committing suicide
-
బాలిక ప్రాణం కాపాడిన ఫేస్బుక్
గువహటి : అమెరికాలోని ఫేస్బుక్ కార్యాలయం నుంచి వచ్చిన అలర్ట్‌తో అసోం పోలీసులు ఓ బాలిక ప్రాణాలు కాపాడగలిగారు. 'ఈ రోజు నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను' అని ఓ బాలిక ఫేస్ బుక్ స్టేటస్‌లో పోస్ట్ పెట్టింది. దీన్ని గమనించిన ఫేస్బుక్ హెడ్ క్వార్టర్స్‌లోని సిబ్బంది వెంటనే అసోం పోలీసులకు సమాచారం అందించారు. 'ఈ రోజు నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను' అని బాలిక ఫేస్బుక్ స్టేటస్‌లో పోస్ట్ పెట్టిందని .. ఫేస్బుక్ హెడ్ క్వార్టర్స్ నుంచి సమాచారం రావడంతో అసోం పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. కేవలం 30 నిమిషాల్లోనే బాలిక లొకేషన్‌ను కనుగొని, ఆత్మహత్య చేసుకోకుండా కాపాడగలిగారు. బాలికతో పాటూ ఆమె కుటుంబ సభ్యులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రస్తుతం కుటుంబసభ్యుల పర్యవేక్షణలో బాలిక క్షేమంగా ఉందని అసోం పోలీసులు తెలిపారు. ఫేస్ బుక్ ఇచ్చిన సమాచారంతో ఓ బాలిక ప్రాణాలను కాపాడగలగడం ఎంతో సంతోషంగా ఉందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. పోలీసుల సలహాతో బాలిక ఫేస్బుక్లో పెట్టిన పోస్టును డెలీట్ చేసింది. ఫేస్బుక్ నుంచి నోడల్ ఆఫీసర్‌కు అలర్ట్ రావడంతో ఆ అధికారి సోషల్‌మీడియా సెంటర్‌ను అప్రమత్తం చేశాడు. ఆ తర్వాత వెనువెంటనే బాలిక లొకేషన్‌ను ఫీల్డ్ అధికారులకు పంపడంతో వారు బాలిక ఉన్న ప్రదేశాన్ని గుర్తించి ఆమెను ఆత్మహత్య చేసుకోకుండా కాపాడారు. సోషల్ మీడియా సెంటర్‌ను ప్రత్యేకంగా ప్రారంభించడం వల్లే ఈ విజయం సాధించగలిగామని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) ఆఫ్ అసోం హర్మిత్ సింగ్ తెలిపారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ కారణంగా గతనెలలో పిల్లల్నిఎత్తుకుపోయేవాళ్లనే ఉద్దేశంతో ఇద్దరు వ్యక్తులను అసోంలోని కర్బిఅంగ్‌లాంగ్ జిల్లాలో దారుణంగా కొట్టి చంపారు. దీంతో అక్కడి పోలీసు యంత్రాంగం సోషల్ మీడియాపై నిఘా కోసం ప్రత్యేకంగా సోషల్ మీడియా సెంటర్‌ను ప్రారంభించారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తల నియంత్రణకు 'థింక్' అనే ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం మంచి ఫలితాలనిస్తుందని, సామాన్యులు కూడా పోలీసులను సులభంగా సంప్రదించే అవకాశం లభించిందని హర్మిత్ సింగ్ తెలిపారు. Info was received from Facebook last night that a minor girl had updated her status as- 'I am gonna to commit suicide today'. The child was located in 30 mins & her safety ensured. She & her family were counselled. She is safe and in their care. @CMOfficeAssam @IPS_Association pic.twitter.com/w4u3XxZY0a — Assam Police (@assam_police) July 24, 2018 -
ఈ 'పిల్'తో ఆ ఆలోచన రానేరాదట!
నిరాశ, నిస్పృహలో కుంగిపోయిన చాలామందిని 'ఆత్మహత్య' ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. సమస్యలు, నిస్సహాత, మానసిక బలహీనతలే చాలామందిని బలవన్మరణాలకు ప్రోత్సహిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఏడురోజుల్లోనే ఆత్మహత్యకు పురికొల్పే ఆలోచనలకు పుల్ స్టాఫ్ పెట్టే సరికొత్త ఔషధ మాత్రను తాజాగా శాస్త్రవేత్తలు కనిపెట్టారు. వారంలోపే ఈ మాత్ర ప్రభావం చూపి మనుష్యులను బలన్మరణం ముప్పు నుంచి తప్పిస్తుందని వారు తెలిపారు. మెదడులో ఉత్పత్తి అయ్యే 'ఫీల్ గుడ్ రసాయనం' 'ఒపియాయిడ్'తో రూపొందిన ఈ ఔషధం వల్ల ఏడురోజుల్లోనే మనుష్యుల్లో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు గణనీయంగా ఆగిపోయాయని ప్రాథమిక పరీక్షల్లో తేలింది. ఈ పరీక్షల్లో భాగంగా తమ జీవితాన్ని చాలించాలనుకుంటూ ప్రమాదకర స్థితిలో 40 మంది వ్యక్తులకు 'ఒపియాయిడ్'ను తక్కువ మోతాదులో ఏడురోజులపాటు ఇచ్చారు. దీంతో వారిలో ఈ ఆలోచనలు 50శాతం తగ్గి.. సానుకూల దృక్పథం మెరుగుపడింది. ఈ మేరకు అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీలో శాస్త్రవేత్తలు పరీక్షలు నిర్వహించారు. 'ఒపియాయిడ్'ను సాధారణంగా నొప్పి తగ్గించేందుకు 'పెయిన్ కిల్లర్'గా వైద్యులు ఉపయోగిస్తారు. బుప్రీనార్ఫైన్గా పిలిచే దీనిని వేసుకోవడం వల్ల కేవలం వారంరోజుల్లోనే ఆత్మహత్య ఆలోచనలు తిరుగుముఖం పట్టాయని న్యూసైంటిస్ట్ పత్రిక తెలిపింది. మరిన్ని పరీక్షల్లో కూడా ఈ మాత్ర విజయవంతమైతే త్వరలోనే ఆత్మహత్యలను నిరోధించేందుకు వేగంగా పనిచేసే ఔషధం మార్కెట్లోకి వచ్చినట్టేనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆత్మహత్య ఆలోచనలతో సతమతమవుతున్న వ్యక్తులపై ప్రస్తుతం అనుసరిస్తున్న సంప్రదాయ విధానాలైన కౌన్సెలింగ్, కుంగుబాటు నిరోధక చికిత్సల ప్రభావం దాదాపు ఆరునెలలకుకానీ ఉండటం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఔషధ మాత్ర మార్కెట్లోకి వస్తే గణనీయమైన ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. -
కుటుంబ సభ్యులను కాల్చి... ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్ ఫైజాబాద్‌లోని అయోధ్య కొట్వాలీ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఆర్మీ జవాను రమేష్ సింగ్ (40) తన భార్య, ఇద్దరు పిల్లలను తుపాకితో కాల్చి హత్య చేశాడు. అనంతరం రమేష్ సింగ్ తనకుతాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కథనం ప్రకారం... ఛండీగఢ్ ఆర్మీ యూనిట్లో పని చేస్తున్న రమేష్ సింగ్ సెలవుపై ఫైజాబాద్ వచ్చాడు. ఇంటివచ్చిన అతడు ఎంత కొట్టిన తలుపు తీయకపోవడంతో ఆగ్రహించిన గోడ దూకి ఇంట్లోకి వెళ్లాడు. అనంతరం భార్య కుసుమ్ (26)తో అతడు గొడవపడ్డాడు. ఆ క్రమంలో రమేష్ ఆగ్రహంతో ఊగిపోతు భార్యను తుపాకితో కాల్చాడు. అనంతరం ఇద్దరు చిన్నారులు రియా (7), శేషు (5)లను కాల్చి చంపాడు. అనంతరం తనకు తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. తుపాకీ శబ్దం వినపడటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న రమేష్ సింగ్‌తోపాటు అతని కుటుంబ సభ్యుల మృతదేహలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.