సాక్షి, నిజామాబాద్: మోదీకి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టుకుందని సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాల్సిందిగా బెదిరించారని చెప్పారు. ఆరునూరైనా మోటార్లుకు మీటర్లు పెట్టనని మోదీకి తెగేసి చెప్పానన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా బాల్కొండలో జరిగిన బీఆర్‌ఎస్ ప్రజాఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు.
మీటర్లు పెట్టనందుకు తెలంగాణకు ఇవ్వాల్సిన రూ.5 వేల కోట్లు ఎగ్గొట్టారని విమర్శించారు. ఎన్నికలు రాగానే ఆగం కావొద్దని ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. పార్టీలు ప్రజలకు ఏం చేశాయో చూసి ఆలోచించి ఓటు వేయాలని కోరారు. పదేళ్ల వయసున్న తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్న 24 గంటల కరెంటు దేశంలో ఎక్కడా లేదన్నారు. తెలంగాణలో ఒక్క రైతులకే కాదు అన్ని వర్గాలకు మేలు చేశామని చెప్పారు.
‘త్వరలో బీడీ కార్మికులకు పెన్షన్‌లు ఇవ్వనున్నాం. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో దళారులు లేకుండా రైతు బంధు వస్తోంది.ధరణితో రైతులకు ఎంతో మేలు జరిగింది.ఇప్పుడు తెలంగాణలో మంచినీటి సమస్య లేదు.ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ అడుగుతోంది. కాంగ్రెస్‌కు ఒక్కసారి కాదు దేశంలో 11సార్లు ఛాన్సిచ్చారు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయారు.మనుషులు మాట్లాడితే కొంచెం ఇజ్జత్ ఉండాలె. కేసీఆర్ కర్ణాటక ను చూడటానికి రా. బస్సు పెడతానని కర్ణాటక నుంచి వచ్చిన అక్కడి డిప్యూటీసీఎం అంటడు. మన దగ్గరే 24 గంటలు కరెంటు ఇస్తున్నాం. వాడు ఇచ్చే 5 గంటల కరెంటు చూడటానికి వెళ్లాలంట’అని కేసీఆర్ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment