వేముల ప్రశాంత్‌రెడ్డి (ఫైల్)
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ శాసన సభలో ఆదివారం నాడు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నట్లు శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం శాసన సభ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. బీఏసీ సమావేశం జరిగిందని, అందులో భట్టివిక్రమార్క, ఎంఐఎం ఎమ్మెల్యేలు పాల్గొన్నారని చెప్పారు. శనివారం గవర్నర్ తమిళిసై ప్రసంగంపై అసెంబ్లీలో చర్చ ఉంటుందని తెలిపారు. సోమవారం, మంగళవారం హోలీ సందర్భంగా సెలవు ఉంటుదన్నారు. 13,14,16,17,18,19తేదీల్లో పద్దులపై అసెంబ్లీలో చర్చ జరుగుతుందన్నారు. 20వ తేదీ ముఖ్యమంత్రి కేసీఆర్ రీప్లే ఉంటుందని తెలిపారు.
‘అక్బరుద్దీన్, భట్టి విక్రమార్క షార్ట్ డిస్కర్షన్ పెట్టాలని కోరారు. సీఎం కేసీఆర్ దానికి సానుకూలంగా స్పందించారు. షార్ట్ డిస్కర్షన్‌లు వచ్చిన సంఖ్యను బట్టి 20వ తేదీ తరువాత మరొక సారి బీఏసీ ఉంటుంది. దాని తరువాత ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలనేది చెబుతాం. మండలిలో 13,14వ తేదీల్లో షార్ట్ డిస్కర్షన్ ఉంటుంది. 15వ తేదీ సెలవు. శాసన సభలో 12 రోజులు, మండలిలో 8 రోజులు సమావేశాలు ఉంటాయి. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌పై అసెంబ్లీలో చర్చ చేసిన తరువాత వాటికి వ్యతిరేకంగా బిల్ పాస్ చేస్తామ’ని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment