open lettre
-
దశాబ్ది ఉత్సవాలకు కేసీఆర్ దూరం.. రేవంత్‌కు బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో బీఆర్ఎస్ పాల్గొనదని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాసిన కేసీఆర్..ప్రభుత్వం పక్షాన మీరు నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు రమ్మని మీరు నాకు ఆహ్వానం పంపారు.. తెలంగాణ రాష్ట్ర అవతరణ సుదీర్ఘ ప్రజా పోరాట ఫలితమని అమరుల త్యాగాల పర్యావసానమని కాకుండా కాంగ్రెస్ దయాభిక్షంగా ప్రచారం చేస్తున్న మీ భావదారిద్య్రాన్ని నేను మొదట నిరసిస్తున్నానని లేఖల పేర్కొన్నారు.‘‘1969 నుంచి 5 దశాబ్దాలు భిన్న దశలలో భిన్న మార్గాలలో ఉద్యమ ప్రస్థానం సాగింది. తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ రక్తసిక్తం చేసిందనేది వాస్తవం ఇది సత్యం. తెలంగాణ తొలి దశ ఉద్యమంలో 369 మంది ఉక్కుపచ్చలారని యువకులు కాల్చి చంపిన కాంగ్రెస్ దమననీతికి సాక్ష్యమే గన్ పార్క్ అమరవీరుల స్థూపం. ఆ స్థూపాన్ని కూడా ఆ స్థూపాన్ని కూడా ఆవిష్కరించుకొని ఇవ్వకుండా అడ్డుపడిన కాంగ్రెస్ కర్కషత్వం తెలంగాణ చరిత్ర పుటలలో నిలబడిపోతుంది. మలిదశ ఉద్యమంలో వందలాదిమంది యువకులు ప్రాణాలు బలిగొన్న పాపం నిశ్చయంగా కాంగ్రెస్ పార్టీ దే’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమానికి రాజకీయ వ్యక్తీకరణ నించింది తెలంగాణ వాదాన్ని తిరుగులేని రాజకీయం శక్తిగా మలిచింది. తెలంగాణ స్వరాష్ట్రం కోసం మా పదవులను సైతం త్రుణప్రాయంగా వదిలేశాం. మీ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ తీరోగమన దిశలో వెళ్తోంది’’ అని కేసీఆర్ లేఖలో మండిపడ్డారు.‘‘తెలంగాణ దశాబ్ది ఉత్సవం ఒక ఉద్దీజ్ఞ ఉత్తేజ కరమైన సందర్భమే అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమన దిశగా తీసుకుపోతున్న ఆరోపణలు వెలువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాలలో నేను పాల్గొనడం సమంజసం కాదని టిఆర్ఎస్ పార్టీతో సహా ఉద్యమకారులు తెలంగాణ వాదుల అభిప్రాయంగా ఉంది. పైన పేర్కొన్న కారణాల విద్య ప్రజా జీవితాన్ని క్రమక్రమంగా కల్లోలం లోకి నెట్టుతున్న మీ పాలనను మిమ్మల్ని ప్రశ్నించేవాళ్లు అడుగడుగున అవమానిస్తూ దాడులు చేస్తున్న మీ వైఖరిని నిరసిస్తున్నాం. ఇందుచేత రేపటి దశాబ్ది ఉత్సవాలలో నేను పాల్గొనడం లేదు’’ అంటూ లేఖలో కేసీఆర్ స్పష్టం చేశారు. -
ఆయన ఉండి ఉంటే: సీఎంకు నటి క్రాంతి వాంఖడే బహిరంగ లేఖ
సాక్షి, ముంబై: బాలీవుడ్ స్టార్హీరో కుమారుడు డ్రగ్స్ కేసు ప్రకంపనలు రోజుకో మలుపు తిరుగుతోంది. ఒకవైపు డ్రగ్స్ కేసులో హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ వ్యవహారం వాయిదా పడుతూ వస్తోంది. మరోవైపు ఆర్యన్ ఖాన్‌ను అరెస్ట్ చేసి సంచలనం రేపిన ఎన్సీబీ ముంబై జోనల్ అధికారి సమీర్ వాంఖడేపై వేటు వేసుందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భార్య క్రాంతి రేడ్కర్ వాంఖడే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్, సమీర్ మధ్య ముదురుతున్న వివాదం నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖను ట్విటర్లో పోస్ట్ చేశారు. మరాఠీ ప్రజల సమాన హక్కుల కోసం పోరాడుతున్న శివసేనను చూస్తూ పెరిగిన మరాఠీ అమ్మాయినైనా తాను ప్రతీరోజు అవమానాల పాలు కావాల్సి వస్తోందని, ఛత్రపతి శివాజీ మహారాజ్, బాలాసాహెబ్ రాష్ట్రంలో ఒక మహిళకు తీరని అవమానం జరుగుతోందని క్రాంతి వాపోయారు. ఈ రోజు బాలాసాహెబ్ ఇక్కడ ఉండి ఉంటే ఇలా జరిగేది కాదని ఆమె వ్యాఖ్యానించారు. బాలాసాహెబ్ ఠాక్రేల సిద్ధాంతాలను గౌరవిస్తూ పెరిగాను. ఎవరికీ అన్యాయం చేయకూడదని, అన్యాయాన్ని అస్సలు సహించకూడదని ఆ నేతలంతా తనకు నేర్పించారని ఆమె అన్నారు. బాలాసాబ్లో మిమ్మల్ని చూసుకుంటున్నానంటూ సీఎం ఠాక్రే నుద్దేశించి లేఖ రాశారు. తన కుటుంబానికి అన్యాయం చేయరనే విశ్వాసాన్ని ఆ లేఖలో వ్యక్తం చేశారు. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాసిన క్రాంతి ఎన్సీబీ అధికారి, తన భర్త సమీర్ వాంఖడేకు న్యాయం చేయాలని కోరారు. అలాగే సీఎం అపాయింట్మెంట్ కోరినట్టు తెలుస్తోంది. సమీర్ పనిచేయడం, చాలా మందికి నచ్చడం లేదని, డ్రగ్స్ ద్వారా వచ్చే భారీ ఆదాయాన్ని వదులుకోవడం ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. అందుకే ఆయన్ను తొలిగించాలని భావిస్తున్నారని, తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని క్రాంతి ఆరోపించారు. ఈ వ్యవహారంలో మాలిక్ ఆరోపణలను ఖండించిన సమీర్ వాంఖడే సోదరి, న్యాయవాది యాస్మీన్ గురువారం ముంబై పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మంత్రి నవాబ్ మాలిక్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ లిఖితపూర్వక ఫిర్యాదును ఆమె సమర్పించారు. అయితే ఆమె ఫిర్యాదు మేరకు ఇప్పటివరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. కాగా ఆర్యన్ ఖాన్ కేసులో విచారణకు నాయకత్వం వహిస్తున్న ఎన్‌సిబి అధికారి సమీర్ వాంఖడే దోపిడీ, అక్రమ ట్యాపింగ్, పత్రాల ఫోర్జరీ ఆరోపణలు వెల్లు వెత్తాయి. క్రూయిజ్ షిప్ వివాదంలో ఆర్యన్ విడుదల కోసం రూ.25 కోట్లు డిమాండ్ చేశాడని ఒక సాక్షి ఆరోపించి అఫిడవిట్ దాఖలు చేయడంతో సమీర్ వాంఖడేపై విచారణకు ఆదేశించింది. దీనికి తోడు మంత్రి నవాబ్‌మాలిక్ కూడా సమీర్‌పై ఆరోపణలకు దిగారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం మోసపూరితంగా జనన , మరియు, కుల ధృవీకరణ పత్రాన్ని పొందాడని ఆరోపించారు. మరోవైపు సినీ సెలబ్రెటీలను టార్గెట్ చేసి ఎన్సీబీ దాడులు చేస్తోందని రాష్ట్రంలో అధికారంలో ఉన్న శివసేన ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. माननीय उद्धव ठाकरे साहेब @CMOMaharashtra पत्रास करण की … pic.twitter.com/0VJxURk5oi — Kranti Redkar Wankhede (@KrantiRedkar) October 28, 2021 -
‘గుర్తుకు తెచ్చుకో.. నువ్వే అడిగావు నన్ను’
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బహిష్కరణకు గురై ప్రస్తుతం నిరాహార దీక్ష చేస్తున్న కపిల్ మిశ్రా తల్లి, ఒకప్పటి బీజేపీ నేత అన్నపూర్ణ మిశ్రా బహిరంగ లేఖ రాశారు. అందులో కేజ్రీవాల్‌ను అబద్ధాల కోరుగా అభివర్ణించారు. అంతకుముందు నిరాహార దీక్షలో ఉన్న కపిల్ మిశ్రా ఉదయాన్నే ఓ ట్వీట్ చేశారు. ‘మా అమ్మ అరవింద్ కేజ్రీవాల్‌కు ఏదో చెప్పాలనుకుంటుంది’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. అరవింద్‌ను ఉద్దేశించి కపిల్ తల్లి ఏం రాశారంటే.. ‘ఇంకా ఎన్ని అబద్ధాలాడతావు కేజ్రీవాల్.. ఇంకెన్ని.. కొంచెం దేవుడికైనా భయపడు. నా కొడుకు నిన్ను ప్రశ్నిస్తాడనిగానీ, ఆ ప్రశ్నలను తప్పించుకుంటావనిగానీ నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను ఎప్పుడు కలుసుకున్నా ప్రజాజీవితంలో సత్యంగా ఉండాలనే విషయాన్నే చెబుతావు. గుర్తుకు తెచ్చుకో.. కపిల్‌ను నీ పార్టీ పార్టీలోకి తీసుకుంటానని నువ్వే నా ఇంటికి వచ్చి అడిగావు.. పార్టీ తరుపున ఎన్నికల్లో పోటీ చేయాలన్నావు.. కానీ కపిల్ మాత్రం ఉద్యమంలోనే భాగస్వామ్యం అవుతానని చెప్పాడు. కానీ, నువ్వు కపిల్ అవసరం తనకు చాలా ఉందని చెప్పావు. కానీ, ఇప్పుడు ప్రజలంతా నిన్ను అవినీతిపరుడని అంటున్నారు.. నువ్వు మాత్రం మౌనంగా ఉన్నావు. నువ్వు కపిల్‌తో ఉన్నావు. కానీ వాడిని అర్ధం చేసుకోలేదు. వాడు తీవ్ర బాధతో ఉన్నాడు. మూడు రోజులుగా ఏమీ తినడం లేదు. ఒక తల్లిగా నిన్ను అడుగుతున్నాను.. అతడు ఏ సమాచారం అడుగుతున్నాడో అది ఇచ్చేయ్. అతడు ఎవరి ఏజెంటూ కాదు.. ఒక్క నిజానికి తప్ప’ అంటూ ఆమె హిందీలో లేఖ రాశారు. -
చంద్రబాబుకు వైఎస్ జగన్ బహిరంగ లేఖ
హైదరాబాద్: నిరుద్యోగుల్లో అసంతృప్తి సమాజానికి మంచిది కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. నిరుద్యోగులను పట్టించుకోవాలని, వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి శనివారం బహిరంగ లేఖ రాశారు. నిరుద్యోగుల గోడు వినేందుకు చంద్రబాబు తీరిక చేసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ఇచ్చిన మాట మరిచిపోవడం వల్లే మరోసారి తాను ఈ లేఖ రాయాల్సి వచ్చిందంటూ గుర్తు చేశారు. వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని, ఇచ్చిన హామీ మేరకు ఇప్పటి వరకు చెల్లించాల్సిన బకాయిలతో రూ.2వేల నిరుద్యోగ భృతిని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చాలని, అధికారంలోకి వచ్చి 35 నెలలు గడిచినా ఇప్పటి వరకు ఏ ఒక్కరికీ నిరుద్యోగ భృతి అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ఫిబ్రవరిలో బహిరంగ లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. అయినప్పటికీ చలనం లేని తీరుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. గ్రూప్స్ పరీక్షలను మొక్కుబడిగా జరుపుతున్నారని మండిపడ్డారు. నిరుద్యోగుల్లో ప్రభుత్వం తరుపున ఎలాంటి భరోసా కనిపించడం లేదన్నారు. ఏపీపీఎస్సీ అధికారులు కూడా నిరుద్యోగుల గోడు పట్టించుకోవడం లేదని, వారి అభిప్రాయం కూడా వినకపోవడం తననెంతో బాధించిందని, కనీసం వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వాలని హితవు పలికారు. తీవ్ర నిరుద్యోగం, నిరుద్యోగుల్లో అసంతృప్తి సమాజానికి మంచిదికాదని హెచ్చరించారు. తాను రాస్తున్న లేఖలో గొంతెమ్మ కోర్కెలు లేవన్న వైఎస్ జగన్.. ప్రజలకు ఇచ్చిన హామీలనే నెరవేర్చాలని కోరుతున్నానని చెప్పారు. లేఖ పూర్తి సారాంశం... -
నా జీవితంలో పెద్ద ఆస్తి మీరే: సోనియా
న్యూఢిల్లీ: తొలిసారి ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి గత కొద్ది రోజులుగా దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ బుధవారం ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని ఆమె అందులో ఆరోపించారు. అనంతరం అమేథీ, రాయ్‌బరేలీతో తమ కుటుంబానికి ఉన్న సంబంధాన్ని గుర్తు చేశారు. తాను ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండటానికి గల కారణాలు పెద్దగా పేర్కొనని ఆమె అమేథీ, రాయ్‌బరేలీ తమ జీవితంలో భాగం అని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో నాలుగో దశ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమె లేఖ విడుదల చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ దశలోనే ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న రాయ్‌బరేలీకి చెందిన ఐదు నియోజవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎప్పటిలాగే ఈ ప్రాంత ప్రజలు తమతో ఉండాలని సోనియా లేఖలో విజ్ఞప్తి చేశారు. ‘కొన్నికారణాల వల్ల ఈసారి నేను మీముందుకు రాలేకపోతున్నాను. మీకు ప్రతినిధిగా ఉండటం నాకు, నా కుటుంబానికి చాలా గౌరవం. మీతో మా కుటుంబానిది ప్రత్యేక అనుబంధం. నా జీవితంలో అతిపెద్ద ఆస్తులు మీరే’ అంటూ సోనియా ఆ లేఖలో పేర్కొన్నారు. -
’నేను, అమ్మమ్మ, వాళ్లమ్మ కూడా బాధితులమే’
న్యూఢిల్లీ: తమ కన్నబిడ్డలతో అభ్యంతరకర విషయాలు చర్చించేందుకు, అసభ్యంగా అనిపించే పదాలు ఉపయోగించేందుకు ఏ తల్లిదండ్రులు ముందుకురారు. అయితే, ఇలాంటి విషయాలు పిల్లలతో చర్చించకపోవడం వల్లే వారికి అవగాహన లేకుండాపోయి సమాజంలో మరోచోట అసభ్యతకు పాల్పడుతున్నారని కొందరి అభిప్రాయం. అయినప్పటికీ ఈ విషయాలు నేరుగా వారితో చర్చించరు. కానీ, ఇటీవల కాలంలో తల్లులు తమ పాత్రను పోషించడంతోపాటు.. తమ పిల్లలు సమాజంలో నడుచుకోవాల్సిన తీరును, పక్కవారికి ఎలా ఆదర్శంగా ఉండాలో అనే విషయాలను ధైర్యంగా నేర్పిస్తున్నారు. అందుకోసం ఇంట్లోగానీ, పాఠశాలల్లోగానీ నేరుగా చర్చించని అంశాలు కూడా వారితో చర్చిస్తున్నారు. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, వేధింపులకు సంబంధించి ఢిల్లీలోని ఎనిమిదిమంది మహిళలు తమ కన్న బిడ్డలకు నేరుగా లేఖలు రాశారు. అందులో వారు, వారి తల్లులు, తల్లుల తల్లులు యుక్త వయసులో నుంచి ఇప్పటి వరకు పడుతున్న వేధింపులను చర్చించారు. అలా పంపించిన వారిలో ప్రీతి అగర్వాల్ మెహతా అనే ఓ గృహిణీ తన పదిహేనేళ్ల కుమారుడు సుయాంశ్తో ఓ లేఖలో కొన్ని వాస్తవాలు పంచుకుంది. దేశంలో మహిళలపై ఆగఢాలు, ఈవ్ టీజింగ్, లైంగిక వేధింపులు, అత్యాచారం, వేధింపులు జరుగుతున్నాయని చెప్పింది. వారి వయసుతో, ఆర్థిక స్థితిగతులతో, వివాహం అంశంతో సంబంధం లేకుండానే వారిపై లైంగిక దాడులు జరుగుతున్నాయని తెలిపింది. ఇలాంటి విషయాలు తెలుసుకునేందుకు కొంత ఇబ్బందిగా అనిపించినా ఇవన్నీ కూడా చాలా సార్లు తాను ఎదుర్కొన్నవేనని, తనకంటే ముందు తన తల్లి కూడా వేధింపులు అనుభవించాల్సి వచ్చిందని చెప్పింది. డిసెంబర్ 16, 2012లో ఢిల్లీలో నిర్భయపై జరిగిన లైంగికదాడి గురించి వివరిస్తూ సమాజంలో బాగా నడుచుకోవాలని తెలిపింది. బాలికలతో మాట్లాడేసమయంలో వారికి కొంత గౌరవాన్ని ఇవ్వాలని, వ్యక్తిగత స్వేచ్చను అడ్డుకోవద్దని చెప్పింది. మహిళలపై జరిగే వేధింపుల విషయంలో ఇప్పటి నుంచే అవగాహన పెంచుకోవాలని ఆ లేఖలో కోరుతూ పలు విషయాలు చెప్పింది.