కుటుంబ సభ్యులను కాల్చి... ఆత్మహత్య | Army jawan kills wife, 2 children before committing suicide | Sakshi
Sakshi News home page

కుటుంబ సభ్యులను కాల్చి... ఆత్మహత్య

Published Thu, Mar 6 2014 9:57 AM | Last Updated on Sat, Sep 2 2017 4:25 AM

Army jawan kills wife, 2 children before committing suicide

ఉత్తరప్రదేశ్ ఫైజాబాద్లోని అయోధ్య కొట్వాలీ పోలీస్స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఆర్మీ జవాను రమేష్ సింగ్ (40) తన భార్య, ఇద్దరు పిల్లలను తుపాకితో కాల్చి హత్య చేశాడు. అనంతరం రమేష్ సింగ్ తనకుతాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కథనం ప్రకారం... ఛండీగఢ్ ఆర్మీ యూనిట్లో పని చేస్తున్న రమేష్ సింగ్ సెలవుపై ఫైజాబాద్ వచ్చాడు. ఇంటివచ్చిన అతడు ఎంత కొట్టిన తలుపు తీయకపోవడంతో ఆగ్రహించిన గోడ దూకి ఇంట్లోకి వెళ్లాడు.

 

అనంతరం భార్య కుసుమ్ (26)తో అతడు గొడవపడ్డాడు. ఆ క్రమంలో రమేష్ ఆగ్రహంతో ఊగిపోతు భార్యను తుపాకితో కాల్చాడు. అనంతరం ఇద్దరు చిన్నారులు రియా (7), శేషు (5)లను కాల్చి చంపాడు. అనంతరం తనకు తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. తుపాకీ శబ్దం వినపడటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న రమేష్ సింగ్తోపాటు అతని కుటుంబ సభ్యుల మృతదేహలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement