సాక్షి, హైదరాబాద్: బీజేపీ సభ్యుల ప్రవర్తనే వారి సస్పెన్షన్‌కు కారణమని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. గవర్నర్, బడ్జెట్ ప్రసంగాల సందర్భంగా వెల్‌లోకి వచ్చే సభ్యులను సస్పెండ్ చేయాలని గతంలోనే నిర్ణయించామన్నారు. సభ నుంచి బీజేపీ సభ్యులను సస్పెండ్ చేయడం తమకు ఇష్టం లేకున్నా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో సమావేశాలు పూర్తయ్యేంత వరకు సస్పెండ్ చేయాల్సి వచ్చిందన్నారు.
సమావేశాలు ముగియడంతో మంగళవారం అసెంబ్లీ కమిటీహాల్‌లో మీడియాతో మంత్రి మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గతంలో విపక్ష సభ్యులను సమావేశాలకు హాజరు కాకుండా సస్పెండ్ చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. కేంద్రం నిర్ణయాలకు అసెంబ్లీలో సమాధానాలు చెప్పలేకే బీజేపీ ఎమ్మెల్యేలు కావాలనే సస్పెండ్ అయ్యేలా ప్రవర్తించారన్నారు. శాసన వ్యవస్థలో కోర్టులు జోక్యం చేసుకోవని, చట్ట సభల విచక్షణను కోర్టులు ప్రశ్నించలేవని తెలిసినా వారు కోర్టుకెళ్లి అభాసుపాలయ్యారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment