బాల్కొండ నియోజకవర్గం
బాల్కొండ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ తరపున పోటీచేసిన వేముల ప్రశాంతరెడ్డి మరోసారి గెలిచి మంత్రి అయ్యారు. ఆయన 2014లో గెలిచిన తర్వాత మిషన్ బగీరద స్కీమ్ అమలు కు చైర్మన్ గా బాద్యతలు నిర్వహించారు. ప్రశాంతరెడ్డి బిఎస్పి తరపున పోటీచేసిన సునీల్ కుమార్‌పై 32459 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ గతంలో 2009లో ప్రజారాజ్యం తరపున గెలిచిన మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ 2014, 2018లలో కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసి ఓడిపోయారు. ఈయన 2018లో మూడోస్థానానికి పరిమితం అవడం విశేషం. ప్రశాంతరెడ్డికి 73538 ఓట్లు రాగా, సునీల్ కుమార్‌కు 41079 ఓట్లు వచ్చాయి.
కాంగ్రెస్ ఐ నేత అనిల్ కుమార్‌కు సుమారు ముప్పైవేల ఓట్లు మాత్రమే వచ్చాయి. బాల్కొండలో పదిసార్లు రెడ్లు గెలుపొందితే, ఆరుసార్లు బిసి నేతలు ప్రధానంగా మున్నూరుకాపు నేతలు విజయం సాదించారు. రెండువేల తొమ్మిదిలో ఇక్కడ ప్రజారాజ్యం అభ్యర్ధి ఎర్రాపత్రి అనిల్ ఎనిమిదివేల ఓట్ల ఆధిక్యతతో కాంగ్రెస్ అభ్యర్ధి, మాజీ మంత్రి సంతోష్‌రెడ్డి కుమారుడు అయిన శ్రీనివాస్‌రెడ్డిపై గెలుపొందారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత అనిల్ తదుపరి కాలంలో ప్రభుత్వవిప్‌గా పదవి పొందారు. బాల్కొడంలో నాలుగుసార్లు చొప్పున గెలిచిన ఘనత జి.రాజారాం, కె. ఆర్. సురేష్‌రెడ్డిలకు దక్కింది.
1994లో సైతం గెలుపొందిన సురేష్‌రెడ్డి డీలిమిటేషన్‌ను దృష్టిలో ఉంచుకుని 2009లో బాల్కొండలో కాకుండా ఆర్మూరులో పోటీచేసి మేనత్త అన్నపూర్ణమ్మ చేతిలో ఓడిపోవడం విశేషం. 2014లో కూడా ఓటమి తప్పలేదు.ఆ తర్వాత ఆయన టిఆర్‌ఎస్‌లో చేరి రాజ్యసభ సభ్యుడు అయ్యారు. సురేష్‌రెడ్డి 2004 నుంచి ఐదేళ్లపాటు స్పీకరుగా పదవీబాధ్యతలు నిర్వహించారు. జి. రాజారాం 1967లోఇక్కడ నుంచి ఒకసారి ఏకగ్రీవంగా ఎన్నికవడం ఓ రికార్డు.ఈయన ఆర్మూరులో కూడా ఒకసారి గెలుపొందడం ద్వారా మొత్తం ఐదుసార్లు చట్టసభకు వెళ్లారు. ఈయన జలగం, చెన్నారెడ్డి, అంజయ్యల మంత్రివర్గాలలో పనిచేసారు.
రోడ్డు ప్రమాదంలో మరణించడంతో రాజారామ్ భార్య సుశీలాబాయి ఇక్కడ నుంచి ఉప ఎన్నికలో గెలిచారు. ఈ విధంగా భార్యభర్తలు ఇద్దరూ చట్టసభలోకి వెళ్లినట్లయింది. టిడిపినేత జి.మధుసూదనరెడ్డి రెండుసార్లు గెలిచారు. బాల్కొండకు ఒక ఉప ఎన్నికతో సహా 16సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు కలిసి పదిసార్లు గెలుపొందగా, టిడిపి రెండుసార్లు, సోషలిస్టు పార్టీ, ప్రజారాజ్యం పార్టీ టిఆర్‌ఎస్ రెండుసార్లు గెలిచాయి.
బాల్కొండలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment