిస్తామని చెప్పారు.
..:: నెన్నెల
Comments
Please login to add a commentAdd a comment