
బీజేపీ కుట్రలను అడ్డుకుంటామని.. తెలంగాణకు కేంద్రం గాడిద గుడ్డే ఇచ్చిందంటూ వ్యాఖ్యానించారు సీఎం రేవంత్‌రెడ్డి.
సాక్షి, ఆదిలాబాద్ జిల్లా: బీజేపీ కుట్రలను అడ్డుకుంటామని.. తెలంగాణకు కేంద్రం గాడిద గుడ్డే ఇచ్చిందంటూ వ్యాఖ్యానించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, రిజర్వేషన్ల రద్దుపై మాట్లాడుతున్నానన్న కారణంతోనే తనపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
దిల్లీ సుల్తాన్‌లు తెలంగాణపై దాడి చేయాలనుకుంటున్నారని, వారి ఆటలు సాగనివ్వనంటూ రేవంత్ హెచ్చరించారు. బలహీనవర్గాల కులగణన చేస్తున్నామని. అప్పుడే బీసీలకు రిజర్వేషన్లు పెంచగలుగుతామన్నారు. రిజర్వేషన్లు రద్దు చేయాలని ఆరెస్సెస్ ప్రయత్నిస్తోందని రేవంత్ మండిపడ్డారు. 1881 నుంచి ప్రతి పదేళ్లకు ఒకసారి దేశంలో జనాభా లెక్కలు జరుగుతున్నాయి. 2021లో జనగణన చేయాల్సి ఉన్నా.. అమిత్‌షా కుట్ర చేసి నిలిపివేయించారంటూ ధ్వజమెత్తారు.
పోడు భూముల సమస్యలపై కేసీఆర్ దృష్టి పెట్టలేదని దుయ్యబట్టారు. మోదీ, కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉన్నా ఆదిలాబాద్‌కు ఏమీ చేయలేదని రేవంత్ మండిపడ్డారు.