సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో బీఆర్‌ఎస్ పాల్గొనదని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాసిన కేసీఆర్..ప్రభుత్వం పక్షాన మీరు నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు రమ్మని మీరు నాకు ఆహ్వానం పంపారు.. తెలంగాణ రాష్ట్ర అవతరణ సుదీర్ఘ ప్రజా పోరాట ఫలితమని అమరుల త్యాగాల పర్యావసానమని కాకుండా కాంగ్రెస్ దయాభిక్షంగా ప్రచారం చేస్తున్న మీ భావదారిద్య్రాన్ని నేను మొదట నిరసిస్తున్నానని లేఖల పేర్కొన్నారు.
‘‘1969 నుంచి 5 దశాబ్దాలు భిన్న దశలలో భిన్న మార్గాలలో ఉద్యమ ప్రస్థానం సాగింది. తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ రక్తసిక్తం చేసిందనేది వాస్తవం ఇది సత్యం. తెలంగాణ తొలి దశ ఉద్యమంలో 369 మంది ఉక్కుపచ్చలారని యువకులు కాల్చి చంపిన కాంగ్రెస్ దమననీతికి సాక్ష్యమే గన్ పార్క్ అమరవీరుల స్థూపం. ఆ స్థూపాన్ని కూడా ఆ స్థూపాన్ని కూడా ఆవిష్కరించుకొని ఇవ్వకుండా అడ్డుపడిన కాంగ్రెస్ కర్కషత్వం తెలంగాణ చరిత్ర పుటలలో నిలబడిపోతుంది. మలిదశ ఉద్యమంలో వందలాదిమంది యువకులు ప్రాణాలు బలిగొన్న పాపం నిశ్చయంగా కాంగ్రెస్ పార్టీ దే’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమానికి రాజకీయ వ్యక్తీకరణ నించింది తెలంగాణ వాదాన్ని తిరుగులేని రాజకీయం శక్తిగా మలిచింది. తెలంగాణ స్వరాష్ట్రం కోసం మా పదవులను సైతం త్రుణప్రాయంగా వదిలేశాం. మీ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ తీరోగమన దిశలో వెళ్తోంది’’ అని కేసీఆర్ లేఖలో మండిపడ్డారు.
‘‘తెలంగాణ దశాబ్ది ఉత్సవం ఒక ఉద్దీజ్ఞ ఉత్తేజ కరమైన సందర్భమే అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమన దిశగా తీసుకుపోతున్న ఆరోపణలు వెలువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాలలో నేను పాల్గొనడం సమంజసం కాదని టిఆర్ఎస్ పార్టీతో సహా ఉద్యమకారులు తెలంగాణ వాదుల అభిప్రాయంగా ఉంది. పైన పేర్కొన్న కారణాల విద్య ప్రజా జీవితాన్ని క్రమక్రమంగా కల్లోలం లోకి నెట్టుతున్న మీ పాలనను మిమ్మల్ని ప్రశ్నించేవాళ్లు అడుగడుగున అవమానిస్తూ దాడులు చేస్తున్న మీ వైఖరిని నిరసిస్తున్నాం. ఇందుచేత రేపటి దశాబ్ది ఉత్సవాలలో నేను పాల్గొనడం లేదు’’ అంటూ లేఖలో కేసీఆర్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment