
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి కావాల్సిన అవసరముందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంతరెడ్డి అన్నారు. ఇన్నాళ్లూ దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీలు ఎలాంటి మార్పు తీసుకురానందున.. దేశానికి కేసీఆర్ వంటి నాయ కుడి అవసరం ఉందన్నారు. గవర్నర్ నరసింహన్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఆదివారం ఆయన శాసన సభలో మాట్లాడుతూ.. ‘దేశంలో గుణాత్మక మార్పు తీసుకొచ్చేందుకే సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు పూనుకున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగానే ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి దేశం విస్మయం చెందుతోంది. ప్రధాని మోదీతోపాటు సీఎంలు నవీన్ పట్నాయక్, మమతా బెన ర్జీలు మన పథకాలపై ఆసక్తి కనబరుస్తు న్నారు. జాతీయ మీడియా కూడా కేసీఆర్ మోడల్‌పై దృష్టిసారించింది’ అని అన్నా రు. కేసీఆర్ నాయకత్వాన్ని అన్ని రాష్ట్రాల సీఎంలు అనుసరించాల్సిన పరిస్థితి తలె త్తిందన్నారు. ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా కేసీఆర్ కృషి చేశారన్నారు. సంపద సృష్టించి, దాన్ని పేదలకు, రైతులకు పంచ డమే కేసీఆర్ లక్ష్యమన్నారు. ఎవరెన్ని తిట్టినా, విపక్షా లన్నీ జతకూడినా, ఏపీ సీఎం చంద్రబాబు నీచరాజకీయాలు చేసినా.. టీఆర్‌ఎస్‌కు ప్రజలు 88 సీట్లు కట్టబెట్టారని తెలిపారు. వచ్చే ఏప్రిల్ నాటికి మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా నీళ్లు వస్తాయన్నారు.
అందుకే మళ్లీ పట్టం: మండలిలో పల్లా
రాష్ట్రంలో నాలుగున్న రేళ్లలో సంక్షేమం, అభి వృద్ధి జోడెడ్ల పాలనగా సాగింది కాబట్టే.. కేసీఆర్‌కు ప్రజలు మరో సారి పట్టంగట్టారని టీఆర్‌ఎస్ ఎమ్మె ల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. మండ లిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని పల్లా ప్రారంభించారు. ఆర్థిక క్రమశిక్షణతోపాటు అవినీతి రహిత పాలన కారణంగానే 88 సీట్లతో ప్రభంజనం సృష్టించామన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి ముందున్న పరిస్థితులు, సమస్యలను అధిగమించి రాష్ట్రాన్ని సంక్షేమబాటలో నిలిపేందుకు కేసీఆర్ చేసిన కృషిని దేశం ప్రశంసించిందని పల్లా చెప్పారు. కరెం ట్ సంక్షోభం నుంచి గట్టెక్కి మిగులు విద్యుత్‌ను సాధించడం ఒక అద్భుతమైన విజయ గాథని ఆయన అన్నారు. కాగా, ఇరిగేషన్ ప్రాజె క్టులు, ఇతర అంశాలపై కోర్టుల్లో కేసులు వేయడం మానుకో వాలని, ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేయకుండా నిర్మాణాత్మక సూచనలతో బాధ్యతా యుతంగా వ్యవహరించాలని ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు విపక్షాలకు విజ్ఞప్తిచేశారు. ‘నేను రాను బిడ్డో.. సర్కారు దవాఖానాకు’అనే పరిస్థితి నుంచి.. ‘నేను వస్త బిడ్డో.. సర్కారు దవాఖానకు’ అనేట్లుగా పరిస్థితి మారిందన్నారు.
రికార్డులు సవరించాలి: షబ్బీర్
ఒక్క కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చిందని గవర్నర్ చేసిన వ్యాఖ్యలు సవరించి.. 1969 నుంచి అమరుల త్యాగాలు, ప్రత్యేక రాష్ట్ర సాధనలో కాంగ్రెస్ కృషిని కూడా ప్రభుత్వం, గవర్నర్ రికార్డుల్లో చేర్చాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపే బాధ్యత ప్రతిపక్షంగా తమపై ఉందన్నారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు, పీఆర్‌సీ అమలు, బయ్యారం స్టీల్‌ప్లాంట్‌పై స్పష్టతనివ్వడంతో పాటు, నిరుద్యోగ భృతి అమలు, పెంచిన పింఛన్లు, ఇతరత్రా కొత్త హామీలు ఎప్పటి నుంచి అమలుచేస్తారో ప్రభుత్వం వెల్లడించాలన్నారు. సంక్షేమ రంగానికి భారీగా నిధులు కేటాయి స్తున్నట్టు చూపుతున్నా.. వాటిలో 20 శాతం కూడా క్షేత్రస్థాయిలో ఖర్చుకావడం లేదన్నారు.
అభివృద్ధికి అద్దం పట్టింది: కొప్పుల ఈశ్వర్
గవర్నర్ ప్రసంగం రాష్ట్రాభివృద్ధికి అద్దం పట్టిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ అన్నారు. నాలుగున్నరేళ్లలో రాష్ట్రం ఎంతో పురోగతి సాధించిందన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసన సభలో చర్చను కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. కొత్త రాష్ట్రమైనప్పటికీ సంక్షేమ పథకాల అమల్లో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని చెప్పారు. సంక్షేమ ఫలాలు ప్రజలకు అందాయి కాబట్టే ప్రజలు మళ్లీ టీఆర్‌ఎస్‌కు పట్టంగట్టారన్నారు. రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు.
సొంతకాళ్లపై నిలబడేలా: రామచంద్రరావు
ఉత్పాదకత పెంచి ప్రజలు సొంత కాళ్లపై నిలబడేలా చేయూత నివ్వాలి గానీ.. వివిధ రూపాల్లో ప్రజలు ప్రభుత్వంపై ఆధారపడేలా చేయడం సరికాదని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు. వివిధ రంగాలకు సంబంధించి అది చేశాం, ఇది చేశాం, మరోటి చేస్తున్నాం అని గవర్నర్ చెప్పారని, అయితే నిజంగా ఆయా రంగాల్లో అంతగా అభివృద్ధి జరిగిందా అన్న సమీక్ష జరగాలన్నారు. విద్యారంగంలో రాష్ట్రం వెనుకబడి ఉందన్నారు. డీఎస్సీ ద్వారా ఎంత మంది ఉపాధ్యాయులను భర్తీచేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉస్మాని యా సహా రాష్ట్రంలోని పలు వర్సిటీల్లో అధ్యాప కుల కొరత తీవ్రంగా ఉందని, దీన్ని వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
వైద్య రంగంలో రాష్ట్రం సాధించాల్సింది ఎంతో ఉందన్నారు. కేంద్రం తీసుకొచ్చిన ‘ఆయు ష్మాన్ భారత్’పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. జంట నగరాల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం వేగం పెంచాలని ఎంఐఎం ఎమ్మెల్సీ సయ్యద్ అమీనుల్ జాఫ్రీ కోరారు. హైదరాబాద్‌లో శాంతి పరిరక్షణకు సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలు అభినందనీయమన్నారు. వెనుకబడిన ముస్లిం వర్గాలకు 12%, ఎస్టీలకు 10% రిజర్వేషన్ల కల్పనకు చర్యలు తీసుకోవాలని కోరారు. కాంపన్‌సేటరీ పెన్షన్ స్కీమ్ విధానం రద్దుకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దనరెడ్డి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment