Balkonda Assembly Constituency
-
మోదీకి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టుకుంది: కేసీఆర్ మండిపాటు
సాక్షి, నిజామాబాద్: మోదీకి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టుకుందని సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాల్సిందిగా బెదిరించారని చెప్పారు. ఆరునూరైనా మోటార్లుకు మీటర్లు పెట్టనని మోదీకి తెగేసి చెప్పానన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా బాల్కొండలో జరిగిన బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. మీటర్లు పెట్టనందుకు తెలంగాణకు ఇవ్వాల్సిన రూ.5 వేల కోట్లు ఎగ్గొట్టారని విమర్శించారు. ఎన్నికలు రాగానే ఆగం కావొద్దని ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. పార్టీలు ప్రజలకు ఏం చేశాయో చూసి ఆలోచించి ఓటు వేయాలని కోరారు. పదేళ్ల వయసున్న తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్న 24 గంటల కరెంటు దేశంలో ఎక్కడా లేదన్నారు. తెలంగాణలో ఒక్క రైతులకే కాదు అన్ని వర్గాలకు మేలు చేశామని చెప్పారు. ‘త్వరలో బీడీ కార్మికులకు పెన్షన్లు ఇవ్వనున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళారులు లేకుండా రైతు బంధు వస్తోంది.ధరణితో రైతులకు ఎంతో మేలు జరిగింది.ఇప్పుడు తెలంగాణలో మంచినీటి సమస్య లేదు.ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ అడుగుతోంది. కాంగ్రెస్‌కు ఒక్కసారి కాదు దేశంలో 11సార్లు ఛాన్సిచ్చారు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయారు.మనుషులు మాట్లాడితే కొంచెం ఇజ్జత్ ఉండాలె. కేసీఆర్ కర్ణాటక ను చూడటానికి రా. బస్సు పెడతానని కర్ణాటక నుంచి వచ్చిన అక్కడి డిప్యూటీసీఎం అంటడు. మన దగ్గరే 24 గంటలు కరెంటు ఇస్తున్నాం. వాడు ఇచ్చే 5 గంటల కరెంటు చూడటానికి వెళ్లాలంట’అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. -
TS Election 2023: బాల్కొండ నియోజకవర్గంలో.. పొలిటికల్ అంశాలు!
సాక్షి, నిజామాబాద్: బాల్కొండ నియోజకవర్గంలో రైతుల సమస్యలు, రుణమాఫీ, పంటలకు గిట్టుబాటు ధరలు, గల్ఫ్ వలస కార్మికుల సమస్యలు, బీడీ కార్మికుల సమస్యలు ప్రభావితం చేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నుంచి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఒక్కరే పార్టీ టిక్కెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్‌రెడ్డి, మాజీ విప్ అనిల్, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి టిక్కెట్ ఆశిస్తున్నారు. బీజేపీ నుంచి డాక్టర్ మల్లికార్జున్‌రెడ్డి, రుయ్యాడి రాజేశ్వర్‌లు టిక్కెట్‌ను ఆశిస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం 110 గ్రామ పంచాయతీలు, ఎనిమిది మండలాలతో పాటు రాజన్న సిరిసిల్లా జిల్లాలోని రుద్రంగి మండలంలోని కొంత భాగం నియోజకవర్గంలో ఉంది. భీమ్‌గల్ మండలం అతి పెద్ద మండలం, ప్రభావం చూపించే పంచాయతీ బాల్కొండ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,09,694 మంది, పురుషులు 96,878 మంది, స్త్రీలు 1,12,813 మంది, ఇతరులు 3 మంది. వృత్తిపరంగా ఓటర్లలో రైతుల సంఖ్యనే ఎక్కువగా ఉంటుంది. మతం పరంగా మైనార్టీ ఓటర్లు తక్కువగానే ఉంటారు. నియోజకవర్గంలోని భౌగోళిక పరిస్థితులు గోదావరి నది పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. కమ్మర్పల్లి భీమ్‌గల్, రుద్రంగి మండలం మానాల పరిసరాల్లో అడవి విస్తరించి ఉంది. కొండలు కూడా బాగానే ఉన్నాయి. ఆలయాలలో ప్రసిద్ది చెందిన లింభాద్రి నర్సింహా స్వామి ఆలయం భీమ్‌గల్ మండలంలో ఉంది. చౌట్పల్లిలో శ్రీలక్ష్మినారాయణ స్వామి ఆలయం, తడపాకల్, పోచంపాడ్లలో శ్రీకోదండ రామాలయాలు ఉన్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కీలకమైన పర్యాటక ప్రాంతంగా ఉంది. నియోజకవర్గంలో పసుపు సాగుకు ఇక్కడి రైతులు ప్రాధాన్యం ఇస్తారు. దేశంలో సాగు అయ్యే పసుపులో 15 శాతంకుపైగా పసుపు పంట ఈ బాల్కొండ నియోజకవర్గంలోనే సాగైతుంది. వరి పంట కంటే వాణిజ్య పంటలకే ఇక్కడి రైతులు మొగ్గుచూపుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేసే సజ్జలు, ఎర్రజొన్నలు, తెల్లజొన్నలు సాగుకు ఈ ప్రాంతం పేరుగాంచింది. రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం జిల్లా పరిషత్ మొట్టమొదటి ఛైర్మన్ హన్మంత్‌రెడ్డి ఈ నియోజకవర్గంలోని చౌట్పల్లికి చెందినవారు, అతని మనుమడు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు స్పీకర్‌గా పని చేసిన సురేష్‌రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ తరపున రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. ఒకప్పటి పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ ఈ నియోజకవర్గంలోని వేల్పూర్‌కు చెందినవారు. వేల్పూర్ మండలానికి చెందిన ప్రశాంత్‌రెడ్డి ఎమ్మేల్యేగా బాల్కొండ నియోజకవర్గంకు ప్రాతినిధ్యం వహిస్తుండగా ఇదే మండలం జాన్కంపేట్‌కు చెందిన జీవన్‌రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఎన్ఎస్ఎఫ్ ఛైర్మన్‌గా పని చేసిన బద్దం నర్సారెడ్డి ఈ నియోజకవర్గంలోని దొన్కల్కు చెందినవారు. -
ఎంతో ఆసక్తికరంగా బాల్కొండ నియోజకవర్గ రాజకీయ చరిత్ర
బాల్కొండ నియోజకవర్గం బాల్కొండ నియోజకవర్గంలో టిఆర్ఎస్ తరపున పోటీచేసిన వేముల ప్రశాంతరెడ్డి మరోసారి గెలిచి మంత్రి అయ్యారు. ఆయన 2014లో గెలిచిన తర్వాత మిషన్ బగీరద స్కీమ్ అమలు కు చైర్మన్ గా బాద్యతలు నిర్వహించారు. ప్రశాంతరెడ్డి బిఎస్పి తరపున పోటీచేసిన సునీల్ కుమార్‌పై 32459 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ గతంలో 2009లో ప్రజారాజ్యం తరపున గెలిచిన మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ 2014, 2018లలో కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసి ఓడిపోయారు. ఈయన 2018లో మూడోస్థానానికి పరిమితం అవడం విశేషం. ప్రశాంతరెడ్డికి 73538 ఓట్లు రాగా, సునీల్ కుమార్‌కు 41079 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ ఐ నేత అనిల్ కుమార్‌కు సుమారు ముప్పైవేల ఓట్లు మాత్రమే వచ్చాయి. బాల్కొండలో పదిసార్లు రెడ్లు గెలుపొందితే, ఆరుసార్లు బిసి నేతలు ప్రధానంగా మున్నూరుకాపు నేతలు విజయం సాదించారు. రెండువేల తొమ్మిదిలో ఇక్కడ ప్రజారాజ్యం అభ్యర్ధి ఎర్రాపత్రి అనిల్ ఎనిమిదివేల ఓట్ల ఆధిక్యతతో కాంగ్రెస్ అభ్యర్ధి, మాజీ మంత్రి సంతోష్‌రెడ్డి కుమారుడు అయిన శ్రీనివాస్‌రెడ్డిపై గెలుపొందారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత అనిల్ తదుపరి కాలంలో ప్రభుత్వవిప్‌గా పదవి పొందారు. బాల్కొడంలో నాలుగుసార్లు చొప్పున గెలిచిన ఘనత జి.రాజారాం, కె. ఆర్. సురేష్‌రెడ్డిలకు దక్కింది. 1994లో సైతం గెలుపొందిన సురేష్‌రెడ్డి డీలిమిటేషన్‌ను దృష్టిలో ఉంచుకుని 2009లో బాల్కొండలో కాకుండా ఆర్మూరులో పోటీచేసి మేనత్త అన్నపూర్ణమ్మ చేతిలో ఓడిపోవడం విశేషం. 2014లో కూడా ఓటమి తప్పలేదు.ఆ తర్వాత ఆయన టిఆర్ఎస్లో చేరి రాజ్యసభ సభ్యుడు అయ్యారు. సురేష్‌రెడ్డి 2004 నుంచి ఐదేళ్లపాటు స్పీకరుగా పదవీబాధ్యతలు నిర్వహించారు. జి. రాజారాం 1967లోఇక్కడ నుంచి ఒకసారి ఏకగ్రీవంగా ఎన్నికవడం ఓ రికార్డు.ఈయన ఆర్మూరులో కూడా ఒకసారి గెలుపొందడం ద్వారా మొత్తం ఐదుసార్లు చట్టసభకు వెళ్లారు. ఈయన జలగం, చెన్నారెడ్డి, అంజయ్యల మంత్రివర్గాలలో పనిచేసారు. రోడ్డు ప్రమాదంలో మరణించడంతో రాజారామ్ భార్య సుశీలాబాయి ఇక్కడ నుంచి ఉప ఎన్నికలో గెలిచారు. ఈ విధంగా భార్యభర్తలు ఇద్దరూ చట్టసభలోకి వెళ్లినట్లయింది. టిడిపినేత జి.మధుసూదనరెడ్డి రెండుసార్లు గెలిచారు. బాల్కొండకు ఒక ఉప ఎన్నికతో సహా 16సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు కలిసి పదిసార్లు గెలుపొందగా, టిడిపి రెండుసార్లు, సోషలిస్టు పార్టీ, ప్రజారాజ్యం పార్టీ టిఆర్ఎస్ రెండుసార్లు గెలిచాయి. బాల్కొండలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..